తూర్పు గోదావ‌రిలో 24 గంట‌ల పాటు కర్ఫ్యూ | Instructions To Enforce Curfew In East Godavari District For 24 hours | Sakshi
Sakshi News home page

తూర్పు గోదావ‌రిలో 24 గంట‌ల పాటు కర్ఫ్యూ

Jul 18 2020 2:46 PM | Updated on Jul 18 2020 3:24 PM

Instructions To Enforce Curfew In  East Godavari District For 24 hours - Sakshi

సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి జిల్లా) :  క‌రోనా కేసులు అధిక‌వుతున్న నేప‌థ్యంలో 24 గంట‌ల పాటు జిల్లా వ్యాప్తంగా క‌ర్ఫ్యూ అమ‌లుకు క‌లెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రేపు(ఆదివారం) ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్న‌ట్లు తెలిపారు. అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లు, మెడిక‌ల్ షాపుల‌కు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంద‌ని, మిగ‌తా అన్ని సేవ‌లను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఎవ‌రైనా రోడ్ల మీద తిరిగితే వారిపై ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు అమ‌లాపురం రూరల్‌లోని  బండారులంక  గ్రామానికి చెందిన వ్యక్తి క‌రోనా కార‌ణంగా కిమ్స్ హాస్పిట‌ల్‌లో మృతిచెందాడు. 

రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధి పోలీసు స్టేషన్లలో క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ 14 మంది పోలీసు సిబ్బందికి క‌రోనా సోకిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. బొమ్మూరు స్టేషన్ ప‌రిధిలో ఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు స‌హా నలుగురు కానిస్టేబుళ్లు, ధవళేశ్వరం స్టేషన్ ప‌రిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లు, క‌డియం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఓ కానిస్టేబుల్‌కి క‌రోనా నిర్ధార‌ణ అయిన‌ట్లు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. వీరిలో కొంద‌రు హోం క్వారంటైన్‌లో ఉండగా, మ‌రికొంద‌రిని బొమ్మూరు క్వారంటైన్‌కి త‌ర‌లించారు. చింతూరు ఐటీడీఏ పీవో కార్యాలయంలో ఇద్దరికి కరోనా సోకింది. రేఖపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారికీ కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. (కరోనా పరీక్ష చేయకుండానే వైరస్‌ కబళించింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement