
ఏకాభిప్రాయంతోనే రాజధాని ప్రకటించాలి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షంతో చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయం
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షంతో చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడారు.
కాబోయే రాజధానిలో అభివృద్ధి పేరిట కొత్తగా పెట్టబోయే సంస్థలన్నీ ఒకేచోట పెట్టి హైదరాబాద్‌లా సర్వనాశం చేయొద్దని సూచించారు. వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే సిమెంటు, స్టీలు, సైన్సు సిటీ వంటివి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నారు.