కడప ఆకాశవాణికి మొబైల్‌ యాప్‌లో చోటు

Aakasavaani Kadapa Center Broadcasts On Mobile App - Sakshi

ప్రారంభమైన ప్రసారాలు 

సాక్షి, కడప : ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలను ఇక మొబైల్‌ యాప్‌లో వినవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆకాశవాణి ప్రసారాలు వినేందుకు ప్రసార భారతి మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. తొలి విడతగా ఈనెల 17న మన ఆకాశవాణి కడప కేంద్రం కంటే ఎంతో వెనుక ప్రారంభమైన రేడియో కేంద్రాలకు ఈ యాప్‌ సౌకర్యం కల్పించింది. ఆకాశవాణి కడప కేంద్రానికి ఈ సౌకర్యం కల్పించపోవడం గమనించిన జిల్లా సాహితీవేత్తలు, కళాకారులు ఆశ్చర్యపోయారు. ‘సాక్షి’ దినతిపత్రిక జిల్లా సంచికలో ఈనెల 18న ‘అయ్యో ఆకాశవాణి’ శీర్షికన ఈ విషయాన్ని ప్రత్యేక కథనంగా ప్రచురించింది. స్థానిక అధికారుల దృష్టి కి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో స్పందించిన అధికారులు స్థానికుల నిరసనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు మొబైల్‌ యాప్‌లో ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలకు కూడా చోటు కల్పించారు. ఈనెల 22వ తేది సాయంత్రం నుంచి ఈ ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ యాప్‌ ద్వారా శ్రోతలు వింటున్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి  తీసుకు వచ్చినందుకు కడప శ్రోతలు అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని కడప కేంద్రం ప్రసారాలను  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా వినవచ్చు.

యాప్‌ సౌకర్యం ఇలా
గుగూల్‌ ప్లే స్టోర్‌లో న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌ ప్రసారభారతి లైవ్‌ యాప్‌ అని టైప్‌ చేసి సెర్చి చేస్తే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ను ఓపెన్‌చేశాక స్క్రీన్‌ పైభాగాన కనిపించే రేడియోబొమ్మను క్లిక్‌ చేయాలి. అన్ని స్టేషన్ల ట్యాబ్‌లు కనిపిస్తాయి. వాటిలో ఇష్టమైన కేంద్రాలను ఫేవరేట్‌ కేంద్రాలుగా ఒక క్రమంలో అమర్చుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్‌తో తెలుగు వారు ఎక్కడున్నా మన కేంద్రం రేడియో ప్రసారాలను వినవచ్చు. అరచేతిలోని మొబైల్‌లో ఆకాశవాణి ప్రసారాలను ఆస్వాదించవచ్చు. ఆంగ్లం, హిందీ భాషల్లో వార్తలు, దూర దర్శన్‌ ఛానళ్ల కార్యక్రమాలను  కూడా వినవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top