భక్తుల మనోభావాలకు పెద్ద పీట వేస్తున్నాం: టీటీడీ చైర్మన్‌

TTD Chairman YV Subba Reddy Meets Tamil Nadu CM Palaniswami - Sakshi

సాక్షి, తిరుమల :  తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోందని, అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ విధి విధానాలు అమలు చేస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.  చెన్నై నుంచి తిరుమల వస్తూ గురువారం సాయంత్రం అడయార్ లో సీఎం పళని స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా టీటీడీలో చేపడుతున్న సంస్కరణల గురించి వారి మధ్య చర్చ జరిగింది.  భక్తులకు మరింత సులువుగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు సీఎం పలు సూచనలు చేశారు. వసతులను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురు చర్చించారు. అంతకుముందు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి తీర్ధప్రసాదాలను సీఎం పళని స్వామికి అందజేసి శాలువాతో సత్కరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top