సినీ, టీవీ నటుడు కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య | Film, TV actor Kalyan Chakravarthy suicide | Sakshi
Sakshi News home page

సినీ, టీవీ నటుడు కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య

May 21 2014 2:29 AM | Updated on Nov 6 2018 7:53 PM

సినీ, టీవీ నటుడు కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య - Sakshi

సినీ, టీవీ నటుడు కల్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య

సినీ, టీవీ నటుడు కొత్తపల్లి కల్యాణ్ చక్రవర్తి (30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆయన స్వగ్రామం. ఆ గ్రామానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ కనకదుర్గ, కొత్తపల్లి సురేంద్ర ఆయన తల్లిదండ్రులు. ఆయనకు ఇంకా పెళ్లికాలేదు.

భీమవరం క్రైం,సినీ, టీవీ నటుడు కొత్తపల్లి కల్యాణ్ చక్రవర్తి (30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆయన స్వగ్రామం. ఆ గ్రామానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ కనకదుర్గ, కొత్తపల్లి సురేంద్ర ఆయన తల్లిదండ్రులు. ఆయనకు ఇంకా పెళ్లికాలేదు. ఒక ‘వి’చిత్రం సినిమాలో వచ్చీరాని ఇంగ్లిష్‌లో మాట్లాడే పాత్రతో బాగా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణ్ చక్రవర్తి పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన తరచూ స్వగ్రామం భీమవరం వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తమ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని వారి బంధువులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement