
'రాజకీయ కారణాలతోనే రాష్ట్ర విభజన'
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించడానికి చూస్తోందని ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి విమర్శించారు.
నెల్లూరు:కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించడానికి చూస్తోందని ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి విమర్శించారు. రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించడానికి యత్నిస్తోందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ అవలంభిస్తున్న తీరుపై మండిపడ్డారు. యూపీఏను విభజించాలని మాయావతి తీర్మానం చేసినా కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ ద్వంద విధానాలను అవలంభిస్తోందన్నారు. తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి జనాదరణ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కొందరు నేతలు ఉత్తుత్తి రాజీనామాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మేకపాటి డిమాండ్ చేశారు.