లైంగిక వేధింపులు ... ఉపాధ్యాయులకు దేహశుద్ధి | Teachers resigned due to students sexual harassment in guntur district | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు ... ఉపాధ్యాయులకు దేహశుద్ధి

Dec 10 2014 2:37 PM | Updated on Jul 23 2018 9:13 PM

లైంగిక వేధింపులు ... ఉపాధ్యాయులకు దేహశుద్ధి - Sakshi

లైంగిక వేధింపులు ... ఉపాధ్యాయులకు దేహశుద్ధి

విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేసి... వారి ఉద్యోగాలకు గ్రామస్తులు రాజీనామా లేఖలు రాయించారు.

గుంటూరు: విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేసి... వారి ఉద్యోగాలకు గ్రామస్తులు రాజీనామా లేఖలు రాయించారు. దాంతో సదరు ఉపాధ్యాయులు ఊరి విడిచి వెళ్లి పోయారు. ఆ సంఘటన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మీ అభిప్రాయాలు కాగితంపై తెలపాలంటూ గ్రామస్తులు పాఠశాల విద్యార్థులకు సూచించారు.

పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడుతో పాటు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు రాజేశ్వరరావు, రాఘవలు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు గ్రామస్తులకు అందించిన కాగితాల్లో పేర్కొన్నారు. దాంతో గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజేశ్వరరావు, రాఘవలపై గ్రామస్తులు దాడి చేసి దేహశుద్ధి చేసి... బలవంతంగా రాజీమానా లేఖలు రాయించారు. అనంతరం వారు ఊరు విడిచి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement