టెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించం | Tetku minute allowed to be delayed | Sakshi
Sakshi News home page

టెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించం

Mar 14 2014 6:58 AM | Updated on Sep 2 2017 4:42 AM

తిరుపతిలో ఈ నెల 16వ తేదీ జరిగే టెట్ (ఉపాధ్యా య అర్హత పరీక్ష)కు నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించబోమని డీఈవో బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: తిరుపతిలో ఈ నెల 16వ తేదీ జరిగే టెట్ (ఉపాధ్యా య అర్హత పరీక్ష)కు నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించబోమని డీఈవో బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. పరీక్ష కోసం తిరుపతిలో 82 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఉదయం 16 కేంద్రాల్లో, మధ్యాహ్నం 82 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. శనివారం నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తామని చెప్పారు. హోలీ సందర్భంగా ఈ నెల 17వ తేదీ స్కూళ్లకు సెలవు ప్రకటించామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement