అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం | united state agitation become severe in nellore district | Sakshi
Sakshi News home page

అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం

Sep 28 2013 3:42 AM | Updated on Oct 20 2018 6:17 PM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేం దుకు కృషి చేస్తామని ఎం పీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

సాక్షి, నెల్లూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేం దుకు కృషి చేస్తామని  ఎం పీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యోగులు చేస్తున్న పోరు ఆదర్శనీయమన్నారు.
 
 అక్టోబర్ 2 నుంచి పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 13 జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా, తెలుగు జాతి ప్రజల ఐక్యతే లక్ష్యంగా పోరాటంలో ముందుకు సాగుతామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement