పాఠశాలల ప్రారంభానికి పకడ్బందీ ఏర్పాట్లు | Government Is Ready To Reopen Schools In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పాఠశాలల ప్రారంభానికి పకడ్బందీ ఏర్పాట్లు

May 19 2020 8:40 PM | Updated on May 19 2020 8:40 PM

Government Is Ready To Reopen Schools In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆగష్టు 3 నుంచి పాఠశాలలను ప్రారంభించడానికి అన్ని రకాల చర్యలను పకడ్బందీగా చేపట్టాం. ప్రత్యేకమైన ఎస్‌ఓపీ రూపొందించాం. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఓపీని విధిగా అమలు చేయాలి. విద్యార్థులు భౌతిక దూరం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి స్కూల్‌ని తెరిచేముందు డిసిన్ఫెక్షన్‌ చేయించాలి. చదవండి: ఏపీఎస్‌ ఆర్టీసీకి గ్రీన్‌ సిగ్నల్‌ 

స్కూల్‌ గేట్‌ దగ్గర శానిటైజర్లు ఖచ్చితంగా ఉంచాలి. ప్రతీ విద్యార్థి, టీచర్‌ మాస్క్‌లు ధరించాలి. టీచర్లు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఖచ్చితంగా గ్లౌజులు ధరించాలి. పిల్లలకు జ్వరం, జలుబు వంటి లక్షణాలున్నాయంటే తక్షణమే ఇంట్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. నాడు నేడుకి ప్రత్యేకంగా జేసీ 2ని నియమించాం. నాడు నేడు పనులు వేగంగా పూర్తిచేసి మౌలిక వసతులు కల్పిస్తామని' మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఆగస్ట్‌ 3న ఏపీలో పాఠశాలలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement