కదులుతున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి రైల్వేస్టేషన్‌లో జరిగింది.
రైలు కిందపడి మహిళకు తీవ్రగాయాలు
Oct 17 2013 3:49 AM | Updated on Oct 17 2018 6:06 PM
డి చ్‌పల్లి, న్యూస్‌లైన్ :కదులుతున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి రైల్వేస్టేషన్‌లో జరిగింది. స్థానికులు, రైలులో ఉన్న ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన గంగమణి బుధవారం సాయంత్రం కామారెడ్డి నుంచి బోధన్ వెళుతున్న పుష్‌పుల్ రైలులో ప్రయాణిస్తుంది. ఇందల్వాయి రైల్వే స్టేషన్‌లో ఆగిన తర్వాత మళ్లీ రైలు ముందుకు కదిలింది. ఆ సమయంలో రైలుబోగి డోర్ వద్ద ఉన్న గంగమణి ప్రమాదవశాత్తు కిందపడింది. ప్లాట్‌ఫాంకు రైలుకు మధ్యలో పడటంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. బోగిలో ఉన్నవారు వెంటనే చైన్‌లాగారు. దీంతో స్టేషన్ నుంచి అప్పుడే కదులుతుండ టంతో తక్కువ వేగంతో ఉన్న రైలు వెంటనే నిలిచిపోయింది. వెంటనే ప్రయాణికులు గంగమణిని ఫ్లాట్‌ఫాంపైకి చేర్చారు. అప్పటికే ఆమె కుడికాలు నాలుగు వేళ్లు తెగిపోవడంతో పాటు గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement