breaking news
-
ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వమే ఉండదు: ఎమ్మెల్యే విరూపాక్షి
సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం(ఫిబ్రవరి4) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విరూపాక్షి మీడియాతో మాట్లాడారు.‘కొంతమంది ఐఏఎస్,ఐపీఎస్‌లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ బద్దంగా గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న నాకు అధికారులు గౌరవం ఇవ్వడం లేదు. ఓడిపోయిన టీడీపీ నాయకులు చెప్పినట్టు అధికారులు చేయకడం ఏంటి?ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ లేకుండా చేశారు. ప్రోటోకాల్ పాటించాలని కూడా ఈ అధికారులకు తెలియదా? ఎమ్మెల్యే మాటలకు గౌరవం ఇవ్వరా? మేము ప్రజలు ఓట్లేస్తే గెలిచాం. ఎమ్మెల్యేగా ప్రజాసమస్యలను చెబితే అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలి. అధికారులు కూటమి నేతల మోచేతి నీళ్లు తాగొద్దు. ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే ఉండదన్న విషయాన్ని అధికారులు గ్రహించాలి.ఎమ్మెల్యేగా గెలిచిన మేము అసెంబ్లీకి వెళ్తామే తప్ప టీడీపీ ఇన్ఛార్జ్లు వెళ్లరు. ఎవరి విలువ ఏంటో అధికారులు గుర్తించి వ్యవహరిస్తే మంచిది. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే.పరిటాల శ్రీరామ్‌కు ప్రాణరక్షణ కావాలని అడిగితే అదనంగా మరో ఇద్దరు గన్మెన్లను వైఎస్ జగన్ కేటాయించారు. పార్టీలు చూడకుండా వైఎస్ జగన్ అందరికీ న్యాయం చేశారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏపీలో మర్డర్లు జరుగుతుంటాయి. వైఎస్ జగన్ ఇలాంటి అరాచకాలకు వ్యతిరేకం.చంద్రబాబు పాలనలో మహిళలు,ఆడపిల్లలకు రక్షణే లేదు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఇప్పుడు ఏ వీధిలోకి వెళ్లినా మందుబాబులే కనిపిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో కరోనా వచ్చినా సంక్షేమ పథకాలను ఆపలేదు.చంద్రబాబు ఏ పథకాన్నీ అమలు చేయడం లేదు.లోకేష్,పవన్ కళ్యాణ్ కాలర్‌ను ప్రజలు పట్టుకునే రోజు దగ్గర్లోనే ఉంది’అని విరూపాక్షి హెచ్చరించారు. -
తప్పయింది క్షమించండి.. భూమన కాళ్ల మీద పడ్డ కార్పొరేటర్లు
సాక్షి, తిరుపతి జిల్లా: ఉత్కంఠభరితంగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ (Tirupati Deputy Mayor) పదవి ఎన్నికల్లో కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారంటూ నలుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి, భూమన కరుణాకర్‌రెడ్డి (bhumana karunakar reddy) కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైఎస్సార్సీపీ (ysrcp corporators) కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నలుగురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. పశ్చాత్తాపంతో తమను క్షమించమని వేడుకుంటూ భూమన కరుణాకరరెడ్డిని మేం నలుగురం (కార్పొరేటర్లు) అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్, అమరనాథ్ రెడ్డిలు ప్రాధేయపడ్డాం. తామంతా వైఎస్సార్సీపీ అధినతే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోరుకునే వాళ్ళమని, మమ్మల్ని భయపెట్టి, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారు.వాళ్ళకి భయపడి ఓటు వేయాల్సి వచ్చింది, తప్పు జరిగి పోయింది క్షమించమని కరుణాకర్ రెడ్డిని వేడుకుంటున్నాం: అనీష్ రాయల్ ఎత్తుకెళ్లి మాపై భౌతికంగా దాడి చేసి, ఇబ్బందులు పెట్టారు. ఓటు వేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు..భయపెట్టారు: అనీష్ రాయల్ , అనిల్, మోహన్ కృష్ణ యాదవ్నన్ను ఎంతగా భయపెట్టినా టీడీపీకు అనుకూలంగా ఓటు వేయను అని స్పష్టం చేశాను. భయపెట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. నేను ఎవరికీ ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నాను.నేను వైఎస్సార్సీపీలో గెలిచాను, ఆ పార్టీలోనే చివరి వరకు కొనసాగుతా. జరిగిన పరిస్థితులు అర్థం చేసుకుంటారని, పశ్చాత్తాపంతో కరుణాకర్ రెడ్డి వద్దకు వచ్చాను: 5వ డివిజన్ కార్పొరేటర్ అమరనాథ్ రెడ్డి -
దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం ఎదురైంది. రెండు సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పటికీ సౌమ్య పట్ల తీవ్ర వివక్ష చూపించింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల వేళ సౌమ్యను డమ్మీగా మార్చింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్‌గా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతిని ఎమ్మెల్యే సౌమ్య ప్రతిపాదించారు. ఎమ్మెల్యే చెప్పిన కౌన్సిలర్‌కు కాకుండా మరొకరికి అధిష్టానం బీ ఫామ్ ఇచ్చింది.తాను చెప్పిన కౌన్సిలర్‌కే ఛైర్మన్ ఇవ్వాలని సౌమ్య పట్టుబట్టారు. సౌమ్య ప్రతిపాదనలను చెత్తబుట్టలో వేసిన అధిష్టానం.. కృష్ణకుమారికి బీ ఫామ్ ఇచ్చింది. దీంతో అధిష్టానంపై ఎమ్మెల్యే సౌమ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో గత్యంతరం లేక సభ్యులు.. కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టానం సూచించిన అభ్యర్ధికే ఓటేశారు. -
పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్సార్సీపీ నేతలు తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నేతలు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మల్లాది విష్ణు. కావటి మనోహర్ ఉన్నారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ప్రలోభాలకు గురి చేసి కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. డిప్యూటి మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా?.కిడ్నాప్ చేయడానికి దాడులు చేయడానికి వెనకడం లేదు. ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇలాంటి చర్యలు ఏంటని అడుగుతున్నా. హూకోర్టు ఆదేశాలు కూడా పోలిసులు అమలు చేయడం లేదు. ఏనీలో అక్రమాలకు వంత పాడుతున్న అధికారులు అందరూ చేసిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
‘పచ్చ’ తాలిబన్లు.. కూటమి గూండాల విధ్వంసకాండ
Updates:మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలు.. మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యం⇒కాకినాడ జిల్లా: తునిలో మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నికలలో మరోసారి టీడీపీ గూండాలు దౌర్జన్యానికి దిగారు. నిన్నటిలాగే ఇవాళ కూడా మున్సిపల్ కౌన్సిల్లోకి టీడీపీ రౌడీలు దౌర్జన్యంగా ప్రవేశించారు. మద్యం మత్తులో నిన్న మహిళ కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గుండాలు.. ఈ రోజు కూడా కౌన్సిల్ హల్ లోకి చొచ్చుకు వచ్చారు. కౌన్సిల్ హల్లో వెళ్లే అవకాశం లేకపోవడంతో మున్సిపల్ ఛైర్మన్ సుధాబాలు,కౌన్సిలర్లు బయటే బైఠాయించారు. యనమల డైరక్షన్లో ప్రేక్షక పాత్రకు పోలీసులు పరిమితమయ్యారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరావు పత్తాలేకుండా పోయారు. ⇒మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో కూటమి నేతలు అరాచక పర్వానికి తెరలేపారు. బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాగాకు కుయుక్తులు పన్నుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు.⇒టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది.⇒కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు.⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు. -
పోలీసులు, కూటమి నేతలు కుమ్మక్కు: కాసు మహేష్‌రెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీ నేతలు మండిపడుతున్నారు. పిడుగురాళ్ల పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు కాగా, గతంలో 33 వార్డులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఒక కౌన్సిలర్‌ను టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు.మున్సిపల్ వైస్ చైర్మన్ చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికల నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువడింది. నిన్న(సోమవారం) వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళనివ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వకుండా టీడీపీ రౌడీలు అడ్డుకున్నారు. దీంతో ఈరోజుకు వైఎస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ, పోలీసులు, కూటమి నాయకులు కుమ్మక్కైపోయారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులకు పోలీసులు అండగా ఉన్నారు. పిడుగురాళ్లలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. కిడ్నాప్ పైన కొంతమంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ఇంటి నుంచి పోలీసులే తీసుకువెళ్లారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పోలీసులు తీసుకువెళ్లి టీడీపీ నేతలకు అప్పగించారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం నడుస్తోంది’’ అని కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్.. తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి ప్రభుత్వం బరి తెగించి.. కుతంత్రాలకు తెరతీసింది వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్‌తో కూటమి విధ్వంసం సృష్టించింది. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు దిగింది. మహిళా కార్పొరేటర్లపై కూడా దాడులు చేసిన కూటమి గూండాలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్‌చేసి కూటమి గెలిచింది. దాడులు, దౌర్జన్యాలతో మునికృష్ణను కూటమి గెలిపించుకుంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నిక జరిగిదని.. ఈ గెలుపు ప్రజాస్వామ్య విరుద్ధం అని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు.కూటమి మోసం చేసి గెలిచింది: భూమన కరుణాకర్రెడ్డిడిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి మోసం చేసి గెలిచింది. కూటమి క్యాన్సర్ కన్నా ప్రమాదం. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు విరోచితంగా పోరాడారు. మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించారు. ఎమ్మెల్సీనే ఓటింగ్‌కు రాకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. మేయర్‌ను దించాలని కూటమిప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కాగా, మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు.గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు.వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్‌లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. -
అర్ధరాత్రి అరాచకం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్
సాక్షి, తిరుపతి జిల్లా: కూటమి ప్రభుత్వం అరాచకం పరాకాష్టకు చేరింది. తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసిన టీడీపీ నేత రవి నాయుడు.. దుర్మార్గంగా వ్యవహరించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినాసరే అధికార దుర్వినియోగంతో గద్దెనెక్కాలని దౌర్జన్యాలు, దాడులతో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు తెరతీసింది.తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక నేటికి( మంగళవారం) వాయిదా పడింది. ఎస్వీ యూనివర్సిటీ వేదికగా సోమవారం నగర డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎస్వీయూ ప్రాంగణంలో కూటమి నేతల అరాచకాలతో హైడ్రామా నడిచింది.కూటమి నాయకులకు ఎలాంటి మెజారిటీ లేకపోవడంతో కుట్రలకు పాల్పడుతున్నారు. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్సీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు.. అర్థరాత్రి కిడ్నాప్ చేశారు. తిరుపతి రాయల్ చెరువు రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్‌ను టీడీపీ గూండాలు చితకబాదారు. అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్‌లపై కూటమి రౌడీలు దాడికి పాల్పడ్డారు. రెండు కార్లను ధ్వంసం చేశారు. 45వ డివిజన్ కార్పోరేటర్ అనీష్ అనీష్ భార్య డాక్టర్ మమతను కూడా కిడ్నాప్ చేసి బెదిరించాలని కూటమి నేతలు ప్రయత్నం చేశారు. కార్పొరేటర్ సతీమణి కిడ్నాప్‌నకు యత్నంతిరుపతి 45వ డివిజన్ కార్పొరేటర్ అనీల్ రాయల్ సతీమణి మమతను కూటమి నేతలు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. తిరుపతిలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ నాయకులు సోమవారం ఉదయం కిడ్నాప్ చేశారు. వారిలో అనీష్ రాయల్ కూడా ఉన్నారు. ఆయన కూటమి నేతలకు లొంగడని అనీష్ రాయల్ భార్యను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.సమాచారం తెలసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు వెంటనే అనీష్ రాయల్ సతీమణి మమతను ఆర్సీ రోడ్డులోని రాయల్ నగర్లో పారీ్టకి చెందిన నాయకుడి ఇంట్లో సురక్షితంగా ఉంచారు. ఆ సమాచారం తెలుసుకున్న కూటమి నేతలు సోమవారం అర్ధరాత్రి ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపులు కొట్టారు. దీంతో భయపడ్డ మమత పోలీసులకు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో భూమన అభినయ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు.వెంటనే అభినయ్ రెడ్డి, నాయకులు అక్కడకు చేరుకున్నారు. కూటమి నాయకులు వారిని అడ్డుకుని కార్లను ధ్వంసం చేశారు. అభినయ్ డ్రైవర్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, పార్టీ నాయకుడు కౌసిక్లపై దాడి చేయగా, అభినయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఇంట్లోకి వెళ్లిపోయారు. తర్వాత అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశారు. వెంటనే ఎంపీ గురుమూర్తి, కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ సమాచారంతో పోలీసులు రాగా, మమతను సురక్షితంగా భూమన కరుణాకర రెడ్డి ఇంటికి చేర్చారు. -
కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆదిమ తెగల్లోనూ కానరాని అకృత్యాలు టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఆవిష్కృతమయ్యాయి! పట్టపగలు.. తిరుపతి నడి రోడ్డుపై పోలీసులు, జనం సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. తాలిబన్లు.. ఐసిస్.. హమాస్ ఉగ్రమూకలను తలదన్నే రీతిలో మునిసిపల్ ఉప ఎన్నికల్లో పచ్చ ముఠాలు దాడులకు తెగబడి విధ్వంసం, భయోత్పాతం సృష్టించాయి! పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. అసలు ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేని చోట్ల భయపెట్టి నెగ్గేందుకు కూటమి పార్టీలు కుతంత్రాలకు దిగాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి బరి తెగించాయి. బల ప్రయోగం, అక్రమాలు, అరాచకాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరించాయి. మునిసిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ గుర్తులతో జరిగాయి. అలాంటిది.. ఒక పార్టీ గుర్తుపై నెగ్గిన వారిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఇంత దారుణంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే.. అసలు ఇక ఎన్నికలు ఎందుకు? పార్టీ గుర్తులు ఎందుకు? అని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరికత, ఆధునిక పోకడలు ఏమాత్రం ఎరుగని ఆటవిక జాతులు.. ప్రజాస్వామ్యం అంటే పరిచయం లేని దేశాల్లో మాత్రమే కనిపించే ఘటనలు ఏడుకొండలవాడి సాక్షిగా చోటు చేసుకోవడం నివ్వెరపరుస్తోందని పేర్కొంటున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో నెగ్గేందుకు కూటమి పార్టీల గూండాలు అరాచకం సృష్టించారు. ఉప ఎన్నికలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సు ఆపి రాడ్లతో అద్దాలు పగలగొట్టి లోపలకు చొరబడి దాడులకు తెగబడ్డారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లపై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా కార్పొరేటర్ల ఆర్తనాదాలు ఖాకీల చెవికెక్కలేదు. కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న కూటమి గూండాల వాహనాలకు పోలీసులు దగ్గరుండి దారిచ్చి సాగనంపడం నివ్వెరపరుస్తోంది. పోలీసుల సాక్షిగా కూటమి గూండాలు చిత్తూరు, తిరుపతిలో సృష్టించిన అరాచకం ఇదీ!! రాష్ట్రంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని అధికార మదంతో టీడీపీ నేతలు సవాల్ విసరడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో ఐదు చోట్ల ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకుంటున్న టీడీపీ నాయకుడు అన్నా రామచంద్రయ్య, గూండాలు అర్ధరాత్రి నుంచి అరాచకం..మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్‌లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలసి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ మూకలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. బస్సుని అడ్డుకుని.. అద్దాలు ధ్వంసం చేసిడిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా భూమన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్వీ యూనివర్సిటీలోని సెనెట్ హాలు వద్దకు బయలు దేరారు. దాదాపు 25 మంది కార్పొరేటర్లు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అందులో ఉండగా వర్సిటీ సమీపంలో వారి బస్సును కూటమి గూండాలు అడ్డుకున్నారు. సుమారు 500 మంది ఒకేసారి బస్సుపైకి దూసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. లోపలకు చొరబడి బస్సు తలుపు తెరిచారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్‌రాయల్, మోహన్‌కృష్ణ యాదవ్, బోగం అనిల్, వెంకటేష్‌పై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో కార్పొరేటర్లను బలవంతంగా ఎక్కించారు. బస్సులో ముందు వైపు కూర్చున్న మహిళా కార్పొరేటర్లను నెట్టుకుంటూ లోపలకు చొరబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కార్పొరేటర్లను కాపాడకపోగా మిగిలిన వారిపై దౌర్జన్యానికి దిగారు.ఎంపీ, సాక్షి ప్రతినిధులపై దాడికార్పొరేటర్లతో పాటు బస్సులో ఉన్న ఎంపీ గురుమూర్తిపై కూడా కూటమి గూండాలు దాడికి యత్నించారు. ఈ అరాచకాలను చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్, సునీల్ చక్రవర్తి ఫోటోగ్రాఫర్ చేతిలోని రూ.రెండు లక్షలు విలువచేసే కెమెరాను ధ్వంసం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధిపై కూడా దాడికి తెగబడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి 10.45 వరకు యధేచ్ఛగా సాగిన విధ్వంసంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోరం లేదని డూప్లికేట్ కార్పొరేటర్లతో..నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్న కూటమి నేతలకు వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కిడ్నాప్‌నకు గురైన కార్పొరేటర్లను ప్రవేశపెట్టే వరకు తాము ఉప ఎన్నికలో పాల్గొనబోమని మిగతావారు వర్సిటీ సెనెట్ హాలు బయటే ఆగిపోయారు. ఉప ఎన్నిక జరగాలంటే కోరం ఉండాలి. అంటే.. 50 మంది కార్పొరేటర్లలో సగం మందైనా ఉంటేగానీ ఉప ఎన్నిక ప్రారంభం కాదు. దీంతో కూటమి నేతలు మరో ఎత్తుగడ వేశారు. నలుగురు జనసేన మహిళలకు మాస్క్‌లు అమర్చి సెనెట్ హాలు లోపలకు పంపేందుకు యత్నించారు. ఈ కుట్రలను పసిగట్టిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాలు వద్దకు చేరుకోవడంతో ఆ యత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఉప ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శుభం బన్సల్ ప్రకటించారు. నలుగురితో బలవంతంగా వీడియో...డిప్యూటీ మేయర్ పదవిని కైవశం చేసుకునేందుకు టీడీపీ మూకలు కిడ్నాప్ చేసిన నలుగురు కార్పొరేటర్ల చేత బలవంతంగా మాట్లాడించి ఓ వీడియోను విడుదల చేశారు. గొడవల కారణంగా తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామంటూ ఒకే డైలాగ్ నలుగురితో చెప్పించి వీడియో తీశారు. అది ఒకే ప్రాంతంలో చేసినట్లు తెలుస్తోంది. పక్కన ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురి వీడియోలను టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ తన ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. కాగా భూమన అభినయ్‌పై అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.అడ్డదారిలో స్టాండింగ్ కమిటీ కైవశంగుంటూరు స్టాండింగ్ కమిటీని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. 56 మంది సభ్యులకుగానూ కేవలం 11 మంది బలం మాత్రమే ఉన్న కూటమి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంది. స్వయంగా ఎమ్మెల్యేలను కార్పొరేటర్ల ఇళ్లకు పంపి పచ్చ కండువా కప్పారు. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పేపర్‌పై సీరియల్ నంబర్లు వేసి బెదిరింపులకు దిగి గెలుపొందారు. కాగా కార్యాలయం బయట కూటమి సభ్యులు డబ్బులు పంచుకుంటూ మీడియాకు చిక్కారు.సగం చోట్ల వాయిదా...పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ⇒ టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ⇒ కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు. ⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి సాక్షి, అమరావతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో జిల్లా ఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నిక జరిగే ఎస్వీ యూనివర్సిటీ, సెనెట్ హాల్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పాలకొండపై కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని భర్తీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నాదెండ్ల హారిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖాళీగా ఉన్న 19 వార్డుకు ముందు ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎం.స్వర్ణకుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
వైఎస్సార్సీపీ ‘ఫీజు పోరు’ వాయిదా
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా పడింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు పార్టీ సోమవారం(ఫిబ్రవరి3) ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఫీజుపోరు వాయిదా నిర్ణయం తీసకున్నట్లు తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తమ ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఆదివారమే ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ కోరింది. అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన పీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌తో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రొఫెషనల్ కోర్సులు చదువుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఈ స్కీమ్ అమలు చేయకుండా పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు,వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఫీజుపోరు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ కార్యక్రమం మార్చి 12కి వాయిదా పడింది. -
పోలవరం ఎత్తు తగ్గింపు వద్దు: రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తున్నామని,ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణమని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైవీ సుబ్బారెడ్డి సోమవారం(ఫిబ్రవరి3) రాజ్యసభలో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. 150 ఫీట్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశం ఇచ్చారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం టీవల నిర్ణయం తీసుకుంది. 135 ఫీట్లకే ప్రాజెక్టు ఎత్తు పరిమితం చేశారు.ఇది ప్రజల ఆకాంక్షలకు,ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్ధం. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం మౌనంగా మద్దతు తెలిపింది.ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం. 55 వేల కోట్ల రూపాయల అంచనాలకి ఆమోదం తెలపాలి.పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆయకట్టుకు పూర్తిగా నీరు ఉండదు, విశాఖపట్నానికి నీరు అందించే అవకాశం కోల్పోతాం. ఉత్తరాంధ్ర జిల్లాలకు సుజన స్రవంతి నీరు అందదు.పోలవరం కెనాల్స్‌కు సరిపడా నీరు అందదు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని పోలవరం ఎత్తును యథాతథంగా ఉంచాలిసూపర్సిక్స్ పేరు చెప్పి చంద్రబాబు మోసం చేశారు..ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని,గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని రాజ్యసభ ఎంపీ వైవీసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ‘ఏకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు పెడుతున్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు.రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు.ప్రధాని,హోంమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.చంద్రబాబు ఏపీలో మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. సూపర్‌సిక్స్ పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు.20 లక్షల ఉద్యోగాలు,ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. రైతులకు 20వేలు ఇస్తానన్నారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే ఎన్నికల సంఘం,సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలి.వక్ఫ్ సవరణ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుపై తొందరపాటు తగదు.ఏపీలో ఇప్పటివరకు జనాభా లెక్కలు జరగలేదు.ఏపీలో ప్రత్యేకంగా జనాభా లెక్కల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.వైఎస్సార్సీపీ కృషివల్లే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ప్రారంభించబోతోంది. ఉద్యోగుల జీతాలను సైతం చెల్లించలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.సెయిల్‌లో విలీనం చేయడంలో విఫలమయ్యారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలి’అని వైవీసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు: రాజ్యసభలో ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించే రైతులను ఆదుకోవాలిరైతులను ఆదుకునేందుకు నాడు వైఎస్ జగన్ 11 పథకాలు అమలు చేశారుఆ పథకాలన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందిరైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందిఆదాయాలు ఉన్నా రైతులను ఎందుకు ఆదుకోవడం లేదునా ప్రసంగానికి అడ్డుపడి, రాజకీయాలకే పరిమితం కాకండిరైతుల సంక్షేమం కోసం రైతు భరోసా సున్నా వడ్డీ, ఉచిత పంట బీమా , జల కళ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారుచంద్రబోస్ ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ టీడీపీ ఎంపీలు, మంత్రి పెమ్మసాని -
కూటమి కాదు.. కుట్రల ప్రభుత్వం: జోగి రమేష్
సాక్షి,తాడేపల్లి:ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని,అరాచకాలు,అక్రమాలు,దౌర్జన్యాలు చేసి మున్సిపాలిటీల్లో పదవులు దక్కించుకున్నారని వైఎస్సార్సీపీ సీనియర్‌నేత మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. సోమవారం(ఫిబ్రవరి3) తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ కార్పొరేషన్,మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదు.మా పార్టీ వారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటు. మా కార్పొరేటర్లు వెళ్లే బస్సు మీద రాళ్ల దాడి చేయడం దారుణం. తిరుపతి ప్రతిష్టను దిగజార్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు. 2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ,కేజ్రివాల్‌ను తిట్టారు. అసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా? సిద్దాంతాలు,విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబు.ఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవడానికే ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.ఇది కూటమి ప్రభుత్వం కాదు,కుట్రల ప్రభుత్వం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారు.ఈ దాడులు,దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలి. అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలి’అని జోగి రమేష్ డిమాండ్ చేశారు. -
కూటమి నేతలది అభద్రతాభావం: బొత్స సత్యనారాయణ
సాక్షి,తాడేపల్లి:టీడీపీకి చట్టం అంటే గౌరవం లేదని,వాళ్ళు చేసిందే చట్టం అనుకుంటున్నారని మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం(ఫిబ్రవరి3) తాడేపల్లిలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.‘తిరుపతి లో మా వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు అద్దాలు పగులగొట్టారు. పోలీసులు ఎన్నికలను పట్టించుకోలేదు. కోరం ఉంటే ఎన్నిక వాయిదా పడేది కాదు. చట్టాన్ని చేతిలో తీసుకొని అన్యాయంగా గెలవాలని చూస్తున్నారు. టీడీపీ కూటమికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వచ్చాయి. అయినా సరే చిన్న పదవుల కోసం తాపత్రయ పడుతున్నారు.మేయర్,డిప్యూటీ మేయర్ పదవులు ఉంటే ఏంటి..లేక పోతే ఏంటి..? ఎన్నికలు పెట్టడం ఎందుకు. నామినేటెడ్ చేసుకుంటే సరిపోయేది.కూటమికి ఎన్నికల్లో అన్ని సీట్లు వచ్చినా ఇంకా అభద్రతా భావంతోనే ఉన్నారు.ముద్రగడ ఇంటిపైనా దాడి జరిగింది.పోలీసు వ్యవస్థ అంటే భయం లేక పోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.ఎన్నికల కమిషన్ నిస్సహాయ స్థితిలో ఉంది’అని బొత్స అన్నారు. -
కూటమి సర్కార్‌కు లోకేష్ రెడ్‌బుక్‌తో ముప్పు!
సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలను అమలు చేసే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నట్ట? లేనట్టా?. హామీలైతే ఇచ్చాను కానీ.. అమలు చేయలేని పరిస్థితి ఉందని ఆయన పదే పదే చెబుతున్నా టీడీపీ జాకీ మీడియా మాత్రం ‘‘అబ్బెబ్బే.. బాబు అలా అనలేదు... ఇలా అనలేదు’’ అని గొంతు సవరించుకుంటోంది. ఎందుకు మరి? ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా.. ప్రజల దృష్టిని హామీల నుంచి మళ్లించేందుకు నానా తంటాలూ పడుతన్నాయెందుకు?. ఇటీవల చంద్రబాబు ఒక మీడియా సమావేశం పెట్టారు. నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలు కొన్నింటిని వక్రీకరించి.. గత ప్రభుత్వాన్ని నిందించాలన్నది ఈ సమావేశం ఉద్దేశం. ఇందులోనే ఆయన ‘సూపర్ సిక్స్’పై ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పేశారు. డబ్బులున్నా ఇవ్వడం లేదని, నమ్మకం పెట్టుకున్నామని ఫీలింగ్స్‌తో ఉంటున్నారని అన్న బాబు.. కేంద్రం ఇతర ఖర్చుల కోసం ఇచ్చిన నిధులను సంక్షేమానికి పెట్టలేనని తేల్చేశారు. ఆర్థిక పరిస్థితి రీత్యా ప్రభుత్వమైనా అవస్థలు పడాలని లేదంటే రైతులైనా అవస్థలు పడాలని తన మనసులోని మాట చెప్పేశారు. అంటే.. రైతు భరోసా ఇవ్వలేనని అర్థమన్నమాట. తల్లికి వందనం ఈ ఏడాది కాదని ఇప్పటికే టీడీపీ నాయకత్వం తేల్చేసింది. మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి రూ.3000ల ఊసు అస్సలు ఎత్తడం లేదు. ఇవి కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని వారికి యాభై ఏళ్లకే ఇస్తామన్న పింఛన్, ఇతర ఎన్నికల హామీల సంగతి సరేసరి. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయమయ్యే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీల అమలు సాధ్యం కాదని ఎన్నికల సమయంలోనే వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విస్పష్టంగా చెప్పినా.. తాము సంపద సృష్టిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని కూడా కూటమి నమ్మబలికింది. కానీ ఈ మాటలన్నీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్క వరకే! ఆ తరువాత స్వరం మారింది. రోజుకో డైవర్షన్ రాజకీయాలతో అసలు సంగతిని నెమ్మదిగా ప్రజల మనసుల్లోంచి చెరిపేసేందుకు తలో సన్నాయి నొక్కు నొక్కడం మొదలుపెట్టారు. పైగా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నింటికీ జగన్‌దే బాధ్యతన్నట్టుగా తలకూ.. మోకాలికి ముడివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్ర్రజ్యోతి వంటి వార్తా పత్రికలు ప్రజల పక్షాన నిలవాలన్న ప్రాథమిక జర్నలిజమ్ సూత్రాన్ని ఎప్పుడో గాలికి వదిలేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికే పనిలో బిజీ అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తాయని, సాక్షి మీడియాలో వచ్చిన వార్తల్లో తప్పులున్నాయని అనుకుందాం. అలాంటప్పుడు ఫలానా తేదీ నుంచి ఫలానా హామీ అమలవుతుందని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? కారణం ఒక్కటే. ఎల్లో మీడియా పైరవీలు, వ్యాపారాలు సాగాలంటే ఇలాగే పచ్చి అబద్దాలు ప్రచారం చేయాలి. వారికి గిట్టుబాటు అయితే ప్రజలందరికి స్కీములు వచ్చినట్లే అన్నమాట. చంద్రబాబు చెప్పిన విషయాలు కొన్నిటిని గమనించండి. కేంద్రం విశాఖ స్టీల్ కు రూ.11 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ.. ఆ డబ్బును తాను సంక్షేమ పథకాలకు వాడలేనని బాబు అంటున్నారు. విశాఖ స్టీల్ ఇచ్చిన డబ్బుతో ఈయనకు ఏమి సంబంధం? పోలవరం ప్రాజెక్టు నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి ఎలా వస్తాయి? అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది అప్పు తప్ప గ్రాంట్ కాదు. అయినా బాబు ఈ మాటలన్నారంటే.. ఆయన అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమైపోతుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా ఆసాములకు ఉపయోగపడేలా నిధులు తీసుకు వచ్చి ఖర్చు చేస్తాం కాని, పేదలకు ఇస్తామన్న స్కీములకు మాత్రం డబ్బు తేలేమని చెప్పినట్లే కదా! దానికి తగినట్లే ఒక్క అమరావతి మినహా మిగిలిన చోట్ల మాత్రమే భూముల ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా ఛార్జీల రూపంలో ప్రజలను మరోసారి బాదుతారన్నమాట. ఇదెంత వరకూ న్యాయం?. మరో వైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీకి ఏడు నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి వెళ్లారు. దానిని చంద్రబాబు కాదనలేదు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? అయినా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఎందుకు చెబుతున్నారు? ఏపీలో ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించడానికి తొమ్మిది, పదేళ్లు పడుతుందట.. అంటే దాని అర్దం అప్పటివరకు ఈ స్కీములు అమలు చేయలేమని చెప్పడమే! పోలవరం, అమరావతి వంటి వాటిని అభివృద్ది చేసి అప్పుడు ఆదాయం సంపాదించి ఖర్చు చేస్తారట. అసలు సంపద సృష్టి అన్నది తన తర్వాతేనని, పీ-4 అంటే పేదలను భాగ్యవంతులను చేసే స్కీములన్నీ తన వద్ద ఉన్నాయని, తన మంత్రజాలంతో అన్నిటిని మార్చి వేస్తానని చంద్రబాబు చెబితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాన, తందానా అన్నారా? లేదా? ఇక చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏమి చెప్పారు. తన వద్ద అన్ని లెక్కలు ఉన్నాయని, అన్ని స్కీములు అధికారం వచ్చిన వెంటనే అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఒకవేళ అమలు చేయలేకపోతే చొక్కా కాలర్ పట్టుకోండని ఓపెన్ గా చెప్పారా? లేదా? ఇప్పుడేమో ఎవరైనా హామీలను గుర్తు చేసినా, ప్రశ్నించినా, వారిపై రెడ్ బుక్ అంటూ కేసులతో వేధిస్తున్నారే! అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఈ ‘రెడ్ బుక్’ను పిచ్చి కుక్కలతో పోల్చుతున్నారు. అవి ఎప్పుడు ఎవరిని కరుస్తాయో చెప్పలేం. లోకేష్ అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే.. ఆ పిచ్చికుక్క ప్రమాదం టీడీపీకి కూడా పొంచి ఉంది. జీఎస్డీపీ 15 శాతం చొప్పున పెరిగితేనే స్కీములు అమలు చేస్తారట. ప్రజలు అర్థం చేసుకోవాలట. గత ప్రభుత్వం అప్పులు చేసిందని పదే, పదే గోబెల్స్ ప్రచారం కొనసాగించారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని, దానికి వైసీపీ కారణమని తప్పుడు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ లో రూ.ఏడు లక్షల కోట్లు అని వారే చెప్పారు. అందులో కూడా విభజన నాటి అప్పు, చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పు కలిపి మూడున్నర లక్షల కోట్లు ఉన్న సంగతిని దాచేస్తారు. జగన్ టైమ్‌లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచం అంతటిని గడగడలాడించిన కరోనా విషయాన్ని ఏమార్చి అప్పులు అని ఊదరగొడతారు. ఏపీ శ్రీలంక మాదిరి మారిందని ఆరోజుల్లోనే ప్రచారం చేశారు. కానీ ఎన్నికల హామీలు ,సూపర్ సిక్స్ ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు ఇవేవి అడ్డు కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించి హామీలు అమలు చేస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా తమ అంత మొనగాళ్లే లేరని డబ్బా కొట్టుకున్నారు. 2014లో విభజిత ఏపీ అప్పులపై వడ్డీ కింద ఏడాదికి రూ.7488 కోట్లు వ్యయం చేస్తే, చంద్రబాబు టరమ్ పూర్తి అయ్యే 2018 నాటికి వడ్డీ చెల్లింపులు రూ.15342 కోట్లకు చేరింది. అంటే టీడీపీ హయాంలో ఎంత అప్పు తెచ్చింది తెలియడం లేదా? అయినా దాన్నంతటినీ వైసీపీ ఖాతాలో వేసి దుష్ప్రచారం చేస్తుంటారు. తాజాగా చంద్రబాబు సర్కార్ మరో రూ. 6,000 వేల కోట్ల అప్పు సేకరిస్తోంది. పోనీ ఆదాయపరంగా పరిశీలించినా జగన్ పాలనలోనే అధికంగా కనిపిస్తుంది. జగన్ పాలన కాలంలో జీఎస్డీపీ, జీఎస్టీ వంటి వాటిలో ఏపీ దేశంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉంది. అప్పట్లో 12 శాతం వృద్ది కనిపిస్తే, చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో ఆదాయం - ఆరు శాతంగా ఉంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి అన్నమాట. కాగ్ గణాంకాల ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర ఆదాయంలో ఏకంగా 185 శాతం లోటు నమోదైందని మీడియాలో వార్తలు వచ్చాయి. టీడీపీ బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, డిసెంబర్ వరకు 1.13 లక్షల కోట్లే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు,అమ్మకం పన్ను ఇలా అన్ని అంశాలలో నెగిటివ్ గ్రోత్ నమోదు చేసుకుంది. సంపద సృష్టిస్తానని హోరెత్తించిన చంద్రబాబు ప్రభుత్వం సాధించింది ఏమిటంటే ఉన్న సంపదను కూడా కోల్పోవడం అన్నమాట. పోనీ అప్పులు ఏమైనా తగ్గాయా అంటే లేదు. డిసెంబర్ వరకు రూ.డెబ్బై వేల కోట్లకు పైగా తీసుకు వచ్చారు. అది కాకుండా ఇతరత్రా మరో రూ.ఏభై వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అమరావతికే రూ.31వేల కోట్ల అప్పు సమకూర్చుకోవడానికి సన్నద్దం అవుతున్నారు. ఇదంతా ఏపీ ప్రజలు తీర్చవలసిన రుణాలే. పోనీ పరిశ్రమలు ఏమైనా కొత్తగా వస్తున్నాయా అంటే అదీ లేదు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు దావోస్ వెళ్లి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే, చంద్రబాబు అండ్ కో భారీ బృందంతో వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. దీనికి కారణం రెడ్ బుక్ పేరుతో పారిశ్రామికవేత్తలను వేధించడం, జిందాల్ వంటివారిని టీడీపీ ప్రభుత్వం తరిమేయడం కారణమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు స్కీములు అమలు చేయలేమని ఇంత ఓపెన్ గా చెబుతున్నా, జనసేన పక్షాన ఉప ముఖ్యమంత్రి పవన్ నోరు విప్పకపోవడం. సీజ్ ద షిప్ అని, తోలు తీస్తామని అంటూ డంబాలు పలుకుతూ ఇన్ని రోజులు తిరిగిన పవన్.. సూపర్ సిక్స్ , ఎన్నికల ప్రణాళిక హామీల గురించి చంద్రబాబు చేతులెత్తేసినట్లుగా మాట్లాడినా ప్రశ్నించలేకపోతున్నారు. రెడ్ బుక్ గురించి సదే,పదే మాట్లాడే లోకేష్ కూడా.. తండ్రి మాదిరే బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కీములు అమలు చేయకపోతే చొక్కా కాలర్ పట్టుకోవచ్చన్న ఆయన హామీ ప్రకారం.. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్, లోకేష్ లను నిలదీయవచ్చా!. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ -
దిక్కుమాలిన పాలన.. 40 ఏళ్ల అనుభవం ఇదేనా చంద్రబాబూ?
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసలు ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందని, కూటమి నేతల అరాచకాలపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారాయన. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం జరగడంపై ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి. ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసింది. అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?. ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాం. పోలీసు బలగాలను పెంచాలని కోరాం. మా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?. వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?. ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోంది. ప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారు. మావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారు. బీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారు. ఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారు. తిరుపతి ప్రతిష్టను మళ్లీ దిగజార్చారుతిరుపతి ప్రతిష్టను మరోసారి టీడీపీ నేతలు దిగజార్చారు. మొన్న లడ్డూ వ్యవహారం, గతంలో అమిత్‌షా పై దాడి చేశారు. ఇప్పుడు పట్టపగలే తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరానికి ఉన్న ప్రతిష్టకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది.నిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాం. పోలీసులపై నమ్మకం లేదని చెప్పాం. ఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాం. కూటమి అరాచకాలను అరికట్టాలని కోరతాం అని అప్పిరెడ్డి అన్నారు. -
ఏంది బాలయ్య.. ఇదీ ఓ గెలుపేనా?
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సభ్యులపై ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. మాట వినని వాళ్లను బెదిరించడమే కాదు.. ఎత్తుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్యాయంగా పదవులు లాక్కుని.. తమదే గెలుపంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ క్రమంలో..హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలోనే బరితెగింపు వ్యవహారం నడిచింది. 23 మంది సభ్యుల మద్దతుతో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి సొంతం చేసుకుంది టీడీపీ. అయితే.. బలం లేకున్నా అన్యాయంగా చైర్మన్ పదవి లాక్కోవడం ఇక్కడ దారుణం.ఇక్కడ మొత్తం 38 వార్డులు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో 30 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభ పెట్టాలని టీడీపీ నేతలను ఎమ్మెల్యే బాలయ్య దగ్గురుండి ప్రోత్సహించారు. మాట వినని కౌన్సిలర్లను బెదిరించారు కూడా. అలా.. 16 మందిని తనవైపునకు తిప్పుకుంది. ఈ అరాచకాలను చూసి ‘‘ఏంది బాలయ్య ఇది?’’ అంటూ హిందూపురం వాసులు విస్తుపోతున్నారు. డాకు బాలయ్యా.. ఇదీ ఓ గెలుపేనా?హిందూపురంలో టీడీపీ విజయం అనైతికమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటున్నారు. ‘‘హిందూపురంలో 38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ కి బలం ఉంది. ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను లాక్కున్నారు. ఓ డాకూలా ఎమ్మెల్యే బాలకృష్ణ దోపిడీ చేశాడు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ గెలుపు.. అసలు గెలుపే కాదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాగే మోసాలతో గెలిచారు. చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు’’ అని అన్నారాయన. -
చంద్రబాబు.. ఇంత నీచంగా వ్యవహరించాలా?: భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను భయభాంత్రులకు గురిచేశారు. ఓటింగ్ కోసం ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో కార్పొరేటర్ల బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలపై వైఎస్సార్సీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్లు వెళ్తున్న వాహనంపై దాడి చేయమేంటి?. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం తిరుపతి మేయర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు. మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు. మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి. మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం’ అని కామెంట్స్ చేశారు. -
తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ, జనసేన నేతల రాళ్ల దాడి
సాక్షి, తిరుపతి: మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై మూకలు రాళ్లతో దాడి చేశాయి. అనంతరం, కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. వివరాల ప్రకారం.. తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ, జనసేన గూండాలు దాడి చేశారు. కార్పొరేటర్లు వెళ్తున్న బస్సుపై జనసేన, టీడీపీ కార్యకర్తల రాళ్ల రువ్వడంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో సాక్షి రిపోర్టర్, కెమెరామెన్‌పై పచ్చ గూండాలు దాడికి దిగారు. కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ పచ్చ మూకలు రెచ్చిపోవడం గమనార్హం. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిల్చున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఇక, బస్సుపై దాడి చేసిన వ్యక్తిని టీడీపీకి చెందిన శంకర్ యాదవ్‌గా గుర్తించారు. శంకర్ యాదవ్ ఓవరాక్షన్ చేస్తూ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ, జనసేన గూండాలు ఎత్తుకెళ్లారు.ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ కార్పొరేటర్లను రక్తం వచ్చేలా కొట్టారు. మేము పోలీసులకు ఫోన చేసినా కావాలనే ఆలస్యంగా వచ్చారు. మా కార్పొరేటర్ల కొడ్నాప్కు యత్నించారని తెలిపారు. తిరుపతి మేయర్ శిరీష కామెంట్స్..కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు.పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు.మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?.మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు.మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు.మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి.మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం. అనంతరం, వైఎస్సార్సీపీ నాయకులు భూమన కరుణాకర్ మాట్లాడుతూ.. కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. బాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ప్రశ్నించారు. -
తాడిపత్రిలో టెన్షన్.. కేతిరెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.తాడిపత్రిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదమయే కేతిరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని గృహ నిర్బంధంలోనే ఉంచారు. అనంతరం, కేతిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు.ఇదిలా ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఏడు నెలలుగా అడ్డంకులు సృష్టిస్తూన ఉన్నారు. జేసీ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ, పోలీసుల తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం తాడిపత్రిలోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో, తిమ్మంపల్లి గ్రామంలో పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అప్డేట్స్.. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అరాచకాలు
Election Update.. ఏపీలో నేడు 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ప్రత్యక్షంగా దాడులు చేస్తూ భయభంత్రులకు గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, ఉద్రిక్తర పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు..బుచ్చి మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కామెంట్స్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ డౌర్జన్యాలకు పాల్పడింది. బుచ్చికి నగర పంచాయతీ హోదా ఇచ్చింది వైఎస్ జగన్ వైఎస్జగన్ బొమ్మను చూసే మాకు, కౌన్సిలర్లకు ఓట్లు వేశారు పార్టీ మారిన కౌన్సిలర్లకు మేము ఎక్కడా తక్కువ చెయ్యలేదు.. కానీ వారు మోసం చేసి వెళ్లిపోయారు.. ప్రలోభాలకు లొంగకుండా ఆరుగురు కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ పక్కన నిలబడ్డారూ.. వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తాం..టీడీపీకి ఓట్లు వేసిన వారు వెన్నుపోటుదారులయ్యారు: మాజీ మంత్రి కాకాణి టీడీపీ తరపున ఓట్లు వేసిన వారందరూ వెన్నుపోటుదారులులాగా మిగిలిపోయారు ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికే టీడీపీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చింది. మంత్రి నారాయణకి ఫిరాయింపు చట్టాల మీద అవగాహన లేదు.. విప్ దిక్కరించిన వారందరూ అనర్హులవుతారు వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన అరుగుర్ని వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్తాం.. వారికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ఎవరికో పుట్టిన బిడ్డను తెచ్చుకుని.. తమ బిడ్డగా టీడీపీ చెప్పుకోవడం సిగ్గుచేటు ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. కార్యకర్తలకు అండగా ఉంటాం మేము రోడ్డెక్కి ప్రతిదాడులు చేస్తే.. జిల్లా అగ్నిగుండం అవుతుంది.. మా కార్యకర్తల జోలికి రావొద్దు.. క్యాష్, పేమెంట్స్ కోసం కార్పొరేటర్స్ టీడీపీ వైపు వెళ్లారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలుతమ పార్టీ కార్పొరేటర్లు ను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని, ఇవాళ కూడా ఎన్నిక సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు హైకోర్టులో పిటిషన్కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్విచారణ జరిపిన హైకోర్టురక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వాలని పిటిషనర్‌కు కోర్టు ఆదేశంకార్పొరేటర్లు బయల్దేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాల్‌కు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలుతాడేపల్లి:అసలు చంద్రబాబు మనిషేనా: మాజీ మంత్రి జోగి రమేష్ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసి పదవులు గెలుపొందారురాష్ట్రంలో ఏ కార్పోరేషన్, మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదుకానీ మావారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటుమా కార్పోరేటర్లు వెళ్లే బస్సు మీద దాడి చేయడం దారుణంతిరుపతి ప్రతిష్టను దిగజార్చారుఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారుఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ, కేజ్రివాల్‌ని తిట్టారుఅసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా?సిద్దాంతాలు, విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబుఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవటానికే చంద్రబాబు ఢిల్లీ ప్రచారానికి వెళ్లారుఇది కూటమి ప్రభుత్వం కాదు, కుట్రల ప్రభుత్వంవైసీపి కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారుపవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారుఈ దాడులు, దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలిఅధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలిఎన్టీఆర్ జిల్లా:కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందిఎమ్మెల్సీ,మొండితోక అరుణ్ కుమార్రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికలే అందుకు నిదర్శనంఎలాగైనా గెలవాలని వైసీపీ కౌన్సిలర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేశారుటీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారుసైకిల్ గుర్తు పై గెలిచిన వారు కేవలం ఆరుగురేఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారు 13 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని గెలవాలని చూశారువైఎస్సార్సీపీ కౌన్సిలర్లను చేర్చుకుని కూడా ఎన్నికలను నిర్వహించుకోలేకపోయారునందిగామ ఎమ్మెల్యే ఓ డమ్మీ ఎమ్మెల్యేఎంపీకి , ఎమ్మెల్యేకి పొసగడం లేదని మీ అనుకూల మీడియాల్లోనే చెబుతున్నారుపార్టీ విప్ ను టీడీపీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారని వార్తలొస్తున్నాయిమీరు డమ్మీ ఎమ్మెల్యే అని మేం చెప్పడం లేదు...మీ పార్టీవాళ్లే చెబుతున్నారు13 మంది సభ్యుల బలం ఉందని చెప్పుకుంటున్న మీరు ఎందుకు ఎన్నిక జరుపుకోలేకపోయారువైఎస్సార్సీపీ కౌన్సిలర్ మంద మరియమ్మ ఇంటిని ప్రొక్లెయినర్లతో కూల్చేశారుటీడీపీకి ఓటేయకపోతే నీ ఇంటిని కూల్చేసినట్లు నిన్ను కూడా కూల్చేస్తామని మరియమ్మను హెచ్చరించారుబెదిరించి,భయపెట్టి మంద మరియమ్మను టీడీపీలో చేర్చుకున్నారుతమకు లొంగకపోతే బెదిరిస్తున్నారు...భయపెడుతున్నారు...ఆస్తులను ధ్వంసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నందిగామలో అరాచకాలు పెరిగిపోయాయిప్రభుత్వం రాగానే జగనన్న వాక్‌ను ధ్వంసం చేశారుమేం చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారుగత ఐదేళ్లలో నందిగామలో రాజకీయంగా ఒక్క 307 కేసు కూడా పెట్టలేదుకానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 307 కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారునందిగామ మున్సిపల్ ఛైర్మన్,మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక పై మేం కోర్టుకు వెళ్లాంఛైర్మన్,వైస్ ఛైర్మన్ పదవుల్లో ఉన్నవారు చనిపోతే ఆ వార్డులలో ఎన్నికల కోసం మేం కోర్టుకు వెళ్లాంనందిగామలో టీడీపీ అంతర్గత ప్రజాస్వామ్యం నడిపిస్తున్నారుకౌన్సిలర్లను ఐదు గంటలుగా బంధించారు.. ఫోన్లు లాక్కున్నారుస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు సూచిస్తున్నాఇంకా ఎన్నాళ్లు డమ్మీ ఎమ్మెల్యేగా ఉంటారునందిగామ నియోజకవర్గాన్ని అపహాస్యం చేశారుటీడీపీ ప్రలోభాలకు గురిచేసిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లంతా మాతో టచ్ లో ఉన్నారుసరైన సమయంలో సరైన ట్విస్ట్ ఇస్తాం ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు..విజయవాడ..రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదుతిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలపై ఫిర్యాదుఈసీకి ఫిర్యాదు చేసిన దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మికుట్రలతో టీడీపీ విజయం..ఏలూరు..కుట్రలతో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ను దక్కించుకున్న టీడీపీబలం లేకపోయినా గెలిచేందుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసిన మంత్రి పార్ధసారధితీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికకు హాజరైన 30 మంది కౌన్సిలర్లుఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గైర్హాజరు14 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లలో టీడీపీకి ఓటేసిన ఒక వైఎస్సార్సీపీ కౌన్సిలర్18 ఓట్లు రావడంతో టీడీపికి దక్కిన నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిమున్సిపల్ వైస్ చైర్మన్ గా పగడాల సత్యనారాయణగతంలో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి వైస్ చైర్మన్ గా పనిచేసిన పగడాల సత్యనారాయణసత్యనారాయణను టీడీపీలో చేర్చుకుని మళ్లీ అతన్నే వైస్ చైర్మన్‌గా చేసిన టీడీపీ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా..తిరుపతి జిల్లా..డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా వేసిన ఎన్నికల అధికారులుటీడీపీ అడ్డదారుల్లో గెలిచింది: కాకాణి నెల్లూరు జిల్లా..మాజీ మంత్రి కాకాణి కామెంట్స్..తెలుగుదేశం పార్టీ అడ్డదారుల్లో గెలిచింది.పార్టీ తరఫున అభ్యర్థికి బీఫామ్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది.వైఎస్సార్సీపీ ధిక్కరించిన అందరిపై వేటు తప్పదువైఎస్సార్‌సీపీ నైతికంగా విజయం సాధించింది..తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఇదే చివరి విజయం అవుతుందిన్యాయస్థానాన్ని ఆశ్రయించి.. విప్ ధిక్కరించిన కార్పొరేటర్స్పై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకుంటాం..నిస్సిగ్గుగా ఎన్నికల్లో టీడీపీ ప్రవర్తించింది.టీడీపీ విజయం అనైతికం: తోపుదుర్తిఅనంతపురం జిల్లా..మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్స్..హిందూపురంలో టీడీపీ విజయం అనైతికం38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైఎస్సార్సీపీకి బలం ఉందిఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చూసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ను లాక్కున్నారుఎమ్మెల్యే బాలకృష్ణ ఓ డాకూలా అరాచకాలు చేస్తున్నారుచంద్రబాబు, బాలకృష్ణలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను అడ్డుకుంటాంముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల ద్రోహిహంద్రీనీవా కాలువలను వెడల్పు చేయకుండా లైనింగ్ పనులకు టెండర్లు పిలవడం దుర్మార్గంమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి టీడీపీలో వర్గపోరు.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా..టీడీపీలో చిచ్చు రాజేసిన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికనందిగామ మున్సిపల్ చైర్మన్ కోసం కొట్లాటచైర్మన్ కోసం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే8వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతకు ఎంపీ కేశినేని చిన్ని మద్దతుస్వర్ణలతకు బీఫామ్ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానంతనకు తెలియకుండా బీఫామ్ ఇవ్వడంతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫైర్నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటంటూ నిలదీత14వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి ఇవ్వాలని పట్టుపడుతున్న ఎమ్మెల్యే సౌమ్యఅధిష్టానం వద్దకు చేరిన ఎంపీ, ఎమ్మెల్యే పంచాయతీనేను ప్రకటించే అభ్యర్థే ఫైనల్ అంటున్న ఎమ్మెల్యే సౌమ్యఅభ్యర్ధి ఎవరో తేలకపోవడంతో ఎన్నిక వాయిదా పడే అవకాశం పల్నాడు జిల్లాలో ఎన్నిక వాయిదా..పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా10 గంటల లోపు వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గురజాల ఆర్డీఓ మురళినందిగామలో ఎన్నిక వాయిదాఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదారేపటికి చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాకోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డినెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్..టీడీపీ అన్ని విధాలా ఓడిపోయింది.. పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టుకోలేక చేతులు ఎత్తేసింది.టీడీపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేయకుండా.. టీడీపీలో ఉన్న వారిపై అనర్హత వేటు తప్పదు.గెలిచింది టీడీపీ అభ్యర్థినా.. ఇండిపెండెంట్ అభ్యర్థి అనేది కూడా ఎన్నికల అధికారి చెప్పలేదు.ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. పార్టీ ఫిరాయింపుదారులను ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతాం..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి: లేళ్ల అప్పిరెడ్డిఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కామెంట్స్..తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలిప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించ వద్దుదాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందిఅలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాంపోలీసు బలగాలను పెంచాలని కోరాంమా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోందివైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోందిప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారుతిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారుమావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారుబీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారుఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారుఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారునిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాంపోలీసులపై నమ్మకం లేదని చెప్పాంఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాంతిరుపతి ప్రతిష్టను టీడీపీ నేతలు దిగజార్చారుగతంలో లడ్డూ వ్యవహారం, అంతకుముందు అమిత్‌షా పై దాడి చేశారుప్రపంచవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించారు.హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ..శ్రీసత్యసాయి జిల్లా..హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీపార్టీ ఫిరాయింపులతో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీ నేతల బరితెగింపువైఎస్సార్సీపీకి చెందిన 16 మందిని లాగేసుకున్న టీడీపీవైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ప్రలోభాలు పెట్టి.. బెదిరించిన టీడీపీ నేతలు23 మంది సభ్యుల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవి సొంతం చేసుకున్న టీడీపీహిందూపురంలో మొత్తం 38 వార్డులు తిరుపతి మేయర్ శిరీష కామెంట్స్..కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు.పోలీసులే రక్షించకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు.మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?.మహిళా కార్పొరేటర్ అని కూడా చూడకుండా దాడి చేశారు.మహిళా కార్పొరేటర్ల గాజులు పగలగొట్టారు.మా కార్పొరేటర్లను వెంటనే విడిచిపెట్టాలి.మా పార్టీ కార్పొరేటర్లు వచ్చే వరకు మేము ఓటింగ్‌లో పాల్గొనం. నూజివీడులో ఉత్కంఠ..ఏలూరు..నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.32 మంది కౌన్సిలర్లలో టీడీపీ గెలిచింది ఏడుఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్వైఎస్సార్సీపీ బలం 24 , టీడీపీ బలం 8బలం లేకపోయినా వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీపడుతున్న టీడీపీవైస్ చైర్మన్ ఎన్నిక కోసం ప్రలోభాలకు తెరతీసిన పచ్చ పార్టీ.ఫార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన మంత్రి కొలుసు పార్థసారథిరాత్రికి రాత్రి ఏడుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్న పచ్చ పార్టీ.వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల చేరికతో 15కు పెరిగిన టీడీపీ బలంఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి పార్థసారథి ఓటుమంత్రి ఓటుతో సమం కానున్న బలాబలాలునూజివీడు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఇరు పార్టీల కౌన్సిలర్లుమహిళలపై దాడి అమానుషం: గడికోటవైఎస్సార్ జిల్లా..లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ ఇంటిని పరిశీలించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి.శ్రీకాంత్ రెడ్డి కామెంట్స్..నిన్న రాత్రి జాండ్లపల్లిలో జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై దాడికి దిగిన టీడీపీ మూకలుఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. కనిపించిన వాహనాల్ని దహనం చేసిన వైనం.ఇంట్లో ఉన్న జెడ్పీటీసీ రమాదేవి, గర్భిణీగా ఉన్న ఆమె కోడలిపై దాడి.జెడ్పీటీసీ భర్త రెడ్డయ్యను హత్య చేసేందుకే పథకం ప్రకారం దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు.ప్రజలకు సేవ చేసే జెడ్పీటీసీ ఇంటిపై దాడికి దిగడం దుర్మార్గంబీసీ వర్గానికి చెందిన ఆమె ఇంటిపై దాడికి దిగడం కూటమి ప్రభుత్వ అరాచకానికి పరాకాష్టసొంత డబ్బులతో గ్రామంలో అభివృద్ధి చేసే వ్యక్తి జెడ్పీటీసీ కుటుంబంకూటమి ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చే రక్షణ ఇదేనా చంద్రబాబు?ప్రశాంతంగా తయారు చేసిన నియోజకవర్గాన్ని కక్షల దిశగా తీసుకెళ్తున్నారు.ఇది మంచి పరిణామం కాదు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలోచించాలిబీసీ నాయకులపై ఈ విధంగా ఇళ్లలో దూరి దాడిచేయడం, కనిపించిన వాహనాలను దగ్ధం చేయడం దారుణంమీకు సిగ్గుందా.. ఇలాంటి దాడులతో మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరువృద్ధురాలు , గర్భిణీలపై కూడా దాడి చేయడం సిగ్గుమాలిన చర్యఎవరైతే దాడికి పాల్పడ్డారో.. వారిపై వెంటనే చర్యలు తీసుకోండి.ఆ రోజు ఎంపీడీవోపై దాడి జరగకపోయినా ప్రత్యేక విమానంలో వచ్చిన పవన్ కల్యాణ్ బీసీలపై దాడి జరిగితే ఎక్కడకు వెళ్లాడు?కార్యకర్తలు, నాయకులకు మేమంతా తోడుగా ఉంటాం.జిల్లా అధికారులు చిత్తశుద్ధితో దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలి.కాకినాడ..కాకినాడలో పోలీసులు ఓవరాక్షన్..తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలలో పోలీసుల ఓవరాక్షన్మున్సిపల్ చైర్మన్ సుధా బాలుతో పాటుగా కౌన్సిలర్లను కౌన్సిల్ హల్లోకి అనుమతించని పోలీసులుఉదయం 11 గంటలకు లోనికి అనుమతి ఇస్తామని మున్సిపల్ కార్యాలయం గేట్లు మూసివేసిన పోలీసులుఉదయం 10 గంటలకు కౌన్సిల్ హల్లో ఉండాలని.. లేదంటే లోనికి అనుమతించమని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లకు ఆదేశాలు.చైర్మన్ ఛాంబర్లో కూర్చుంటామని చెప్పినా లోనికి అనుమతించని పోలీసులు.పోలీసుల తీరుపై కౌన్సిలర్ల ఆగ్రహంనెల్లూరు..కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి.కార్పొరేటర్స్‌తో కలిసి కార్పొరేషన్‌కి బయల్దేరిన ఎమ్మెల్సీ, సిటీ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి.ఇప్పటికే విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీ..ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారందరూ వైఎస్సార్సీపీ అభ్యర్డికి ఓటేయ్యాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తివిప్ ధిక్కరిస్తే వేటు తప్పదని హెచ్చరిక.తిరుపతి..మేయర్ డాక్టర్ శిరీష వ్యక్తిగత సహాయకుడు నచికేతన్పై టీడీపీ నేతలు దాడి.టీడీపీ నాయకులు అన్నారాం చంద్రయ్య, కార్యకర్తల హల్చల్ఈ క్రమంలో దాడి ఘటపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్న మేయర్ అట్టందర్తిరుపతి..భూమన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్వీ యూనివర్సిటీకి బయలుదేరిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం విజయవాడ..నందిగామ, నూజివీడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలుబలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలుఅనారోగ్య కారణాలతో మృతి చెందిన నందిగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులుచనిపోయిన వారి వార్డులకు ఎన్నికలు జరపకుండానే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెడుతున్న కూటమి ప్రభుత్వంచనిపోయిన కౌన్సిలర్ల వార్డులకు ఎన్నికలు జరపకుండా చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు ఎన్నిక పెట్టడంపై అభ్యంతరంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీనేడు తీర్పునివ్వనున్న కోర్టుకోర్టులో ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక పెట్టిన కూటమి ప్రభుత్వంఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి చేర్చుకున్న టీడీపీనూజివీడిలోనూ ప్రలోభాలకు తెర తీసిన టీడీపీ నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికబలం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ దక్కించుకోవడానికి టీడీపీ కుట్రలురాత్రికి రాత్రి వైఎస్సార్సీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ హిందూపురంలో టీడీపీ కుట్రలు..వైఎస్సార్సీపీ చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో హిందూపురంలో ఎన్నికహిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ కుట్ర రాజకీయాలు.ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు.టీడీపీ బరితెగింపు రాజకీయాలు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాడేపల్లి..నేడు డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికఖాళీ అయిన పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీకార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఓటెయ్యాలని ఆదేశంపార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని ఆదేశాలువిప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంతిరుపతి..తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్దంఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తివైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అందరికీ విప్ జారీ.విప్ ఉల్లంఘిస్తే సభ్యత్వం రద్దు చేస్తామన్న విప్ రాధాకృష్ణ రెడ్డితిరుపతి..తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీడిప్యూటీ మేయర్ ఎన్నికలు ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణ రెడ్డి విప్‌గా నియామకంతిరుపతి కార్పొరేషన్ 46 మంది డివిజన్ కార్పొరేటర్లకు వాట్సాప్ ద్వారా విప్ ఆదేశాలువిప్ను ధిక్కరిస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరికతిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ టీమ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్హిందూపురంలో 144 సెక్షన్..శ్రీసత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 30 యాక్ట్, 144 సెక్షన్ విధింపు. చైర్మన్ ఎన్నిక అనంతరం విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్లు లేదన్న డీఎస్పీ మహేష్తిరుపతి..పద్మావతిపురంలో భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుభూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులువైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కొనసాగుతున్న బెదిరింపులు, పోలీసుల వేధింపులుఆటో నగర్లో కార్పొరేటర్ ఉమా అజయ్‌కు చెందిన షాపును ధ్వంసం చేసిన మున్సిపల్, రెవెన్యూ అధికారులుకూటమికి మద్దతు ఇవ్వకుంటే మిగిలిన ఆస్తులు విధ్వంసానికి దిగుతామని హెచ్చరికలు తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనుండగా.. నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్ పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులతోపాటు ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్ చైర్మన్, నెలూర్లు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
ఎన్నికల వేళ కూటమి నేతల అరాచకం.. అర్ధరాత్రి రమాదేవి ఇంటిపై దాడి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరులో భాస్కర హోటల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు నిర్బంధించారు. హోటల్ బయట కార్లు అడ్డంగా పెట్టి బయటకు వెళ్లకుండా ప్లాన్ చేశారు.తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు రాకుండా కూటమి నేతలు హోటల్లో నిర్బంధించారు. కార్పొరేటర్లు బయటకు రాకుండా కూటమి నేతలు కార్లను అడ్డంగా పెట్టారు. రౌడీయిజం చేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లను విడిపించేందుకు వైఎస్సార్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని కూడా కూటమి నేతలు నిర్బంధించారు.హోటల్ వద్దకు అభినయ్ రెడ్డి వెళ్లడంతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్, టీడీపీకి సంబంధించి జేబీ శ్రీనివాసులు, మాజీ టౌన్ చైర్మన్ పులిగోరు మురళీ, క్రిష్ణా యాదవ్ తదితరులు రౌడీలతో ముట్టడించారు. అనంతరం, పోలీసులు అక్కడికి రావడంతో కూటమి వెనక్కి తగ్గారు. దీంతో, భాస్కర హోటల్ నుంచి తిరుపతికు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులు బయలుదేరారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదు. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దుర్మార్గంగా వ్యవహరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా?. అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారు. మహిళా కార్పొరేటర్లు ఉన్న గదుల్లోకి చొరబడి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారు, బెదిరింపులకు పాల్పడ్డారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ మూకలు కత్తులతో దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సామాగ్రిని ధ్వంసం చేశారు. గర్భవతి అని కూడా చూడకుండా జెడ్పీటీసీ రమాదేవి కోడలిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లో ఆవరణలో ఉన్న బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమ ఇంటిపై దాడి చేయించాడని ఆరోపించారు. దాడి జరగక ముందే జెడ్పీటీసీ భర్తను చంపేస్తామని మంత్రి ఫోన్ చేసి బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. టీడీపీ మూకలు మంకీ క్యాప్‌లు ధరించి కత్తులతో ఇంటిపై దాడికి తెగబడినట్లు తెలిపారు. దీంతో, అర్ధరాత్రి గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. -
నిబంధనలకు నీళ్లు.. అంతా ఒకే వర్గం వాళ్లు!
సాక్షి, అమరావతి: బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగిన తీరుపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఇది పేరుకే ఎన్నిక గానీ... వాస్తవానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, పార్టీ సంఘటనా కార్యదర్శి కనుసన్నల్లో తమకు నచ్చిన వారికే జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టారని ఆ నేతల్లో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు రోజు రాత్రి జిల్లా ఎన్నికల అధికారులకు ముఖ్య నేతలు ఫోన్ చేసి తాము చెప్పిన వారినే అధ్యక్షులుగా ప్రకటించాలని ఒత్తిడి చేశారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా పక్కా పథకం ప్రకారం తమకు నచ్చినవారినే జిల్లా అధ్యక్షులుగా నియమించుకున్నారని సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై ప్రభావం ఉంటుందనే.. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికల తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుల అభిప్రాయం కీలకం. అందువల్ల మెజారిటీ జిల్లాల అధ్యక్షులుగా తమ మనుషులు ఉండాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే ఈ ఎన్నికలను పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడిపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు ఇలా...» బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో కొన్ని నిబంధనలు పాటించాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖలను ఆదేశించింది. » కనీసం ఆరేళ్లు పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉండటంతోపాటు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల వారే జిల్లా అధ్యక్షులుగా పోటీకి అర్హులని జాతీయ నాయకత్వం స్పష్టంగా నిబంధనల్లో పేర్కొన్నట్లు నాయకులు చెబుతున్నారు. » కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రామకృష్ణ వయసు కేవలం 40 సంవత్సరాలేనని, అతనిపై తీవ్ర నేరారోపణలతో కూడిన కేసులు కూడా ఉన్నట్లు ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. » నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అభిరుచి మధుకు నిబంధనల ప్రకారం కనీసం ఆరు సంవత్సరాల క్రియాశీలక సభ్యత్వం లేదని, ఆయనపై గతంలో రౌడీషీటర్‌గా అభియోగాలు ఉన్నాయని ఆ పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. » అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అతనికి అర్హత లేదని ఎన్నికల అధికారి సావిత్రి తిరస్కరించారని, అయినా ఆయన్నే తిరిగి జిల్లా అధ్యక్షులుగా నియమించినట్లు బీజేపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. » అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సాయిలోకేష్ కేవలం మూడు సంవత్సరాల కిందటే బీజేపీలో చేరినట్లు అదే పార్టీ నాయకులు చెబుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష పదవిని 60 ఏళ్లు దాటిన వ్యక్తికి కట్టబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. » అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసేవారు నామినేషన్ వేయడానికి మద్దతుగా మండల అధ్యక్షులు బలపరచాలనే నిబంధన ఉంది. కానీ, ఆ నిబంధనను ఎక్కడా పాటించలేదని తెలుస్తోంది. ఇలా అన్ని జిల్లాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఒకే వర్గం వారిని అధ్యక్షులుగా నియమించారనే చర్చ జోరుగా సాగుతోంది. -
ఎమ్మెల్యే ఆది వర్సెస్ ఎంపీ సీఎం రమేష్.. బీజేపీ నేతల మధ్య వార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య పొసగడం లేదు. ఆదినారాయణరెడ్డి బంధువు పేకాట శిబిరాలు నడుపుతున్నాడంటూ కలెక్టర్, ఎస్పీకి సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు పంపిన సీఎం రమేష్.. ఆది బంధువు దేవగుడి నాగేశ్వరరెడ్డిపై కంప్లెంట్ చేశారు.ఆదినారాయణరెడ్డి వ్యవహారాలన్నీ చక్కబెట్టే నాగేశ్వరరెడ్డిపై సీఎం రమేష్ ఫిర్యాదుతో ఆదినారాయణ రెడ్డి అరాచకాలు బట్టబయలయ్యాయి. ఇప్పుడు పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు కలిసి ఉన్న ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్‌ల మధ్య డైరెక్ట్ వార్ సాగుతోంది.ఇదీ చదవండి: ‘చంద్రబాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం’ -
ఇంత అరాచకమా?.. ‘కూటమి’ మితిమీరిపోతుంది: భూమన
సాక్షి, తిరుపతి: చంద్రబాబు సర్కార్ అరాచకాలు పెరిగిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శేఖర్‌రెడ్డి భవనం కూల్చి లోబరుచుకున్నారు. కార్పొరేటర్ డాక్టర్ అనీష్ రాయల్‌ను కూటమి నేతలు బెదిరిస్తున్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ మునిరామిరెడ్డిని బిల్డింగ్ కూల్చి వేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు.‘‘మంత్రి అనగాని సత్య ప్రసాద్ నీచ రాజకీయాలు చేస్తున్నారు. లోకేష్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తోందంటూ మంత్రి అనగాని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. సనాతన ధర్మం కాపాడతానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ ఉన్నారు?. తిరుపతి రాజకీయాలు పవిత్రంగా ఉండటం మీకు ఇష్టం లేదా?. మీ కూటమి నాయకులే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలన ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు...చంపడం ఒక్కటే మిగిలింది.. కార్పొరేటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలీసులను కూడా బెదిరిస్తున్నారు. విప్ జారీ చేశాం. విప్ ధిక్కరిస్తే పదవులు కూడా కోల్పోతారు. ఆర్థికపరంగా దెబ్బతీస్తూ.. కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. విప్‌ను ధిక్కరిస్తే కచ్చితంగా కార్పొరేటర్లు పదవులు కోల్పోతారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తాం. హౌస్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశాం. డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా..వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీసు భద్రత కల్పించాలని కోరాం’’ అని భూమన తెలిపారు. -
ముద్రగడ నివాసంపై దాడి ఘటన.. పోలీసుల తీరు వివాదాస్పదం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ, కాపు నాయకులు ఖండించారు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?