'పురందేశ్వరి కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచారు' | Congress MPs Ponnam prabhakar, rajaiah takes on purandeswari | Sakshi
Sakshi News home page

'పురందేశ్వరి కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచారు'

Mar 8 2014 2:18 PM | Updated on Mar 29 2019 9:18 PM

'పురందేశ్వరి కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచారు' - Sakshi

'పురందేశ్వరి కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచారు'

కాంగ్రెస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన పురందేశ్వరిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన పురందేశ్వరిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిస్తే....పురందేశ్వరి కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచిందని ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య విమర్శించారు.

రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీలో చేరికను పురందేశ్వరి ఎలా సమర్థించుకుంటారని వారు ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రి పదవి అనుభవించిన పురందేశ్వరి పార్టీకి రాజీనామా చేసి మతతత్వ పార్టీలోకి మారడం సిగ్గుచేటని అన్నారు. పురందేశ్వరి శుక్రవారం బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ నివాసంలో అగ్రనేతల సమక్షంలో కమలతీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement