'చంద్రబాబుకు స్విస్ బ్యాంకులో ఖాతాలు' | Chandrababu have cash in swiss bank | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు స్విస్ బ్యాంకులో ఖాతాలు'

Jan 21 2015 12:09 PM | Updated on Aug 13 2018 4:11 PM

'చంద్రబాబుకు స్విస్ బ్యాంకులో ఖాతాలు' - Sakshi

'చంద్రబాబుకు స్విస్ బ్యాంకులో ఖాతాలు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్విస్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు దాచుకున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భాస్కరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం ఇష్టం లేక జీతాలకు డబ్బులే లేవంటూ చంద్రబాబు బీద ఆరుపులు అరుస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో రూ. 375 కోట్ల మిగుల బడ్జెట్ ఉందని జనవరి 7న చంద్రబాబు ప్రభుత్వం మంత్రులు, ఉన్నతాధికారు సమావేశంలో ప్రకటించిన సంగతిని భాస్కరరెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు లేవని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలోని మిగులు బడ్జెట్ను సీఎం చంద్రబాబు ప్రత్యేక విమాన పర్యటనలకే ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ చెబుతున్న చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో పర్యటించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

రూ. 50 కోట్లతో హైదరాబాద్లోని సీఎం కార్యాలయం మరమ్మతలు చేయించారని... అలాగే కోట్లు ఖర్చు పెట్టి విజయవాడలో సమావేశాలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దావోస్ నుంచి సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నటో అంటు సందేహం వ్యక్తం చేశారు.దీన్ని బట్టి చంద్రబాబుకు స్విస్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయిని అన్నారు. స్విస్ బ్యాంక్లోని ఖాతాల్లో నగదు చెక్ చేసుకోవడానికి చంద్రబాబు స్విట్జర్లాండ్ వెళ్తున్నట్లున్నారని భాస్కరరెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement