కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు: కోట్ల | I don't quit congress: kotla surya prakash reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు: కోట్ల

Oct 4 2013 8:55 PM | Updated on Jun 2 2018 4:41 PM

కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు: కోట్ల - Sakshi

కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు: కోట్ల

సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే తెలంగాణ నోట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు.

న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే తెలంగాణ నోట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి నిరసనగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అయితే కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన వారి గురించి తనకు తెలియదన్నారు.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్టున్నట్టు తెలిపారు. ఈ సాయంత్రం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసి తన రాజీనామా లేఖ ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి కూడా అంతకుముందు తమ పదవులకు రాజీనామాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement