ప్రజాసంకల్పయాత్ర @ 200 కి.మీ | PrajaSankalpaYatra Marks 200 Km's In Kurnool | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర @ 200 కి.మీ

Nov 22 2017 10:53 AM | Updated on Jul 25 2018 4:53 PM

PrajaSankalpaYatra Marks 200 Km's In Kurnool - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, ముద్దవరం( కర్నూలు జిల్లా ) : రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతూ కొనసాగుతున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200 కి.మీ మైలు రాయిని చేరుకుంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలోని ముద్దవరం గ్రామానికి చేరుకోవడంతో 200 కిలోమీటర్లు నడిచినట్లు అయింది.

కాగా, ప్రజాసంకల్పయాత్రతో తమ కష్టాలను తెలుసుకోవడానికి వస్తున్న వైఎస్‌ జగన్‌ కోసం ముద్దవరం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో ముద్దవరం గ్రామం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఎండను సైతం లెక్కచేయకుండా వైఎస్‌ జగన్‌ ప్రజలు కోసం తరలివస్తున్నారు. తమ బాధలను జననేతతో చెప్పుకుంటున్నారు. ముద్దవరం గ్రామంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement