వైఎస్సార్‌సీపీ నాయకుడి కారు ధ్వంసం | TDP Leaders Damaged YSRCP Leader Car in Visakhapatnam | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడి కారు ధ్వంసం

Feb 6 2019 6:30 AM | Updated on Feb 6 2019 6:30 AM

TDP Leaders Damaged YSRCP Leader Car in Visakhapatnam - Sakshi

కారుపై లాగేసిన స్టిక్కర్లు

విశాఖపట్నం, గాజువాక: జీవీఎంసీ 60వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడి కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వార్డులోని చిట్టినాయుడు కాలనీకి చెందిన రవివర్మ తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై అభిమానంతో తన కారును వైఎస్సార్‌సీపీ స్టిక్కర్లతో అలంకరించుకున్నారు. కారు వెనుక ‘నిన్ను నమ్మం బాబు’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్‌ను అతికించారు. తన ఇంటి వద్ద నిలిపి ఉంచిన కారును సోమవారం రాత్రి సమయంలో కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. కారు ముందు అద్దాన్ని పగుల గొట్టడంతోపాటు స్టిక్కర్లను మొత్తం చింపేసి చిందరవందర చేశారు. పలుచోట్ల కారు పెయింటింగ్‌ను కూడా చెక్కేశారు. ఈ విషయంపై గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రవివర్మ తెలిపారు. పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement