
సాక్షి, పెద్దాపురం(తూర్పుగోదావరి జిల్లా): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 222వ రోజు షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత శనివారం ఉదయం నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తిమ్మాపురం, కాట్రావుల పల్లి క్రాస్, సీతా నగరం శివారు, జగ్గంపేట వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.