
'ప్రత్యేక హోదా తేస్తావా లేక రాజీనామా చేస్తావా'
ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శనివారం హైదరాబాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శనివారం హైదరాబాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదవిలో లేనప్పుడు ఢిల్లీలో ధర్నా చేసిన చంద్రబాబూ... ఇప్పుడు సీఎంగా ఉండి కేంద్ర చేస్తున్న అన్యాయంపై పెదవి విప్పకపోవడం దారుణమన్నారు. బాబు అధికారంలోకి రాగానే ప్రజల నెత్తిన భారాలు మోపుతున్నారని ఆరోపించారు.
ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని లేకుంటే రాజీమానా చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యను రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 18న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు.