breaking news
-
‘అమరావతి కేరాఫ్ అవినీతి’
సాక్షి,తాడేపల్లి : సీఎం చంద్రబాబుకు అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు ఉండడం లేదని మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి నిర్మాణ పనుల్లో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని తోపుతుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తుంగలో తొక్కారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. దీని వలన 40టీఎంసీల నీరు రాయలసీమకు రాకుండా పోయింది. పోలవరాన్ని చివరికి బ్యారేజీగా మార్చేశారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు.పనులు ప్రారంభిస్తే వాటిని కూడా చంద్రబాబు ఆపేయించారు. 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పుడు నీరులేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై రాయలసీమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. శ్రీశైలంలో హక్కుగా రావాల్సిన నీటిని వాడుకోవటానికి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు వైఎస్ జగన్ తెచ్చారు. ఆ పనులన్నిటినీ చంద్రబాబు తన పార్టీ వారితో కేసులు వేయించి ఆపారు.రాయలసీమ మీద చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపించటం సరికాదు. శిష్యుడైన రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారు. అందుకే రాయలసీమకు రావాల్సిన నీటిని కూడా తెలంగాణాకు వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ రైతులు ప్రభుత్వంపై ఉద్యమం చేయటానికి రెడీ అవుతున్నారు. అమరావతిపై ఉండే ప్రేమ మిగతా ప్రాంతాలపై ఎందుకు లేదు?. అమరావతిలో జరిగే కాంట్రాక్టుల్లోనూ భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ తెచ్చిన పారదర్శకత లేకుండా అడ్డుగోలుగా కాంట్రాక్టులను కట్టబెట్టేస్తున్నారు’అని ఆరోపించారు. -
నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్
సాక్షి,గుంటూరు: నిరుద్యోగ భృతిపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు నిరుద్యోగభృతి గురించి ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇస్తున్నారని అడిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రశ్నలకు మంత్రి రాంప్రసాద్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో రాంప్రాసద్ తీరుపై ఎమ్మెల్సీ మాధవరావు మండిపడ్డారు. గతంలోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2014-2019లో ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ధ్వజమెత్తారు.ఇప్పుడు మరోసారి నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చి మరో మారు మాట తప్పిందని దుయ్యబట్టారు. -
నిన్న నన్ను.. ఇవాళ మండలి చైర్మన్‌ను అగౌరవపరిచారు: బొత్స
సాక్షి,గుంటూరు: శాసన మండలిలో చైర్మన్ సహా వైఎస్సార్సీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. తాజాగా మండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్‌పై వివక్ష చూపించారని అన్నారాయన. శాసన మండలిలో బొత్స మాట్లాడుతూ..క్రీడా పోటీలు రెండు సభల సభ్యులకు నిర్వహించారు. శాసన మండలిని అవమానించారు. సీఎం, స్పీకర్ ఫొటోలు వేసి మండలి చైర్మన్ ఫొటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారు. వ్యక్తిగతంగా మండలి చైర్మన్‌ను ఇలా కించపరచడం సమంజసం కాదు.నిన్న ఉమ్మడి ఫొటోకు పిలిచి అక్కడ నాకు కుర్చీ వెయ్యలేదు. నాకు కుర్చీ వేయకుండా ప్రోటోకాల్ పాటించలేదు.వేరే వాళ్ల కుర్చీలో కూర్చోమని చెప్పారు. ఇప్పుడు ఏకంగా మండలి చైర్మన్‌ను ఇప్పుడు అగౌరవ పరిచారు.బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై బొత్స అభ్యంతరం సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆమోదించారు. రేపు శాసన మండలిలో చర్చించాలి. కానీ అజెండాలో లేకుండా ఈరోజే పాస్ చేయాలనుకోవడం సమంజసం కాదు. ఈ బిల్లు పై చర్చ జరగాలన్నది మా అభ్యంతరం. రేపు సభ లేకపోతే ఈరోజు ఆమోదించాలి. కానీ ఇప్పుడే ఆమోదించేంత అత్యవసరం ఏముంది. మీకు నచ్చినట్టు చేసుకుంటాం అంటే మాకేమి అభ్యంతరం లేదు. ఉద్యోగులకు జీతాలు రేపు ఇస్తారా..?. యనమల చెప్పినట్టు బిల్లుపై చర్చ జరగాలి.బీఏసీలో రెండు రోజులు రిజర్వ్ పెట్టింది. అలాంటప్పుడు అసలు బిల్లు చూసుకునే అవకాశమే లేకుండా చర్చ పెట్టేస్తే ఎలా..?’ అని ప్రశ్నించారు. -
వైఎస్సార్ పేరు అంటే చంద్రబాబుకు వణుకు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్సార్ పేరును గోడల మీద, స్టేడియం మీద నుంచి చెరిస్తారేమో కానీ.. ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని అన్నారు. వైఎస్సార్ పేరు వింటేనే కూటమి నేతలకు వణుకు పుడుతోందన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వైఎస్సార్సీపీ లేకుండా చేయాలని చూస్తున్నారు. వైఎస్సార్ పేరు, బ్రాండ్ లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో వైఎస్సార్ విగ్రహాన్ని తగలబెట్టారు. ఇప్పుడు క్రికెట్ స్టేడియానికి వైఎస్ పేరు తొలగించారు. సీతకొండ వ్యూ పాయింట్‌కి వైఎస్ పేరు చేరిపివేశారు. వైఎస్సార్ పేరు గోడల మీద, స్టేడియం మీద నుంచి చెరిస్తారేమో కానీ.. ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరు.రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం చేపడతాం. వైఎస్సార్ రాష్ట్రానికి చేసిన సేవకు గుర్తుగా క్రికెట్ స్టేడియానికి పేరు పెట్టారు. వైఎస్సార్ పేరు వింటేనే కూటమి నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్లో లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరు తొలగించారు. అలాగే, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరు తొలగించారు. ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరును కూడా చంద్రబాబు పెట్టలేకపోయారు. కానీ, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన నాయకుడు వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు. -
ప్చ్.. చంద్రబాబు పేరు చెప్పినా వినలేదు!
తిరుపతి, సాక్షి: సాధారణంగా.. చంద్రబాబు ఎన్నికలొస్తున్నాయంటే అడ్డగోలు హామీలు ప్రకటిస్తారు. వాటిని అమలు చేయడం అనేది ఆయన రాజకీయంలోనే లేదు. ఈ మాట మేం అంటోంది కాదు.. యావత్ ఏపీ కోడై కూస్తోంది ఇప్పుడు. ఈ క్రమంలో నిరసనలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutavam) చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు వినూత్న ప్రయత్నం జరిగింది. బుధవారం ఉదయం కొందరు ప్రయాణికులు.. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కారు. కండక్టర్ వచ్చి టికెట్ అడగ్గానే.. వాళ్లంతా తమ చేతుల్లోని ఫోన్లను చూపించారు. ‘‘అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. నాదీ హామీ’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. ఆ వీడియోను ప్రదర్శించిన మహిళలు.. తాను అందుకే ఎక్కామని చెప్పారు. ఇంతలో చంద్రబాబు ఫేస్ మాస్క్ వేసుకుని ఓ వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడంతో.. ఆ కండక్టర్ నిర్ఘాంతపోయారు. అయితే.. ఏపీలో ఎక్కడా ఉచిత ప్రయాణం లేదని చెబుతూ ఆ మహిళల గుంపును దిగిపోవాలని సూచించాడు. ఈలోపు చంద్రబాబు ముఖం మాస్క్‌తో ఉన్న వ్యక్తి బస్సులో హడావిడి చేశారు. అయితే ‘‘టికెట్ అడిగితే నా పేరు చెప్పండి’’ స్వయంగా చంద్రబాబు ఆ వీడియోలో చెప్పిన మాటలు మరోసారి కండక్టర్‌కు చూపించారు. ఈ క్రమంలో కండక్టర్ వాళ్లతో వాగ్వాదానికి దిగారు. తాము సీఎం చంద్రబాబు చెబితేనే ఫ్రీ ప్రయాణానికి వచ్చామని పదే పదే చెప్పడంతో ఆ కండక్టర్ చివరకు పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండిదీంతో.. బస్సును నేరుగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్‌కు తరలించగా.. అదుపులోకి తీసుకున్న ఆ ప్రయాణికుల్లో మేయర్ డాక్టర్ శిరీష(Mayor Sirisha) కూడా ఉండడం చూసి పోలీసులు కంగుతిన్నారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జి అభినయ్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసంపై బుధవారం ఇలా నిరసన కార్యక్రమం జరగడం మరో విశేషం. -
APLC: మేమెందుకు క్షమాపణలు చెప్పాలి?
అమరావతి, సాక్షి: శాసనమండలిలో ఇవాళ మరోసారి మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ(Botsa Satyanaraya) మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి లోకేష్ ఆరోపించగా.. బొత్స ఆ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఏపీలో 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారనడం(Drop Outs) సరికాదు. మంత్రి నారాలోకేష్(Nara Lokesh)కు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భమూ లేదు. .. సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదు. కావాలంటే మండలి సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టండి. 2014-19 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి...2019-24 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దాం. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. కానీ, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం(English Medium) కూడా ప్రోత్సహించాలన్నదే మా విధానం. .. ప్రాధమిక విద్యనుంచి టోఫెల్ విద్యను నేర్పించడం. ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం. సెంట్రల్ సిలబస్ (సిబిఎస్) ను ప్రవేశపెట్టడం లాంటివి చేశాం. మొన్న 80% మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారు. కిందిస్థాయి నుంచి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను అందుబాటులోకి తెచ్చాం. రేపు ఈ సబ్జెక్ట్ మీద చర్చించాలని మేం కోరాం. ఈ రోజు ఉద్యోగుల సమస్యల పై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. నేను తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి నా మాటలను తొలగించండి. మేం క్షమాపణ చెప్పాలనడమేంటి... ఎందుకు మేము క్షమాపణ చెప్పాలి అని లోకేష్ వ్యాఖ్యలను ఉద్దేశించి బొత్స తీవ్రంగా ధ్వజమెత్తారు.అంతకుముందు.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు , ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ,ఐఆర్ ,డీఏ ,ఉద్యోగుల సమస్యలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. అనంతరం.. ప్రశ్నోత్తరాలు జరిగాయి. -
ఆ రెండేళ్ల కథ ఏంది రేవంత్?
ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ.. అధికారంలోకి వచ్చిన తరువాత సర్దుకోవడానికి రెండేళ్లు పడుతుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య.. ఆయనకు పెద్దగా ఉపకరించేదిగా కనిపించడం లేదు. పైగా ఈ వ్యాఖ్యల సందర్భంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుళ్ల పాలన గురించి అనవసరంగా ప్రస్తావించారు. అయితే అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో చాలా తేడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తించి ఉండాల్సింది. బీఆర్ఎస్ పాలనను(BRS Party Rule) తుప్పుతో వర్ణించిన రేవంత్ వదిలిచేందుకు పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దేందుకు రెండేళ్లు పడుతుందని, వైఎస్సార్, చంద్రబాబుల పాలనల గురించి ప్రస్తావించారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే రేవంత్ చంద్రబాబుకు సన్నిహితుడన్న ముద్ర కలిగి ఉండటం. కాబట్టి ఆయన ఒక్కరి పేరు ఎందుకు ప్రస్తావించాలని అనుకుని వైఎస్సార్ పేరును కలిపారా? అనే ప్రశ్న తలెత్తకమానదు. 👉చంద్రబాబు నాయుడు 1994లో ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి. ఆ తరువాత ఎన్టీఆర్‌ను కూలదోసి సీఎం అయ్యారు. 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే చంద్రబాబు పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి వైఎస్‌కు రెండేళ్లు పట్టిందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పదలిచారా?. చంద్రబాబు పాలన అంత అధ్వాన్నంగా ఉందని బహిరంగంగా చెప్పడానికి ఆయన ఇష్టపడతారా?. ముఖ్యమంత్రలు తమ అధికార అవధిలో కొన్ని కొన్ని విధానాలు పాటించడం సహజం. కానీ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనో, లేక మరో రకంగానో వైఎస్ పాలన సాగలేదు. వైఎస్ అధికారం దక్కిన వెంటనే చంద్రబాబు పట్టించుకోని జలయజ్ఞం పనులు చేపటారు. హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తోసహా పలు అభివృద్ది పనులు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు అందులో అత్యంత కీలకమైంది. అంతేతప్ప చంద్రబాబు ప్రభుత్వ తీరుతెన్నులపై మాట్లాడుతూ కూర్చోలేదు. చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ సాధ్యపడదని తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేవారు. రాజశేఖరరెడ్డి మాత్రం సీఎం అయిన వెంటనే అమలు చేసి చూపించారు. 👉గత ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని వ్యవస్థ ఎటూ టేకప్ చేస్తుంటుంది. అది వేరే విషయం. వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekar Reddy) టైమ్‌లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ఎక్కువగా ఇచ్చింది. దాని వల్ల ఆయనకు పెద్ద ఇబ్బంది రాలేదు. ప్రజలు ఆయన నాయకత్వాన్ని విశ్వసించారు. దానివల్లే 2009లో కూడా ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారు. అయితే ఆయన అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తదుపరి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. వీరెప్పుడూ వైఎస్ పాలనను తప్పు పట్టలేదు. ఈలోగా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం, దాని వల్ల ఎదురైన పరిణామాలు ప్రధానంగా రాజకీయాలను ఆక్రమించాయి. 2014లో విభజన జరిగిపోయింది. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రయ్యారు. విభజిత ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 👉కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు అప్పట్లో అనేవారు. కేసీఆర్ కూడా అరవై ఏళ్ల సమైక్య పాలనలో లోపాలు అంటూ ఎత్తి చూపుతుండేవారు. వీరిద్దరూ ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చారు. వాటిలో ఎక్కువ వాటిని అమలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారు. అందువల్ల ఆయన రెండోసారి పెద్దగా ఇబ్బంది లేకుండా గెలవగలిగారు. ఏపీలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్లు తేలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆయన రెండేళ్లు ఏమిఖర్మ.. ఐదేళ్లపాటు అదే పాట పాడేవారు. నవ నిర్మాణ దీక్ష అంటూ కాంగ్రెస్‌ను తిట్టడానికి ఒక కార్యక్రమం నిర్వహించేవారు. ఇంతలో ఓటుకు నోటు కేసు రావడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ వదలి హుటాహుటిన విజయవాడకు వెళ్లిపోయారు. అది అప్పటి కథ. చంద్రబాబు హామీలు నెరవేర్చక పోవడంవల్ల ప్రజలలో అసంతృప్తి ఏర్పడి టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎప్పుడైనా ఒకటి, రెండు సందర్భాలలో గత ప్రభుత్వం అంటూ మాట్లాడారేమో కాని, ఎక్కువ భాగం తను ఇచ్చిన హామీలు, వాటి అమలుకు తీసుకోవల్సిన చర్యలపైనే దృష్టిపెట్టారు. తద్వారా ఆరు నెలలలోనే అనేక కొత్త వ్యవస్థలను సృష్టించారు. వాగ్దానాలు అమలుకు రెండేళ్లు తీసుకోలేదు. మధ్యలో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వచ్చినా జగన్ ఏపీని నిలబెట్టారు. కేసీఆర్ మిషన్ భగీరథ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టులకు రెండో టర్మ్‌లో పూర్తి చేశారు. హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ది పనులు చేశారు. ఈ ప్రభుత్వాలలో ఏవైనా లోపాలు ఉంటే ఉండవచ్చు. కాని వాటిని సరిదిద్దడానికి రెండేళ్లు పడుతుందని రేవంత్ అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. కేసీఆర్ రెండో టర్మ్ కూడా గెలిచి 2023లో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నిటిని ఏడాది లోపు అమలు చేయడానికి కొంత ప్రయత్నం చేసింది. రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్, రైతు బంధు, గ్యాస్ సిలిండర్లు, గృహజ్యోతి వంటివి పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేర అమలు చేసే యత్నం చేశారు.. ఇంకా అనేకం పెండింగులో ఉన్నాయి. ఉదాహరణకు మహిళలకు ఏడాదికి రూ.2500, స్కూటీల పంపిణీ, పెన్షన్‌ను రూ.నాలుగు వేలు చేయడం, దళితులకు రూ.పది లక్షల స్కీమ్ మదలైనవి ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి నిధులు అవసరం. మరీ ఎక్కువగా హమీలు ఇచ్చామని చెప్పకుండా గత ప్రభుత్వం చేసిన తుప్పు వదలించుకోవడానికి పదేళ్లు పడుతుందని చెప్పడం ద్వారా సమస్యను డైవర్ట్ చేయడం ఒక లక్ష్యం అయితే, మరో టర్మ్ కూడా తనను ఎన్నుకోవాలని చెప్పడం మరో లక్ష్యంగా కనిపిస్తుంంది. 👉2024లో ఎన్నికైన చంద్రబాబు కూడా నిత్యం జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కాలం గడుపుతుండడం చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని చెబితే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ సిక్స్(Super Six Promises) అంటూ ఊదరగొట్టింది. వాటిని అమలు చేయకుండా ఏవేవో కథలు చెబుతూ, జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను వాస్తవాల నుంచి మళ్లించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఈ విషయాన్ని రేవంత్ చెప్పడం లేదు. ఇందులో చంద్రబాబు కూడా కష్టపడుతున్నారని చెప్పదలిచారో, లేక రెండు రాష్ట్రాలలో ఇబ్బందులు ఉన్నాయని ప్రచారం చేయదలిచారో తెలియదు. పరిపాలనపై పట్టు రావడానికి ఇంకా సమయం కావాలని రేవంత్ చెబుతున్నారు. పదిహేను నెలల పాలన తర్వాత ఆయన ఆ మాట అనడం ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లే అవుతుంది. అసలు సమస్య పాలనపై పట్టు కాదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు కాకపోవడం, నిధులు లేకపోవడం , ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రజలలో వ్యతిరేకత వస్తున్నదేమోనన్న భయం వెంటాడుతున్నట్లుగా ఉంది. ఏపీలో సైతం చంద్రబాబు నాయుడు సర్కార్ చేసిన వాగ్దానాలకు ఎగనామం పెడుతూ, వాటిని కప్పిపుచ్చడానికి రెడ్ బుక్ అంటూ అరాచకాలు సృష్టించడానికి, గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తూ ఒకరకంగా చెప్పాలంటే విద్వంసకర పాత్ర పోషిస్తోంది. హామీల అమలు యత్నంలో చంద్రబాబు కన్నా రేవంత్ కాస్త బెటర్. కానీ ఇద్దరూ గతం తవ్వుతూ కొత్త కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇంతోటిదానికి పవన్ ఆదేశాలు.. కమిటీలు.. ఫోటోలకు ఫోజులు!
కాకినాడ, సాక్షి: చిత్రాడ.. మొన్నటిదాకా కాలుష్యం అనే పదానికి అల్లంత దూరాన ఉన్న గ్రామం. ఎప్పుడైతే జనసేన, ఆ పార్టీ కార్యకర్తలు అడుగు మోపారో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి!!. పొరపాటున అభివృద్ధి విషయంలో అనుకునేరు!!. విపరీతమైన కాలుష్యం, ఎటు చూసినా చెత్తాచెదారం.. ఫ్లెక్సీలతోనే ఆ మార్పు అంతా!!.మొన్నీమధ్యే జరిగిన జనసేన ఆవిర్భావ సభ.. చిత్రాడ(పిఠాపురం)కు విపరీతమైన కాలుష్యాన్ని మిగిల్చింది. అందుకు కారణం.. అక్కడి చెత్తను తరలించకపోవడం ఒకటైతే.. దానిని అక్కడికక్కడే పోగేసి కాల్చేయడం. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా.. పైగా బోనస్‌గా కాలుష్యాన్ని అంటగట్టారంటూ జనసేనను తిట్టిపోస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు.జనసేన సభ తర్వాత.. ఇవాళ్టికి అక్కడి రోడ్లపై ఇంకా జనసేనవారి ఫ్లెక్సీలు, వెల్కమ్ బ్యానర్లు.. ఆఖరికి భారీ ఆర్చ్‌లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ ముసుగేసి పడుకుంది. దీంతో పవన్ పర్యవేక్షణలో ఉన్న ఓ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలతో ఆ చెత్త ఏరివేయించారు.నాదెండ్ల స్వయంగా ప్రకటించి..తమది చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, సభ తరువాత సభా ప్రాంగణాన్ని శుద్ది చేస్తామని జనసేన సీనియర్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ది చేసి..ఫ్లెక్సీలు తొలగించాలని తమ అధినేత పవన్ ఆదేశించినట్లు చెప్పారాయన. ఈ క్రమంలోనే..కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. అయితే మరుసటి రోజు జనసేన నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. శుద్ధి చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదయ్యాక అక్కడి నుంచి గాయబ్ అయ్యారు. ఈలోపు.. పవన్ సొంత శాఖలోని ఉపాధి హమీ కూలీలు ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా.. అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. దీంతో విపరీతమైన కాలుష్యంతో ఆ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. -
‘చంద్రబాబు ప్రపంచానికే తానే దిక్సూచీ అనడం పెద్ద జోక్’
సాక్షి,తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్-2047 ఒక బూటకమని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రపంచానికే తానే దిక్సూజీ అనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం, ప్రపంచంలోనే తాను ఒక విజనరీగా చెప్పుకునేందుకే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ల నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలుశక్తిని పెంచకుండా, రాష్ట్రంలో తన విజన్‌తో సంపదను సృష్టిస్తానంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...శాసనసభలో చంద్రబాబు అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడుతూ చేసిన ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేందుకే. చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా ఉండి మూడు విజన్ డాక్యుమెంట్లను ప్రకటించారు. విజన్-2020 అని ఒకసారి, విజన్-2029 అని మరోసారి, తాజాగా విజన్-2047 అని మూడోసారి తన స్వర్ణాంధ్ర లక్ష్యాలను ఆయన చాటుతూనే ఉన్నారు. నిజంగా ఒక లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన గతంలో ప్రకటించిన విజన్లలో ఎన్ని సాధించారు? ఎంతమంది ప్రజల జీవితాల్లో ప్రగతిని తీసుకువచ్చారు? రాష్ట్రాన్ని ఎంత ఉన్నత స్థాయికి తెచ్చారో చెప్పాలి. గత రెండు విజన్లలోనూ చంద్రబాబు చేసింది ఏమిటా అని చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడమే. ఇప్పుడు తాజా విజన్‌లో పీ4 ద్వారా ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల ఆస్తులను కూడా ప్రైవేటువ్యక్తులకు కట్టబెట్టనున్నారు. చివరికి నడిచే రోడ్లను కూడా ప్రైవేటు వారికి అప్పగించి, టోల్ ట్యాక్స్ ద్వారా ప్రజల జేబులు ఖాళీ చేయించబోతున్నారు.విద్య-వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఘనుడుచంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన ఘనమైన విజన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళే పేదల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించాడు. ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. విద్యారంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి పూర్తిగా సహకరించారు. తాను సీఎం కాదు, సీఈఓను అని పిలిపించుకునేందుకే చంద్రబాబు ఇష్టపడ్డారు. అలాగే పనిచేశారు. చివరికి చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ వామపక్షాలు ఆయనకు గొప్ప బిరుదును ఇచ్చాయి. ఎంఎస్ఎంఈ లకు బదులుగా కార్పోరేట్ సంస్థలు వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మిన నాయకుడు చంద్రబాబు. విజన్ 2020 తరువాత రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల సంఖ్య దాదాపు 70 శాతం ఉన్నట్లు తేలింది. అంటే ఆయన విజన్ వల్ల ఎక్కడ సంపద పెరిగింది? ప్రజలు సంపన్నులు ఎందుకు కాలేకపోయారు? చంద్రబాబు విజన్ వల్ల పేదరికం పెరిగింది. హైటెక్ సిటీ, చుట్టుపక్కల భూములు ఏ విధంగా ఒక వర్గానికే ఉపయోగపడేలా చంద్రబాబు విధానాలు సహకరించాయంటూ రీసెర్చ్ స్కాలర్లు పుస్తకాలు రాశారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవు.వ్యవసాయం దండగ అనే భావంతోనే పాలనవ్యవసాయం దండగ అనే భావంతోనే చంద్రబాబు పాలన సాగించారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు రెండు కోట్ల మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ అడ్డుకుంటుంటే చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన హయాంలో చెప్పుకునేందుకు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ తీసుకురాలేదు. ఇప్పుడు బనకచర్ల తన ఆలోచనల నుంచే పుట్టిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గతంలో ఐటీని తానే ప్రమోట్ చేశానని, హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టానంటూ గొప్పలు చెప్పుకున్నారు. తాను లేకపోతే హైదరాబాద్‌కు ఐటీ వచ్చేదేకాదు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. మరి ముంబై, బెంగుళూరు వంటి నగరాలు ఐటీలో మనకన్నా ముందుగానే అభివృద్ధి చెందాయన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు మరిచిపోతుంటారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వల్ల దేశంలో ఎలక్ట్రానిక్ యుగం ప్రారంభమైందని, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి పథకాల వల్ల గ్రామాల్లోంచి కూడా సాంకేతిక విద్యను చదివిన ఐటీ నిపుణులు పుట్టుకు వచ్చారనే వాస్తవాలను చంద్రబాబు అంగీకరించరు. ఆఖరికి కరోనా వల్ల ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం అవకాశం ఇస్తే, దానికి కూడా తన సూచనల వల్లే ఈ విధానంను ఐటీ సంస్థలు పాటించాయని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు.పొలిటికల్ గవర్నెన్స్ చంద్రబాబు విజనా?పాత రాజకీయాలకు కాలం చెల్లింది, నేను కొత్త రాజకీయాలు తయారు చేస్తానంటూ విజన్ 2020లో ప్రకటించారు. అంటే జన్మభూమి కమిటీలను తీసుకురావడం, పొలిటికల్ గవర్నెన్స్‌ను తీసుకురావడమే ఆయన విజనా? స్థానిక సంస్థల్లో ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా, ఫిరాయింపులతో పదవులను కాజేయడమే ఆయన గవర్నెన్స్ లక్ష్యమా? ప్లెయిన్ స్పీచ్ అనే పుస్తకంలో ప్రభుత్వం యంత్రాంగం అవినీతిలో మునిగిపోయింది, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవన్నీ చంద్రబాబు మరిచిపోయారా? ఇప్పుడు విజన్ 2047 గురించి బాధ్యత లేకుండా మాట్లాడారు. తన తాజా విజన్‌లో ఈ దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి వెడుతుందని పేర్కొన్నారు. ఒక సీఎంగా ఏ రకంగా దేశ జీడీపీ గురించి మాట్లాడుతున్నారు? 2047 నాటికి ప్రతి ఇంటికి 18వేల డాలర్ల ఆదాయం ఉండాలని సూచిస్తున్నారు. అంటే 2047 వరకు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏం అడగకూడదు. చంద్రబాబును ఆయన హామీల గురించి ప్రశ్నించకూడదు. స్వర్ణాంధ్ర విజన్‌ను విజయవంతం చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి, పారిశ్రామికవేత్తలను కూడా వారే తీసుకురావాలని చంద్రబాబు సూచిస్తున్నారు. అలాంటప్పుడు దావోస్‌కు సీఎంగా ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళడం? ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్ళాలిగా? రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను తీసుకువస్తాను, సంపదను సృష్టిస్తానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా 13 శాతం వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నమని చెబితే, తాజాగా చంద్రబాబు 17 శాతం వృద్ధి రేటును సాధిస్తామని ఏ ప్రాతిపాదికన చెబుతున్నారు? ఇప్పటి వరకు అన్నింటిలోనూ లోటు కనిపిస్తోంది. ఇలా అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడతారా? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ళలో 3.7 శాతం వృద్ధిరేటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌లో 7.23 శాతం వృద్దిరేటు తక్కువగా ఉంది. సేల్స్ టాక్స్‌లో 6.66 శాతం వృద్ధిరేటు తక్కువగా ఉంది. క్యాపిటల్ ఇన్వేస్ట్మెంట్ 50.53 శాతం తగ్గింది. సంపద పెరిగిందని ఎలా చెబుతున్నారు? ప్రపంచానికే చంద్రబాబు దిక్సూచీ అనడం పెద్ద జోక్ప్రపంచానికే తాను దిక్సూచీగా మారతానని విజన్ డాక్యుమెంట్లో ప్రకటించుకోవడం పెద్ద జోక్. గతంలో ఆయన హయాంలోనే 54 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఏపీ ఆయిల్ సీడ్స్ ను కూడా ప్రైవేటువారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, 1.30 లక్షల ఎకరాల ఆర్టీసీ భూములను, వైయస్ జగన్ హయాంలో నిర్మించిన పోర్ట్‌లను కూడా ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అలాగే త్రిభాషా విధానంపైన మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజలు కోరుతున్న అన్ని భాషలను ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళలోకి తీసుకురాలేకపోతున్నారు? -
బాబు వెన్నుపోటు.. యనమల స్ట్రాంగ్ రిటార్ట్!
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి(Yanamala Rama Krishnudu) అసమ్మతి గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీల వీడ్కోలు సభకు రావాలంటూ ఆహ్వానం పంపినప్పటికీ.. ఆయన సీఎం చంద్రబాబు(CM Chandrababu)కి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే గైర్హాజరు అయ్యారని స్పష్టమైన సమాచారం. టీడీపీలో తనకు కొనసాగుతున్న అవమానమే ఇందుకు కారణమని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.తాజాగా.. ఏడుగురు ఎమ్మెల్సీలకు(Seven MLCs) మండలి వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని మండలిలో స్పష్టంగా మెన్షన్ చేశారు కూడా. అయితే తన చేత బలవంతంగా రాజకీయ విరమణ చేయిస్తున్న చంద్రబాబు చర్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆ వీడ్కోలు మీటింగ్‌కు కావాలనే డుమ్మా కొట్టి.. టీడీపీలోనే గుసగుసలాడుకునేలా చేశారు.ఆరుసార్లు వరుస ఎమ్మెల్యే, రెండుసార్లు ఎమ్మెల్సీ, ఒకసారి స్పీకర్, పైగా మంత్రిగా కూడా. టీడీపీలో మొదటి నుంచి ఉన్న యనమలకు చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. ఆయన కూతురు ఎమ్మెల్యే, బంధువులకు మంచి స్థానాలు దక్కినప్పటికీ.. తనకు ఒక్కసారిగా ప్రాధాన్యం తగ్గించడంపై యనమల రగిలిపోతున్నారు. పైగా గత ఐదేళ్లు మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగినా కూడా తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయినట్లు ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా ఎమ్మెల్సీ(MLC)గా రెన్యువల్ అవకాశాలు ఉన్నా చంద్రబాబు ఆ పని చేయలేదు. కనీసం ఆయనకున్న రాజకీయానుభవాన్ని కూడా అధినేత పట్టించుకోవడం లేదని ఆయతన వర్గీయులు అంటున్నారు. పైగా తానే స్వచ్ఛందంగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లు.. రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించడాన్ని యనమల భరించలేకపోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇంకొంత కాలం కొనసాగి.. ఆపై రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని ఆయన భావించారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఈలోపు చంద్రబాబు తన మార్క్ వెన్నుపోటు రాజకీయం యనమల మీదకూ ప్రయోగించారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలతో చివరకు.. చంద్రబాబుతో ఉమ్మడి ఫోటోకి కూడా ఇష్టపడని యనమల వీడ్కోలు మీటింగ్‌కు వెళ్లలేదు. మరోవైపు ‘ఫార్టీ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్’ యనమల లేకుండా ఈ మీటింగ్ జరగడంపై టీడీపీలో ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తోంది. -
పవన్ గొంతు చించుకున్నారు.. మరి అది ఇప్పుడేమైంది?
సాధారణంగా శాసనసభలో లేని వ్యక్తుల గురించి ఏవైనా ఆరోపణలు,విమర్శలు చేయడం సమంజసం కాదన్నది సంప్రదాయం. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా అలా మాట్లాడితే స్పీకర్ స్థానంలో ఉన్నవారు వారిస్తుంటారు. కాని స్వయంగా ముఖ్యమంత్రే అలా మాట్లాడితే ఏమి చేస్తారు! ఎపి శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ గురించి చేస్తున్న విమర్శలు అసంబద్దంగా ,అసందర్భంగా ఉంటున్నాయి. కారణం ఏమైనా సభలో జగన్ లేనప్పుడు ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి చంద్రబాబు సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది. తాము ఎన్నికల సమయంలో చేసిన సూపర్ సిక్స్ తో పాటు మరో 143 హామీల అమలు గురించి కన్నా జగన్ పైనే ఆరోపణలు చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. మహిళా సాధికారిత గురించి ఆయన సభలో ప్రసంగం చేసినప్పుడు ఏ అంశాల గురించి చెప్పాలి? తాము ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల గురించి కదా!వాటిని పక్కనబెట్టి కొత్త హామీలు ఇస్తూ కధ నడిపడమే కాకుండా ,జగన్ ఆడబిడ్డల ద్రోహానికి పాల్పడ్డారని ,అదో కేస్ స్టడీ అని చెబుతున్నారంటే ప్రజలు విస్తుపోవడం తప్ప చేయగలిగింది ఏముంది?చంద్రబాబు నాయుడు మహిళలకు ఏఏ హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్నిటిని అమలు చేశారో అంశాలవారిగా లెక్కలు చెబితే అది ఆడబిడ్డలకు మేలు చేసినట్లు అవుతుంది .అలాకాకుండా అసలు ఆ అంశాలనే ప్రస్తావించకుండా జగన్ పైనో, మరొకరిపైనో ఆరోపణలు చేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది. అది చంద్రబాబు ప్రభుత్వం ఆడబిడ్డలకు ద్రోహం చేసినట్లు కాదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తకుండా ఎగవేయడం ద్రోహం అవుతుందా? కాదా?కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతమంది మహిళలు అఘాయిత్యాలకు గురయ్యారో వివరించి, వాటిని అరికట్టడానికి ఏమి చర్య తీసుకుంటున్నారో చెప్పాలి కదా?అవన్ని ఎందుకు !ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అంటూ గొంతు చించుకుని మాట్లాడేవారు కదా! ఆ కేసు గురించి ఎన్నడైనా చంద్రబాబు మాట్లాడారా? పవన్ మాట నిలబెట్టుకున్నారా?దానిని ద్రోహం అంటారా?అనరా?ప్రతి ముఖ్యమైన పండగకు మహిళలకు కానుకలు ఇస్తామని ప్రకటించారు కదా?ఈ ఏడాది కాలంలో పండగలు రాలేదా!అయినా ఏ ఒక్క మహిళకైనా కానుకలు అందాయా?పెళ్లికానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారే!మహిళలు ఎవరికైనా అందచేశారా?వలంటీర్లకు పదివేల వేతనం ఇస్తామని చెప్పి,అసలుకే ఎసరు పెట్టారు కదా!ఆ వలంటీర్లలో లక్షమందికి పైగా మహిళలుఉన్నారు కదా!వారికి ఇచ్చిన సాధికారిత ఇదేనా!ఆర్డిసి బస్ లలో ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు కదా!దానికి బడ్జెట్ లో ఒక్క రూపాయి అయినా పెట్టారా?తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి 15వేలు ఇచ్చే వాగ్దానం ఒక ఏడాదిపాటు అతీగతీ లేదే!వచ్చే ఏడాది ఏ మేరకు ఇస్తారో తెలియదు.ఆ తల్లికి ఆ డబ్బు ద్వారా సాధికారిత వచ్చేది కదా!జగన్ తాను మహిళలకు ఇచ్చిన హామీలన్ని దాదాపు అమలు చేశారే.అన్ని స్కీమ్ లు మహిళల పేరిటే ఇచ్చారు కదా!అమ్మ ఒడి, 31 లక్షల ఇళ్ల పట్టాలు, చేయూత,ఆసరా,కాపు నేస్తం , ఆర్ధికంగా బలహీనవర్గాల నేస్తం..ఇలా ఆయా స్కీములలో డబ్బులు ఇచ్చారే.చేయూత కింద మహిళలకు 18500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేసి,వారితో వ్యాపారాలు పెట్టించి, రిలయన్స్, ఐటిసి తదితర ప్రముఖ సంస్థలతో టై అప్ చేశారే.మహిళల భద్రతకు దిశ యాప్ తెచ్చారే.ఇప్పుడు అదే యాప్ ను పేరు మార్చి చంద్రబాబు వాడుతున్నారా?లేదా?ఇన్ని చేసిన జగన్ ఆడబిడ్డల ద్రోహి అవుతారా?లేక చేసిన బాసలకు మంగళం పలుకుతున్నట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు ద్రోహి అవుతారా అన్న ప్రశ్న వస్తే ఏమి జవాబు ఇస్తాం. ఇవన్ని వదలివేసి జగన్ కుటుంబంలో ఏదో జరిగిందని,తల్లికి ,చెల్లికి న్యాయం చేయలేదంటూ అసత్య ఆరపణలు చేయడం ఎంతమేర సమంజసం.చెల్లికి 200 కోట్ల మేర డివిడెండ్ల రూపంలో చెల్లించిన జగన్ ద్రోహం చేసినట్లు ఎలా అవుతుందో చంద్రబాబే చెప్పాలి. పోనీ తన తోబుట్టువులకు చంద్రబాబు ఏ విధంగా సాయం చేసింది చెప్పి ఉంటే బాగుండేది కదా!చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రతిగా వైఎస్సార్సీపీ స్పందిస్తూ పలు ప్రశ్నలు వేసింది.హైదరాబాద్ లో ఇతర చోట్ల చంద్రబాబు కుటుంబానికి ఉన్న వందల కోట్ల ఆస్తులలో తన తోబుట్టువులకు ఎంత ఇచ్చారని అడిగింది.తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబానికి ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించింది. తనతల్లి పేరు మీద ఉన్న మదీనగూడ భూమిలో వారికి వాటా ఇవ్వకుండా లోకేష్ ఒక్కరి పేరు మీదే ఎందుకు మార్పించింది వాస్తవం కాదా అని అప్రశ్నించింది.ముందుగా తన ఇంటిలో సమన్యాయం పాటించకుండా ఇంకొకరి ఇంటి వ్యవహారాన్ని ప్రస్తావించడం అన్యాయం కాదా అని వైఎస్సార్సీపీవ్యాఖ్యానించింది. డ్వాక్రా మహిళలకు సంబంధించి చంద్రబాబు చేసిన ప్రకటనలు కూడా ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు. కొద్ది రోజుల క్రితం ఏడాదికి లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని అన్నారు.తాజాగా ఆ సంఖ్యను లక్షా డెబ్బైఐదువేలకు పెంచారు. డ్వాక్రా మహిళలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని,అందులో సగం పెట్టుబడి తీసుకురాగలిగితే ఆరువేల కోట్ల లాభాలు వచ్చేస్తాయని కూడా ఆయన ఊరించారు. డీ లిమిటేషన్ జరిగితే భవిష్యత్తులో శాసనసభలో 75 మంది మహిళలకు అవకాశం రావచ్చని ఆయన అన్నారు. డి లిమిటేషన్ లో ఎపికి కూడా నష్టం జరుగుతుంందని అంతా వాపోతుంటే, దాని గురించి మాట్లాడకుండా మహిళలకు సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనండని ఆయన ప్రచారం చేస్తున్నారు.కాని తద్వారా ఎదురయ్యే సమస్యల గురించి వివరించి, వాటిని అధిగమించడానికి ఏమి చేయాలో చెప్పరు. మహిళలకు తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చి తద్వారా సాధికారిత తెచ్చామని చెబితే ఎవరైనా నమ్ముతారు కాని, ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేసి అంతా అయిపోయినట్లు భ్రమలో పెట్టాలని అనుకుంటే ఏమి ప్రయోజనం ?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం కాదని, వాటిపై విచారణ జరిపిస్తే ఆ నివేదికతో సభలో చర్చించాలే తప్ప.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిరాధార ఆరోపణలతో ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ప్రభుత్వం సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ చర్చించాలని ప్రభుత్వం అనుకొంటే 2014 నుంచి ఇప్పటివరకు చర్చించాలని మరోసారి స్పష్టం చేశారు.సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత గురువారం వాయిదా వేసిన ‘2019–24 మధ్య జరిగిన కుంభ కోణాలపై’ లఘు చర్చలో ప్రభుత్వ సమాధానానికి చైర్మన్ మోషేన్ రాజు అనుమతించారు. దీనిపై ప్రతిపక్ష నేత అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం ఒక పక్కన విచారణకు ఆదేశించామంటూనే, సభలో ఎలా మాట్లాడుతుందని ప్రశ్నించారు. ఇదే లఘు చర్చపై మంత్రి సమాధానానికి గత వారం అవకాశం ఇచ్చారని, 2014 నుంచి చర్చిద్దామని తాము అప్పుడే చెప్పామని అన్నారు. ప్రతిపక్షంపై బురద జల్లేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.పైగా విచారణ అని చెప్పి దాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరో 6 నుంచి 10 నెలల్లో విచారణ నివేదికలు తీసుకొచ్చి సభలో చర్చించాలని చెప్పారు. 2014–19 మధ్య జరిగిన కుంభకోణాల మీద కేసుల దర్యాప్తు పూర్తయిందని, నివేదికలూ వచ్చాయని, వాటి మీదా చర్చ జరగాలని స్పష్టంచేశారు. అయినప్పటికీ మంత్రి సమాధానం ఇవ్వాలనుకొంటే.. ఇలాంటి ఏకపక్ష చర్చలో మేము పాల్గొనలేమని స్పష్టం చేశారు. సభ నుంచి వెళ్లిపోతున్నాం అంటూ వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పాలనలో పలు కుంభకోణాలు జరిగాయని, వాటిపై కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు కూడా పూర్తయిందని తెలిపారు. వాటిపై మాత్రం చర్చకు ప్రభుత్వం అంగీకరించడం లేదని బొత్స మీడియా పాయింట్ వద్ద విమర్శించారు. ఇది కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాదా అని నిలదీశారు. చీఫ్ విప్‌పై చైర్మన్ ఆగ్రహం ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న సమయంలో చీఫ్ విప్ అనురాధ సమాధానం చెబుతానంటూ లేచి నిల్చోగా చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి ఉండగా మీరు క్లారిఫికేషన్ ఎలా ఇస్తారని, మీకు సంబంధం లేదు కూర్చోవాలని చెప్పారు. ఇలాంటి సంప్రదాయాలు తీసుకొచ్చి మంత్రులు సభను తప్పుదోవ పట్టించొద్దని హితవుపలికారు. మార్షల్స్‌తో సభ్యులను సభలోకి తీసుకురండి! ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోవడంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో కుంభకోణాలపై చర్చకు బీఏసీలో ప్రతిపక్షం ఆమోదించిందని, కానీ సభలో 2014–19 ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేసి వాకౌట్ చేసిందని అన్నారు. చర్చకు సిద్ధంగా ఉంటే రమ్మనండని అన్నారు. గతంలో మార్షల్స్‌ను పెట్టుకుని సభను అవమానించారని, ఇప్పుడు మార్షల్స్‌కు చెప్పి బయట ఉన్న సభ్యులను లోపలికి తీసుకురావాలని అన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. లఘు చర్చపై ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ.. సుమారు 1.70లక్షల ఎకరాల్లో భూములు అన్యాక్రాంతం అయినట్టు గుర్తించామన్నారు. వీటిపై సీఐడీ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై మండలిలో నిలదీత
సాక్షి, అమరావతి: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం శాసనమండలి సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైఎస్సార్ïÜపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్న చర్చకు రాగా.. పెద్దఎత్తున ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.ప్రభుత్వ వైఖరి కారణంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్సులు పూర్తయినప్పటికీ ఫీజులు చెల్లించలేదనే కారణంతో ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులకు సర్టీఫికెట్లు కూడా ఇవ్వడం లేదని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని దునుమాడారు.వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి బదులిస్తూ.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.3,169 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టు వెల్లడించారు. బకాయిల చెల్లింపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఆ హామీ అమలు చేయడం లేదు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. యూజీ కోర్సుల్లో ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4,200 కోట్ల చొప్పున ప్రభుత్వం ఫీజులు బకాయి పడిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. యూజీ, పీజీ కోర్సులకు 2018–19లో చంద్రబాబు ప్రభుత్వం రూ.1,880 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టిందన్నారు.ఈ మొత్తాన్ని 2020లో ఒకేసారి వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. మరో ఎమ్మెల్సీ టి.కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ రాక 13 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 2014–19 మాదిరిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సీలింగ్ పెడుతుందా, వంద శాతం రీయింబర్స్మెంట్ చేస్తుందా అని వివరణ కోరారు.పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.3,196 కోట్లు బకాయిలు పెట్టడంతో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్లేస్‌మెంట్స్ వచ్చినా కొన్ని కళాశాలల యాజమాన్యాలు సర్టీఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. జీవో 77 ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలని కోరారు. మంత్రి డోలా మాట్లాడుతూ.. ప్రైవేట్ కళాశాలల్లో పీజీ చదివే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించిన జీవో 77 రద్దుపై సమాధానం దాటవేశారు. ఒకే చట్ట పరిధిలోకి విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఒకే చట్టం పరిధిలోకి తీసుకుని వస్తామని మానవ వనరులు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. అమరావతిలో డీప్‌టెక్ వర్సిటీ, విశాఖలో ఐఎస్బీ ఏఐ వర్సిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. -
వలంటీర్లు అప్పుడెలా గుర్తొచ్చారు?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థే లేదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అదే వాస్తవమైతే విజయవాడ వరద బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు వలంటీర్లు కావాలని అధికారిక ఉత్తర్వులిచ్చి.. వలంటీర్ల సేవలు ఏవిధంగా వినియోగించుకున్నారు’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వేతనాలు రూ.10 వేలకు పెంచుతామని నమ్మించి, 2.56 లక్షల మందిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు.వలంటీర్లకు గౌరవ వేతనాల పెంపు అంశంపై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్న సోమవారం మండలిలో చర్చకు వచ్చింది. సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లు ఎవరూ లేరని, ఈ నేపథ్యంలో వేతనాల పెంపు అంశమే ఉత్పన్నం కాదన్నారు. మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరదల్లో వారిని ఎలా వినియోగించుకున్నారు?వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వలంటీర్లే లేకపోతే విజయవాడ వరదల్లో వారి సేవలను ప్రభుత్వం ఎందుకు వినియోగించుకుందని నిలదీశారు. వరదల సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్, తేదీలతో సహా సభలో చదివి వినిపించారు. వరద సహాయ చర్యల్లో పాల్గొనకపోతే వలంటీర్లపై మీద చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించిందని గుర్తు చేశారు. వలంటీర్లతో అవసరం తీరాక ఆ వ్యవస్థే లేదని చెప్పడం సమంజసం కాదన్నారు.‘గత ప్రభుత్వంలో వలంటీర్లకు ఇచ్చిన రూ.5 వేలు సరిపోదు.. మేం వస్తే రూ.10 వేలు చెల్లిస్తాం’ అని టీడీపీ నాయకులు ప్రచారం చేశారన్నారు. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వీరికి నెలకు రూ.10 వేలకు వేతనం పెంచుతామని ప్రస్తుత సీఎం, మంత్రులు హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సేవాభావంతో ముందుకు వచ్చి ప్రజల మన్ననలు పొందిన వలంటీర్లను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం తలచుకుంటే వలంటీర్లను రెన్యూవల్ చేయడం పెద్ద సమస్య కాదన్నారు. వలంటీర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి డోలా మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థ మనుగడలో ఉందనే భ్రమలో తాము విజయవాడ వరదల్లో వారి సేవలు వినియోగించుకోవడానికి ఉత్తర్వులు ఇచ్చామన్నారు. మనుగడలో లేని వారిని ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు. నిమ్మల ముసిముసి నవ్వులు‘మా ప్రభుత్వం వస్తేనే వలంటీర్ల వేతనాలు రూ.10 వేలకు పెంచుతాం. వేతనం పెరిగిన వెంటనే నాకు పూతరేకులు, స్వీట్ బాక్స్, జున్ను ఇవ్వాలి’ అని వలంటీర్లకు చెబుతూ ఎన్నికల ముందు ప్రస్తుత మంత్రి ఒకరు ప్రచారం చేశారని రమేశ్‌యాదవ్ గుర్తు చేశారు. వేతనాలు పెంచితే మంత్రికి పూతరేకులు, జున్ను ఇద్దామని వలంటీర్లు అందరూ రెడీగా ఉన్నారన్నారు. దీంతో వెంటనే సభలోని వారంతా మంత్రి నిమ్మల రామానాయుడు వైపు చూశారు. ఈ క్రమంలో ఆయన పేపర్లో ఏదో చదువుతున్నట్టు తల దించుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. -
రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు సమాధి
నెల్లూరు(బారకాసు): రాయలసీమ లిఫ్ట్‌కు సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే, చంద్రబాబు సమాధి కడుతున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమ రైతుల కన్నీటి కష్టాలకు బాబు స్వార్థ రాజకీయాలే కారణమని.. నీటి పంపకాలలో అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశి్నంచలేని అసమర్థుడు అని ధ్వజమెత్తారు. తానూ రాయలసీమకు చెందినవాడినేనని, 15 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకోవడమే తప్ప, రైతాంగానికి చంద్రబాబు ఒక్క మేలు కూడా తలపెట్టలేదన్నారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాల్వలోకి ఎత్తిపోసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిందని.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికి రూ.3,825 కోట్లతో 2020 మే 5న రాయలసీమ లిఫ్ట్ నిరి్మంచేందుకు ఆమోదం తెలిపిందన్నారు. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీరివ్వాలనేది లక్ష్యంగా చెప్పారు.సీమ లిఫ్ట్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడ్డారని, ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో పిటిషన్ వేయించారని తెలిపారు. హక్కుగా కేటాయించిన 44 వేల క్యూసెక్కులను వాడుకుంటున్నామని ఈఏసీ ఎదుట సమర్థంగా వాదించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని కాకాణి మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 798 అడుగుల్లోనే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి పేరుతో నీటిని తోడేస్తోందని.. 800 అడుగులకు చేరగానే సాగుకు విడుదల చేసుకుంటున్నారని, అయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్‌కు పేరొస్తుందనే.. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే వైఎస్ జగన్‌కు పేరొస్తుందనే కుట్రతో, రైతుల జీవితాలను చంద్రబాబు పణంగా పెట్టారని కాకాణి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ పనులను కొనసాగించినా బాబు కిమ్మనలేదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రాజెక్టులను తాకట్టు పెడుతున్న చంద్రబాబు.. రైతుల దృష్టి మళ్లించేందుకు బనకచర్ల పేరతో కొత్త డ్రామాకు తెరతీశారని కాకాణి పేర్కొన్నారు.ఓవైపు పోలవరం నీటిని బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి వృథాగా పోయే బదులు సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణకు సూచిస్తున్నారని తెలిపారు. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారని, అంతే తప్ప.. ప్రాజెక్ట్‌ల విషయంలో ఆయనకు మొదటి నుంచి చిత్తశుద్ధి లేదని కాకాణి ధ్వజమెత్తారు. -
‘తప్పుమీది కాదు.. తప్పు ఈవీఎంలదే’
నగిరి: ఏపీలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ నేత , మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ‘కూటమి’ పాలనలో ఒక్కొక్క దానికి చరమగీతం పాడేస్తున్నారంటూ మండిపడ్డారు. మెడికల్ కాలేజీలకు మంగళం పాడేసిన కూటమి ప్రభుత్వం, భరోసా కేంద్రాలకు కూడా ఎత్తేస్తుందని, ఇప్పుడు ఇక బడుల వంతు అంటూ రోజా విమర్శించారు.‘మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు.. ఇప్పుడు బడుల వంతు. అయినా..... ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాదు’ అని ముందే మీరు చెప్పారు లెండి... తప్పు మీది కాదు.. తప్పంతా #EVM లదే !, ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..?, గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా... ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండవచ్చా...?, బాగుందాయ్యా ... బాగుంది !అని... ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది!!’ అని రోజా ఎద్దేవా చేశారు.మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు.. ఇప్పుడు బడుల వంతు !అయినా..... "విద్య ప్రభుత్వ బాధ్యత కాదు" అని ముందే మీరు చెప్పారు లెండి... తప్పు మీది కాదు.. తప్పంతా #EVM లదే !ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..?గ్రామంలో ఎన్ని…— Roja Selvamani (@RojaSelvamaniRK) March 17, 2025 నగిరిలో పరామర్శ కార్యక్రమాల్లో మాజీ మంత్రి రోజాఆర్కే రోజా నగిరి పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీబాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈరోజు(సోమవారం) విజయపురం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీబాధిత కుటుంబాలను రోజా పరామర్శించారు. ఆయా గ్రామాల్లో అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న నాయకులకు రోజా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయా బాధిత కుటుంబాలను రోజా పరామర్శించారు. -
ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఆగ్రహం
సాక్షి,విజయవాడ : ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు చూపించడంలో చంద్రబాబు దిట్ట అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల్ని పక్కన పెట్టి స్కాముల పేరుతో కాలయపన చేస్తోంది. ఉద్యోగుల అంశాలపై చర్చ పక్కన పెట్టి ..మొన్న జరిగిన 2019- 2024 స్కామ్స్ మీద చర్చ పెట్టారు. 2019 నుండి 2024 కాదు.. 2014 నుండి 2024 వరకు చర్చకి సిద్ధం అని చెప్పాం. 2019 నుండి 2024 అంటూ మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చి 9నెలల కాలంలో కొన్ని ఆరోపణలు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ జరగకుండానే ఆరోపణలు చేస్తున్నారు. .. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు చేయాలనే ప్రయత్నం చేస్తోంది. ఫలితంగా కోర్టులో ఉన్న కేసులు కూడా విత్‌డ్రా చేసుకుంటున్నారు’అని అన్నారు. -
శాసనమండలి.. ఫీజు రియింబర్స్‌మెంట్, వలంటీర్లపై వైఎస్సార్సీపీ ప్రశ్నలు
ఏపీ శాసన మండలి సమావేశాలు.. అప్డేట్స్.. శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలు..వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చవలంటీర్లు ఎవ్వరూ లేరు, రెన్యూవల్ చెయ్యలేదని చెప్పిన మంత్రి బాల వీరంజనేయ స్వామివాలంటీర్ల తొలగింపుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహంఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..వాలంటీర్ల వేతనాన్ని 10వేలకి పెంచుతామని హామీ ఇచ్చారుఈ ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్లను తొలగించిందివలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు2024 సెప్టెంబర్‌లో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారునవంబర్ 2024 వరకు వాళ్లకి ఐడీలు ఎలా కొనసాగించారువాలంటీర్లకు 10 వేలు చేస్తామని మోసం చేశారు.ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్2023 ఆగస్టు నుండి వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారువ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారు?.2024 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారుజీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు2,60,000 వేల మందిని తొలగించడం అన్యాయంవాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారుఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..వలంటీర్లు లేకపోతే ఎందుకు విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చిందిలేని వారిని ఎలా వరదల్లో వినియోగించారు?.ఫీజు రియింబర్స్‌మెంట్‌పై వైఎస్సార్సీపీ సభ్యుల నిలదీత..రూ.3,169 కోట్లు ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నట్టు వెల్లడించిన మంత్రి బాల వీరంజనేయ స్వామిఫీజు ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహంఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నలు.4200 కోట్ల బకాయిలు ఉన్నాయి.2000 కోట్ల వసతి దీవెన బకాయిలు ఉన్నాయి.పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తామన్నారుఇప్పటి వరకూ ఇవ్వలేదు.వసతి దీవెన మొదలు పెట్టిందే వైఎస్ జగన్.ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..వైఎస్ జగన్ గతంలో తల్లుల ఖాతాల్లో ఫీజులు వేశారుకాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు కల్పించారుగతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన 1778 కోట్ల బకాయిలను వైఎస్ జగన్ చెల్లించారుఇప్పుడు ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడం అన్యాయంవిద్యార్థుల భవిష్యత్ కోసం మానవతా దృక్పథంతో ప్రభుత్వం చెల్లించాలిమొత్తం ఫీజు రియింబర్స్‌మెంట్ చేస్తారా?హాజరు సీలింగ్ ఏమైనా పెడతారా?.ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్..వైఎస్సార్ పేద పిల్లల కోసం ఫీజు రియింబర్స్‌మెంట్ తెచ్చారుఉన్నత చదువులు పేద పిల్లలకు అందించారుఇప్పుడు ఫీజులు బకాయిలు పెట్టేసారువిద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి -
పవన్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి: నారాయణ
బి.కొత్తకోట: రోజుకో మాట మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో సీపీఐ శత వార్షికోత్సవ సభ ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ ఒకసారి చేగువేరా, మరొకసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారని అన్నారు. ‘సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితి మంటల్లో ఆహుతి అవుతుంది. ఇలాంటి ధర్మాన్ని ఒప్పుకుంటారా.. మూడు పెళ్లిళ్ల పవన్ కళ్యాణ్’ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న చంద్రబాబు, పవన్ ఆయన మాటలకు తలూపుతున్నారని అన్నారు. -
పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి: సజ్జల
తాడేపల్లి: ప్రతీ నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ఇతర ముఖ్యనేతలు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కమిటీల విషయంలో ఎటువంటి జాప్యం జరగకూడదని సజ్జల ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం జనరల్ సెక్రటరీలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, కేంద్ర కార్యాలయం నుంచి ఇంచార్జులు అందరూ అందుబాటులో ఉంటారన్నారు. కమిటీల విషయంలో జాప్యం జరగడానికి వీల్లేదని ఇప్పటికీ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేసిన సంగతిని సజ్జల ఈ సందర్భంగా గుర్తు చేశారు. కమిటీల ఏర్పాటుపై సీరియస్ గా దృష్టిపెట్టాలని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని సజ్జల సూచించారు.ప్రజా పాలనను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం సమిష్టిగా పనిచేసి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారని సజ్జల అభినందించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారన్నారు. -
‘ప్రతిసారి అలగడం, ఏడవడమే బాలినేని చరిత్ర’
సాక్షి, ప్రకాశం జిల్లా: వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి బాలినేనికి మాట్లాడే అర్హత లేదంటూ జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ, వైస్సార్ కుటుంబం లేకపోతే నువ్వెవరవి అంటూ బాలినేనిని ప్రశ్నించారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిసారి ఏదో ఒక సాకుపెట్టు కొని మా మీద ఏడుస్తావు. గతంలో కూడా మా కుటుంబం మీద కుట్రలు చేశావ్. ఇప్పటికీ నీ బుద్ధిమారలేదు’’ అంటూ వెంకాయమ్మ మండిపడ్డారు.‘‘బూచేపల్లి కుటుంబంపై కుట్రలు చేసి.. ఇవాళ నువ్వే రోడ్డున పడ్డావు. వైఎస్ జగన్‌ను ఓడిస్తావా..? నీ తరం కాదు. 2024 ఎన్నికలో నా కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి గెలవకూడదని కుట్ర పన్నావ్...? నువ్వే ఓడిపోయావు. నన్ను చైర్ పర్సన్ పదవి నుంచి దించుతావా..? నా కుర్చి టచ్ చేసి చూడు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనే సీఎం.. ఎవరూ అడ్డుకోలేరు.?...2004 నుంచి రాజకీయాల్లో ఉండి.. నీతిగా రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రాణాలు పోయే వరకు వైఎస్ జగన్‌తోనే ప్రయాణం. మా కుటుంబం మీద అభిమానంతో వైఎస్ జగన్ నన్ను జడ్పి చైర్ పర్సన్‌ని చేశాడు. నీకు దమ్ముంటే... నా కుర్చీ జోలికిరా..? చూస్తా.. ప్రతీ సారి వైఎస్ జగన్ మీద అలగడం.. ఎడవడమే.. బాలినేని చరిత్ర?. జిల్లాలో పార్టీ నేతల దగ్గర డబ్బు దోచుకున్న అవినీతి పరుడు బాలినేని’’ అంట వెంకాయమ్మ ధ్వజమెత్తారు. -
పవన్ కల్యాణ్‌పై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. అమలు చేయమంటే నిధులు లేవంటూ చెబుతున్నారంటూ సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో సమయంలో చెప్పినట్లు గ్రామంలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాల్సిందేనని నిలదీశారు.‘‘గత ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. దళితులు, గిరిజనుల భూములను పెద్దలు కొట్టేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పరిపాలన గాలికి వదిలేశాడు. సనాతన ధర్మం అంటూ కాషాయ బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు. ఇలా తిరగడానికి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు?. పవన్ కల్యాణ్‌కి దేవాదాయ శాఖ కేటాయిస్తే బాగుంటుంది. చంద్రబాబు ఆలోచించాలి’’ అంటూ రామకృష్ణ చురకలు అంటించారు.చంద్రబాబుపై సీపీఎం ఫైర్నెల్లూరు: సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛ ఆంధ్రపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. స్వచ్ఛ ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల మాత్రం మురికి కుపాలలో దోమలతో జీవనం సాగిస్తున్నారన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పన్ను, నీటి పన్నులను బలవంతంగా వసూలు చేస్తున్నారు’’ అని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. -
‘దాచుకో.. దోచుకో.. పంచుకో.. చంద్రబాబు పాలన ఇదే’
సాక్షి, ఏలూరు జిల్లా: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన ఏలూరులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్వచ్ఛతలో రాష్ట్రంలో కింద నుంచి మూడో స్థానంలో ఉందన్నారు.వైఎస్ జగన్ హయాంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధంగా క్లాప్ వెహికల్స్ పెట్టారని. నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్వచ్ఛభారత్‌ను వైఎస్ జగన్ సమర్థవంతంగా అమలు చేశారన్నారు. స్వచ్ఛ భారత్ క్లాప్ వ్యాన్లను చంద్రబాబు ప్రభుత్వం మూలన పడేసిందని.. వాటిని తొలగించడంతో ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.‘‘చంద్రబాబు పర్యటనలో తణుకును దిగ్బంధం చేశారు. తేతలిలో పశువధ కర్మాగారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. పశువుల కర్మాగారం పక్కనున్న ఎఫ్‌సీఐ గోడౌన్లు సైతం ఖాళీ చేస్తున్నారు. కోర్టు స్టే ఇచ్చినా కానీ.. పశువధ కర్మాగారం వారికి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. పశువధ కర్మాగారం ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యాలయాల చుట్టూ పశువధ కర్మాగారం బాధితులు తిరిగిన వారికి న్యాయం జరగలేదు. పశువధ దుర్గంధంతో తణుకు ప్రజలు అల్లాడిపోతున్నారు’’ అని కారుమూరి పేర్కొన్నారు.‘‘ఆరుమిల్లి రాధాకృష్ణకు పావలా ఎమ్మెల్యే అని పేరు వచ్చింది. లిక్కర్, గంజాయిలో దాచుకో.. దోచుకో.. పంచుకో అన్న రీతిలో పాలన సాగుతుంది. వైఎస్ జగన్ బస్సులో వెళ్లేటప్పుడు ఎవరైనా వినతిపత్రం చూపిస్తే వెంటనే స్పందించేవారు. నిన్న స్వచ్ఛ ఆంధ్ర సభలో చంద్రబాబు భజనే సరిపోయింది. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు అందులో ఐదు పూర్తయ్యాయి. 750 మెడికల్ సీట్లు మాకు వద్దు అని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు. ప్రతి గ్రామంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయాలు రైతుభరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు దర్శనమిస్తాయి. 9 నెలలోనే చంద్రబాబు 1,50,000 కోట్లు అప్పు చేశాడు. వైఎస్ జగన్ పథకాలు కొనసాగించక పోగా మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ ఇవ్వలేదు.17 లక్షల రైతులు వద్ద రెండు కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం మీరు గతంలో కొంటే వైఎస్ జగన్ హయాంలో 37 లక్షల మంది రైతుల వద్ద మూడు కోట్ల 40 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొన్నాము. ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ విధానాలు ఎత్తేశారు. చంద్రబాబు రైతుల నడ్డి విరిచేశారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు ఒక్క హామీ నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రజలు బాధలతో అల్లాడిపోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం ఊసే లేదు.. నీకు 15000 నీకు 18000 అన్నారు వాటి ఇప్పుడు ఆ 15 లేదు 18 లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో మీ హయాంలోనే వచ్చింది. పయ్యావుల కేశవ్ గతంలో ఇది చాలా మంచిదని అనలేదా..?. మేము దాన్ని అమలు చేస్తే బురదజల్లారురూ.75,000 ఉండే మెడికల్ కాలేజీ ఫీజు లక్ష ఇరవై వేలకు పెంచేశారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు పొలం బాట పడుతున్నారు. వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తే ఆ పథకాలన్నీ నిలిపివేశారు. పేద ప్రజలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా?. సూపర్ సిక్స్ అని ఊదరకొట్టారు. గతంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు. ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయలేకపోతున్నారు’’ అని కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. -
‘కాశీనాయన’ కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరు?: భూమన
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...సనాతనధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్?సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయింది. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు.ఈ రోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా?సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. రెడ్‌బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు? మీకు తెలియకుండానే ఆలయాలు నేలమట్టం అవుతాయా? ఆశ్రమాలు కూలతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం కింద విషం చిమ్ముతున్నది మీది కాదా? పార్టీ మీటింగ్‌లకు ప్రభుత్వ సొమ్ముతో గాలిలో ఎగిరి ప్రయాణాలు చేసే పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్‌కు కాశీనాయన క్షేత్రంకు దారి కనిపించడం లేదా?మా ఇంట్లోనే సనాతన ధర్మం పుట్టింది అంటూ గతంలో పవన్ చెప్పారు. ఆయనే మా తండ్రి పూజ గదిలో వెలిగే దీపారాదనతో సిగరెట్ వెలిగించుకునేవారు అని కూడా అన్నారు. ఇవ్వన్నీ కూడా సనాతన ధర్మం కిందకు వస్తాయా అని కూడా పవనానంద స్వామీ చెప్పాలి. శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా?కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై దేవాదాయశాఖ మంత్రి స్పందిస్తూ ఈ క్షేత్రం టైగర్‌జోన్ పరిధిలో ఉన్నందునే కూల్చివేశారు అంటూ ప్రకటన చేశారు. టైగర్‌జోన్ పరిధిలోనే ఉన్న శ్రీశైలంను కూడా కూల్చివేస్తామనే ఉద్దేశం ఆ శాఖ మంత్రి మాటల్లో అర్థమవుతోంది. టైగర్‌జోన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేయాలన్నదే ఈ కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు దిక్కులేకుండా పోయింది.ఆలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న కాశీనాయన క్షేత్రంకు ఉన్న ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా దీనిని అటవీ చట్టాల పరిధి నుంచి మినహాయించాలని ఆనాడే సీఎం హోదాలో వైఎస్ జగన్ కేంద్ర అటవీశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు సనాతన సారధి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు కేంద్ర అటవీశాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండానే ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేశారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? వీటిని కూల్చివేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు పవన్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయడం, మోయడంలో తనమునకలు అయ్యి ఉండటం వల్లే ఇటువంటి ఘోరమైన సంఘటనను పట్టించుకోలేదా? బొట్లు పెట్టడం, మెట్లు కడగడం మినహా ఆలయాలను పరిరక్షించాలనే విషయాన్ని విస్మరించారు. బీజేపీ కూడా ఎందుకు స్పందించడం లేదు. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనుమానం భక్తుల్లో కలుగుతోంది.కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలంకూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వానికి వైయస్ఆర్సీపీపై అభాండాలు మోపి పబ్బం గడుపుకోవడమే తెలుసు. తిరుయల లడ్డూలో కల్తీనెయ్యి అంటూ ఒక పచ్చి అబద్దాన్ని తెరమీదికి తీసుకువచ్చి ఆనాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుర్మార్గమైన నిందలు మోపారు. ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారంటే సాక్షాత్తూ సీఎం ఒక ప్రకటన చేయడం, వారి రాజకీయం కోసం ఎంత దూరమైన సరే దిగజారిపోతారనడానికి నిదర్శనం.జనం దీనిని నిజమని నమ్మేలా శతవిధాల ప్రయత్నించారు. దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్నవారు బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇదంతా ఒక కుట్ర అంటూ వైఎస్సార్సీపీ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో వెనక్కి తగ్గింది.అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసాలకు గురై ఆరుగురు మృతి చెందడం, 45 మందికి పైగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో చిన్నచిన్న పొరపాట్లను కూడా అత్యంత దారుణంగా చిత్రీకరించారు. అదే కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఏదో పొరపాటున జరిగిన చిన్న అంశంగా సమర్థించుకుంటున్నారు. తాజాగా ఒక తాగుబోతు నేరుగా శ్రీవారి ఆలయ ప్రాంగణం బయట మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. శ్రీవారి కొండపై మద్యం ఎంతైనా దొరుకుతుందంటూ వీరంగం సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎర్రచందనం కొండపై పట్టుబడింది. దానిపై ఎటువంటి చర్యలు లేవు. ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి పుట్టిన పార్టీ టీడీపీమంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలపైన పుట్టిన పార్టీ అంటూ మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని లాక్కుని అనే విషయం లోకేష్ గుర్తించాలి. తెలుగుదేశం అధికారపీఠం కింద విగతజీవులైన పింగళి దశరథ్‌రామ్, వంగవీటి మోహనరంగా వంటి వారు ఉన్నారని లోకేష్ తెలుసుకోవాలి.గిల్లి జోల పాడటం, చంపి మాలవేయడం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కడం టీడీపీ లక్షణం. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకే కాషాయదళం నోరువిప్పడం మానేసింది. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిపామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారి కళ్యాణాలను గ్రామాల్లోకి తీసుకువచ్చాం. 2004 డిసెంబర్ నుంచే నేను టీటీడీ బోర్డ్ సభ్యుడగా ఉన్నప్పుడే మొట్టమొదటి సూళ్ళూరిపేట దళితవాడలో స్వామివారి కళ్యాణంను అద్భుతంగా నిర్వహించాం. తరువాత కొన్ని పదుల సంఖ్యలో శ్రీవారి కళ్యాణాలు చేయించాం’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
బాలినేని బ్రతుకు ప్రకాశం ప్రజలకు బాగా తెలుసు: బూచేపల్లి
సాక్షి, ప్రకాశం: బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద కమల్‌హాసన్.. ఆయనతో సినిమా తీయొచ్చు అంటూ దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం జనసేనలో చేరి ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హెచ్చరించారు. బాలినేని బ్రతుకు ప్రకాశం జిల్లా ప్రజలకు బాగా తెలుసు అని వ్యాఖ్యలు చేశారు.దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బాలినేని.. నీ గురించి అందరకీ తెలుసు. జిల్లాలో ప్రతీ ఒక్కరినీ వేధించి వారి వద్ద దోచుకున్నావ్. నీ బాధితుడు కానీ వాడు ప్రకాశం జిల్లాలో ఒక్కడు కూడా లేడు. బాలినేని పార్టీ మారిన తర్వాత జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు సంతోషించారు. నటనలో బాలినేని.. కమల్‌హాసన్‌ను మించిపోయారు. ఆయనతో ఒక సినిమా తీయవచ్చు. టీడీపీలో చేరేందుకు నువ్వు ప్రయత్నిస్తే.. రిజక్ట్ చేస్తే.. ఆస్తుల కోసం జనసేనలో చేరావు. జడ్పీ చైర్‌పర్సన్‌ని మార్చేస్తానని చాలెంజ్ చేస్తున్నావు. నీలాగా అమ్ముడుపోయే జడ్పీటీసీలు జిల్లాలో లేరు. నీలాగా వెన్నుపోటు పొడిచే వారు పార్టీకి అవసరం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.