కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ తమను నిరాశపరిచిందంటూ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ తమను నిరాశపరిచిందంటూ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ బడ్జెట్లో ఏపీకి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కనిపించలేదన్నారు. విభజన చట్టంలోని అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బడ్జెట్లో జరిగిన అన్యాయాలపై మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారని చెప్పారు. త్వరలో ఢిల్లీ వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తామన్నారు.
జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించిన పోలవరానికి రూ. 100కోట్లు ప్రకటించడం చాల దారుణమని ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్ట్.. ఇలా అయితే 500ఏళ్లైనా పూర్తి కాదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావడం అన్నది ఇప్పుడు ప్రశ్న కాదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.