‘చంద్రబాబు సింగపూర్ ఏజెంట్’ | Chief Minister Chandrababu Naidu Singapore agent says CPI Ravula Venkaiah | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు సింగపూర్ ఏజెంట్’

Jan 7 2015 1:06 AM | Updated on May 29 2018 11:47 AM

‘చంద్రబాబు సింగపూర్ ఏజెంట్’ - Sakshi

‘చంద్రబాబు సింగపూర్ ఏజెంట్’

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ఏజెంట్‌గా అవతారమెత్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య

మలికిపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సింగపూర్ ఏజెంట్‌గా అవతారమెత్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పేర్కొన్నారు. మంగళవారం మలికిపురంలో జరిగిన సీపీఐ రాజోలు ఏరియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు తక్షణం నిర్మించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అంశంలో బాబు రైతులను, డ్వాక్రా మహిళలను దారుణంగా మోసగించారన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో మలికిపురంలో నిర్వహిస్తామన్నారు. మీసాల సత్యనారాయణ, దేవ ముసలయ్య. కె.మధు, కేశవశెట్టి, దేవ రాజేంద్ర  ప్రసాద్, పంపన ప్రసాదరావు, గెడ్డం ప్రభాకరరావు, కొండా సత్తిబాబు, పిచ్చిక గంగాధరరావు పాల్గొన్నారు. ఆహ్వాన కమిటీ ఏర్పాటు : మలికిపురంలో జరిగే సీపీఐ రాష్ట్ర మహా సభల ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షులుగా దేవ ముసలయ్య, అధ్యక్షులుగా చెల్లుబోయిన కేశవశెట్టి, కార్యదర్శిగా దేవ రాజేంద్రప్రసాద్, సభ్యులను ఎన్నకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement