నెల్లూరు నగరంలోని భవానీ రెసిడెన్సీలో ఓ టీచర్ పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు.
కావలి (నెల్లూరు): నెల్లూరు నగరంలోని భవానీ రెసిడెన్సీలో ఓ టీచర్ పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సురేష్‌బాబు(45) కావలి పరిధిలోని రుద్రకోట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు . కాగా, బుధవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్లకుండా నెల్లూరులో లాడ్జీ తీసుకొని ఉన్నాడు. లాడ్జీలో రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున తలుపులు తీసిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు 'నన్ను క్షమించు భారతి' అని రాసి ఉన్న కాగితం కనిపించింది. దీంతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా, అతని మృతికి గల కారణాలు తెలియలేదని, కుటుంబ కలహాలే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.