బాలికపై గ్యాంగ్‌ రేప్‌ | Gang rape on girl | Sakshi
Sakshi News home page

బాలికపై గ్యాంగ్‌ రేప్‌

May 22 2017 2:28 AM | Updated on Jul 26 2018 5:23 PM

బాలికపై గ్యాంగ్‌ రేప్‌ - Sakshi

బాలికపై గ్యాంగ్‌ రేప్‌

విజయవాడలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు.

- దారుణానికి దారితీసిన ఫేస్‌బుక్‌ పరిచయం
- లైంగికదాడి చేసిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు


విజయవాడ: విజయవాడలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. నగరంలో మాచవరా నికి చెందిన ఓ మైనర్‌ బాలికకు ఫేస్‌బుక్‌ ద్వారా అఖిల్‌ అనే యువకునితో పరిచయం ఏర్పడి.. రెండేళ్లుగా అతనితో సన్నిహితంగా ఉంటోంది. ఇటీవల 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో బాలిక తండ్రి ఇంటర్మీడియెట్‌ ట్యూషన్‌లో చేర్పించారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల ప్రాంతంలో బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి అఖిల్‌ను కలిసింది. అఖిల్‌ తన స్నేహితుడు అజయ్‌ శ్యామ్యూల్‌తో కలిసి బైక్‌పై బాలికను విజయవాడ శివారు ప్రాంతంలో ముస్తాబాద్‌కు వెళ్లారు.

అక్కడ వారు మద్యం తాగడంతో పాటు బాలికచేత కూడా తాగించారు. అనంతరం రాత్రివేళ ఆ బాలికను బీఆర్‌టీఎస్‌ రోడ్డుపై వదిలి వెళ్లారు. ఒంటరిగా వెళ్తుండగా.. ఆ బాలికకు మాయమాటలు చెప్పి నలుగురు యువకులు వారధివైపు తాడేపల్లికి తీసుకెళ్లి అక్కడ మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి తిరిగి మధురానగర్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటనకు కారకులైన అఖిల్‌పై ఫోక్స్‌ యాక్ట్‌ సహా లైంగిక దాడి చేసిన మధురానగర్‌కు చెందిన శ్రీకాంత్, అభిషేక్, పవన్, సునీల్‌లపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement