తప్పుడు వార్తలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌

AP Government Condemns Over False Propaganda On Investments - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రసారం చేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నట్లుగా... ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ ఏపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. దురుద్దేశంతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విషపూరితమైన ఇలాంటి ప్రయత్నాలను గమనిస్తున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అవినీతిరహితంగా, పారదర్శక విధానంతో ముందుకెళుతుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేలా వివిధ సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ యాజమాన్యంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top