'అధికారులపై ఆగ్రహం బాబు కుట్రలో భాగం' | chandrababu fire on officials is not serious thing, says madhu | Sakshi
Sakshi News home page

'అధికారులపై ఆగ్రహం బాబు కుట్రలో భాగం'

Jan 24 2017 6:32 PM | Updated on Mar 23 2019 9:10 PM

'అధికారులపై ఆగ్రహం బాబు కుట్రలో భాగం' - Sakshi

'అధికారులపై ఆగ్రహం బాబు కుట్రలో భాగం'

తెలుగుజాతిని చంద్రబాబు అవమానిస్తున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు.

విజయవాడ: తెలుగుజాతిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతిపక్షాలతో చంద్రబాబు కలిసి రావాలని కోరారు. హోదా కోసం 26న విశాఖలో యువత చేపట్టే నిరసన కార్యక్రమానికి తమ పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కూడా పాల్గొనాలని సూచించారు. వంశధార ప్రాజెక్టులో రైతుల తిరుగుబాటుఫై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం మోసం చేయడమేనని ఆయన దుయ్యబట్టారు.

గతంలో రూ.421 కోట్లు ఇస్తామని జీవో ఇచ్చినా ఇప్పటికీ చిల్లిగవ్వకూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. అధికారులపై చంద్రబాబు ఆగ్రహం కుట్రలో భాగమేనని తెలిపారు. వంశధార నిర్వాసితులకు న్యాయం చేయకుంటే ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మధు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement