ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల | Intermediate 1st year results 2014 released | Sakshi
Sakshi News home page

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల

Apr 28 2014 2:54 PM | Updated on Sep 2 2017 6:39 AM

ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి.

హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. గవర్నర్ నరసింహన్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాల సీడీని విడుదల చేశారు.55.48 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

అలాగే ఈసారి ఫలితాల గ్రేడులతో పాటు మార్కులను కూడా అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఫలితాలను బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ద్వారా 1100కు, ఇతర ల్యాండ్ లైన్, మొబైల్ ద్వారా 1800-425-1110 నంబర్లకు ఫోన్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ పరీక్షా ఫలితాలను  http://www.sakshieducation.com/results2014/inter/jrintergen.htm వెబ్ సైట్  ద్వారా తెలుసుకోవచ్చు. కాగా మే మొదటి వారంలో సెకండియర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement