
సాక్షి, ప్రకాశం : ప్రజాసంకల్పయాత్ర పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మరో మైలు రాయి దాటింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల వద్ద ఆయన 1300 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు జననేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మొక్కను నాటిన వైఎస్ జగన్.. ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. అటుపై తన పాదయాత్రను ఆయన ముందుకు కొనసాగించారు. నేడు ప్రజాసంకల్పయాత్ర 97వ రోజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సాయంత్రం మార్కాపురం నియోజకవర్గంలోకి ఆయన అడుగుపెట్టనున్నారు.