రైలు బండి.. విజ్ఞానం నిండి.. | Filled with the knowledge of the wagon train .. .. | Sakshi
Sakshi News home page

రైలు బండి.. విజ్ఞానం నిండి..

Nov 1 2014 2:19 AM | Updated on Sep 2 2017 3:39 PM

రైలు బండి.. విజ్ఞానం నిండి..

రైలు బండి.. విజ్ఞానం నిండి..

సంగడిగుంట(గుంటూరు) గుంటూరుకు చేరుకున్న సైన్స్ ఎక్స్‌ప్రెస్ బయోడైవర్సిటీ స్పెషల్ రైలుకు విశేష స్పందన లభించింది.

సంగడిగుంట(గుంటూరు)
 గుంటూరుకు చేరుకున్న సైన్స్ ఎక్స్‌ప్రెస్ బయోడైవర్సిటీ స్పెషల్ రైలుకు విశేష స్పందన లభించింది. రైలులోని విశేషాలను తిలకించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లోని ఏడో నంబర్ ప్లాట్‌ఫాంలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎన్.కె.ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. డీఆర్‌ఎంతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న విభిన్న ప్రాణులు తదితర అంశాలతో గుంటూరు చేరుకున్న ఈ రైలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.

విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సంచార విజ్ఞాన రైలు బండిలో సైన్స్‌కు సంబంధించిన పరిశోధన ఫలితాను పొందుపరిచారు. భూమిపై ఉన్న జల వనరులు, సుస్థిర వాతావరణం, శక్తి వినియోగం తదితర అంశాలపై నమూనాలను వాలంటీర్లు చక్కగా వివరిస్తున్నారు. మొదటి రోజున దాదాపు ఏడువేలమంది ఈ ప్రదర్శనను తిలకించినట్లు ఆన్‌బోర్డ్ మేనేజర్ రాఘవ్ పాడ్య వెల్లడించారు. రైలులోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, అగ్గిపెట్టెలు తీసుకురావద్దని ఆయన సూచించారు.  సైన్స్ ఎక్స్‌ప్రెస్ బయోడైవర్సిటీ స్పెషల్ రైలులో బొమ్మల వద్ద ఇంగ్లిష్‌లో మాత్రమే వివరణలు ఉండడంతో సందర్శకులు కొంత ఇబ్బంది పడ్డారు. వివరించేందుకు ఉన్న వాలంటీర్లు ఇంగ్లిష్, హిందీ మాత్రమే తెలిసివారు కావడంతో సందర్శకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు.

Advertisement
Advertisement