టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఏమరుపాటు శనివారం అసెంబ్లీలో నవ్వులు పూయించింది.
ఎమ్మెల్యే సారీ..అసెంబ్లీలో నవ్వులు
Mar 25 2017 6:27 PM | Updated on Sep 5 2017 7:04 AM
అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఏమరుపాటు శనివారం అసెంబ్లీలో నవ్వులు పూయించింది. ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగానే జీరో అవర్ అనుకొని రామకృష్ణ సందర్భం లేని ప్రశ్న వేయడంతో అందరూ విస్తుపోయారు.
ఆయన మాత్రం తన ధోరణిలో తాను ప్రశ్న అడుగుతూ పోయారు. చివరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు కలుగజేసుకొని రామకృష్ణా ఇది ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ కాదు అని గుర్తు చేయాల్సి వచ్చింది. అప్పటికి తేరుకున్న రామకృష్ణ.. సారీ, ఇది ప్రశ్నోత్తరాల సమయమా! అని కూర్చోవడంతో సభంతా ఘొల్లుమంది. అధికార పార్టీ సభ్యులు ఎంత బాగా సభా కార్యక్రమాలు వింటున్నారో అంటూ విపక్ష సభ్యులు ఎద్దేవా చేశారు.
Advertisement
Advertisement