'విభజన ఎలా చేయాలో బాబును చెప్పమనండి' | Chandra Babu Naidu spell out how to divide the state: Digvijaya Singh | Sakshi
Sakshi News home page

'విభజన ఎలా చేయాలో బాబును చెప్పమనండి'

Oct 7 2013 12:17 PM | Updated on Sep 27 2018 5:59 PM

'విభజన ఎలా చేయాలో బాబును చెప్పమనండి' - Sakshi

'విభజన ఎలా చేయాలో బాబును చెప్పమనండి'

రాష్ట్ర విభజన ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు.

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామన్నారు.  విభజన పద్ధతి బాగోలేదని చంద్రబాబు అంటున్నారని....విభజన ఏవిధంగా ఉంటే బాగుంటుందో ఆయనే చెప్పాలన్నారు.

సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తమ ఆందోళనలు కేంద్ర మంత్రుల బృందానికి తెలియచేయాలని కోరారు. సీమాంధ్రులు ఆందోళన విరమించాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులపై దాడి గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు చెప్పారు. హైదరాబాద్లో అందరికీ రక్షణ కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement