breaking news
-
ప్రియుడి మోజులో భర్తను దారుణంగా చంపిన భార్య
గిద్దలూరు రూరల్: ఓ మహిళ కట్టుకున్న భర్తను పథకం ప్రకారం హత్య చేసి, ఆపై ఆ ప్రియుడి చేతిలోనే హతమైందని మార్కాపురం డీఎస్పీ యు.నాగారాజు పేర్కొన్నారు. అక్రమ సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా మరొకరి జీవితం జైలు పాలయ్యేలా చేసిందని చెప్పారు. ఈ నెల 6వ తేదీన గిద్దలూరులోని చాకలివీధిలో పాకి సుభాషిణి అనే మహిళ ఆమె ప్రియుడు అంబడిదాసు శ్రీకర్ అలియాస్ నాని చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితుడు శ్రీకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మరుగునపడిన మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.కంభం మండలం నర్సిరెడ్డిపల్లెకు చెందిన పాకి బాలక్రిష్ణ(31)కు రాచర్లకు చెందిన సుభాషిణిని ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. వీరికి లోకిత, రోహిత్ అనే ఇద్దరు చిన్నపిల్లలున్నారు. బాలకృష్ణ కుటుంబంతో సహా గిద్దలూరులోని రాచర్ల రోడ్డులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో సుభాషిణికి తనతో కలిసి పదో తరగతి వరకు చదువుకున్న రాచర్లకు చెందిన నాని తారసపడ్డాడు. గిద్దలూరులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నాని.. సుభాషిణి ఫోన్ నంబర్ తీసుకుని తరుచూ మాట్లాడేవాడు. ఈ క్రమంలో పాత పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మార్చుకున్నారు. ఈ వ్యవహారం బాలకృష్ణకు తెలియడంతో సుభాషిణిని మందలించాడు. భార్య చేస్తున్న మోసాన్ని జీర్ణించుకోలేక మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు. దీంతో భర్తను అడ్డుతొలగించాలని భావించిన సుభాషిణి తన స్నేహితుడు నానితో కలిసి పథకం రచించింది. 2023 ఏప్రిల్ 4వ తేదీన మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి భర్తతో తాగించింది. మత్తులోకి జారుకున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత నానితో కలిసి బాలకృష్ణ ముఖానికి గుడ్డకట్టి, గొంతుకు తాడు బిగించి చంపారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన సుభాషిణి బంధువులను నమ్మించి దహన సంస్కారాలు పూర్తి చేసింది. బాలకృష్ణ మద్యానికి బానిసై ఉరివేసుకుని చనిపోయి ఉంటాడని అంతా భావించారు. బాలకృష్ణ పెద్ద కర్మ అయిన వెంటనే సుభాషిణి తన ప్రియుడు నానితో కలిసి హైదరబాద్‌కు మకాం మార్చింది. అక్కడ సహజీవనం సాగిస్తున్న క్రమంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సుభాషిణి తిరిగి గిద్దలూరు చేరుకుని ఓ రెడీమెడ్ షాపులో పనిచేసుకుంటూ జీవిస్తోంది. అయితే నాని తనతో మళ్లీ మాట్లాడాలంటూ తరుచూ సుభాషిణిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో నానిని మందలించారు. ప్రియురాలు దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన నాని ఆమైపె కక్ష పెంచుకుని కత్తితో గాయపరచగా ఆమె మార్కాపురం వైద్యశాలలో మృతి చెందిందని డీఎస్పీ వివరించారు. కేసును చేధించిన సీఐలు కె.సురేష్, రామకోటయ్య, ఎస్సై ఇమ్మానియేల్‌ను ప్రత్యేకంగా ఆభినందించారు. -
AP: పోలీసులు బకరా.. సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా డాన్ పరారీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ముఠా సభ్యులు పోలీసుల అదుపులోకి ఉన్న నిందితుడి తప్పించారు. దీంతో, నడిరోడ్డుపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..దొంగ నోట్ల కేసులో భీమవరంలో ఉన్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు శుక్రవారం రాత్రి శ్రీకాకుళం బయలుదేరారు. అదే సమయంలో పోలీసు వాహనాన్ని రెండు కార్లు, నాలుగు బైకులు వెంబడించాయి. కొంత దూరం వరకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో రాజమండ్రిలోని వీఎల్‌పురం వద్ద నిందితుడిని తీసుకెళ్తున్న శ్రీకాకుళం పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. సినిమా ఫక్కీలో ఈకేసులో ఉన్న నిందితుడిని వారు తప్పించి.. తమ కారులో తీసుకెళ్లారు.అనంతరం, సదరు పోలీసులు.. 100కు కాల్ చేసి ఈ విషయాన్ని రాజమండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో, కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను వెంబండించిన కార్ల నెంబర్లను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దొంగ నోట్ల ముఠా డాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఏం కష్టం వచ్చింది ‘తల్లీ’..
నాలుగు పదుల జీవితం..రెండు దశాబ్దాల దాంపత్యం. ముత్యాల్లాంటి పిల్లలు. కానీ ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలీదు గానీ పాలబువ్వ పెట్టిన చేతులతోనే ఇద్దరు బిడ్డలకు విషం పెట్టింది. వద్దు.. వద్దంటున్నా విషపుగుళికల నీరు తాగించింది. ఆపై తానూ తాగింది. ఘటనలో తల్లీకుమారుడు మృతి చెందగా..కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.గార్లదిన్నె: కుటుంబ కలహాలతో ఓ మహిళ తనువు చాలించాలనుకుంది. తను వెళ్లిపోతే బిడ్డల పరిస్థితి ఏమిటని తీవ్రంగా ఆలోచించింది. చివరకు కుమార్తె, కుమారుడినీ తనవెంటే తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. పిల్లలకు బలవంతంగా విషపు గుళికల నీరు తాగించి, తనూ తాగింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందగా.. కుమార్తె ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు తోంది. ఈ ఘటన గురువారం గార్లదిన్నెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలంలోని యర్రగుంట్లకు చెందిన సురేష్‌కు శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలానికి చెందిన లక్ష్మీదేవి, వెంకటయ్య దంపతుల కుమార్తె సుజాత (38)కు 20 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి కుమార్తె రాహిత్య, కుమారుడు నాగ చైతన్య (11)సంతానం. రాహిత్య ప్రస్తుతం చైన్నె సత్యభామ కాలేజీలో బీటెక్ ప్రథమ సంవత్సరం, నాగ చైతన్య గార్లదిన్నెలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. సురేష్, సుజాత దంపతులు మూడేళ్ల నుంచి గార్లదిన్నెలో అద్దె భవనంలో నివాసం ఉంటూ కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కుటుంబ కలహాలు తలెత్తగా సుజాత జీవితంపై విరక్తి చెందింది.తనతో పాటు పిల్లలనూ తీసుకువెళ్లాలని..గురువారం ఉదయం భర్త సురేష్ గార్లదిన్నె నుంచి యర్రగుంట్లలోని వ్యవసాయ తోట వద్దకు వెళ్లగా... సుజాత గార్లదిన్నెలోని ఓ ఫర్టిలైజర్ షాపులో విషపుగుళికలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లింది. అనంతరం తలుపులు వేసుకొని మొదట కుమార్తె రాహిత్య, కుమారుడు నాగ చైతన్యకు విషపు గుళికలు నీళ్లలో కలిపి తాపించే ప్రయత్నం చేసింది. పిల్లలు వద్దన్నా వినకుండా బలవంతంగా విషపుగుళికలు కలిపిన నీళ్లు తాగించింది. అనంతరం ఆమెకూడా తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. దీంతో కుమార్తె రాహిత్య బయటకు వచ్చి జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగుకు తెలిపింది. వెంటనే వారు సుజాత, రాహిత్య, చైతన్యలను కారులో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుజాత మృతి చెందింది. కుమారుడు చైతన్య, కుమార్తె రాహిత్యకు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరుకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే సుజాత కుమారుడు నాగ చైతన్య మృతి చెందాడు. ప్రస్తుతం రాహిత్య బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సుజాత, నాగచైతన్య మృతదేహాలను అనంతపురంలోని సర్వజనాస్పత్రి మార్చురీలో ఉంచారు.మిన్నంటిన రోదనలుసమాచారం తెలుసుకున్న సుజాత కుటుంబ సభ్యులు పెద్దసంఖ్యలో సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న సుజాత, చైతన్యలను చూసి బోరున విలపించారు. ఏ కష్టంవచ్చిందని ఇంతపని చేశావు తల్లీ అంటూ వారు రోదించిన తీరు చూసి అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు.భర్తపై కేసు నమోదుసుజాతను భర్త సురేష్ నిత్యం వేధిస్తుండేవాడని, చిన్న, చిన్న విషయాలకే ఘర్షణ పడి నెల రోజులైనా భార్యతో మాట్లాడేవాడు కాదని బంధువులు తెలిపారు. సురేష్ పెట్టిన మానసిక వేధింపులతోనే సుజాత పిల్లలతో కలిసి చనిపోవాలనుకుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుజాత, ఆమె కుమారుడు చైతన్య మృతికి భర్త సురేష్ కారణమని తెలిపారు. దీంతో సురేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. -
బాలికపై సామూహిక లైంగిక దాడి
కొల్లూరు: ఓ బాలికను మభ్యపెట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కొల్లూరులోని ఓ దుస్తుల దుకాణంలో పని చేస్తుంది. గత నెల 26న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన గ్రామానికి వెళ్లడానికి ఆటో కోసం వేచి ఉండగా, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకకు చెందిన యువకుడు విప్పర్ల ప్రేమ్‌కుమార్ తన ద్విచక్ర వాహనంపై ఇంటి వద్ద దింపుతానని నమ్మించి ఎక్కించుకున్నాడు.కొల్లూరు కరకట్ట నుంచి దారి మళ్లించి దిగువున ఉన్న ఇటుక బట్టీల్లోకి తీసుకెళ్లి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాక తన స్నేహితులకు ఫోన్ చేసి పిలవడంతో బెజ్జం శ్యామ్‌కుమార్‌తో పాటు మరో యువకుడు అక్కడకు వచ్చారు. శ్యామ్‌కుమార్ బాలికను తన ద్విచక్ర వాహనంపై దింపుతానని మభ్యపెట్టి వేరే ఇటుక బట్టీలోకి తీసుకువెళ్లి అతను కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువకుడు వెంటనే వెళ్లిపోయాడు.అనంతరం బాలికను ఇటుక బట్టీలలోనే వదిలి వెళ్లడంతో రాత్రి సమయంలో కాలినడకన ఇంటికి చేరుకుంది. తల్లి లేని ఆ బాలిక జరిగిన అఘాయిత్యాన్ని తండ్రికి చెప్పుకునేందుకు భయపడింది. కొద్ది రోజులుగా బాలిక అనారోగ్యంతో ఉండడాన్ని గమనించిన తండ్రి తమ బంధువులకు చెప్పడంతో విషయం బయటపడింది. అనంతరం తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. నిందితులు విప్పర్ల ప్రేమ్‌కుమార్, బెజ్జం శ్యామ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటన ప్రాంతాన్ని వేమూరు సీఐ రామాంజనేయులు, కొల్లూరు ఎస్ఐ జి. ఏడుకొండలు పరిశీలించారు. -
30మందిని కాపాడి ఆర్మీ జవాన్ వీరమరణం
కంభం/నార్పల: తోటి జవాన్లు 30 మందిని ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి కాపాడి.. తాను మాత్రం దాని బారిన బడి ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద సోమవారం విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ జవాన్ ల్యాండ్‌మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య(45) జమ్మూలోని పూంచ్ జిల్లాలో 30 మంది జవానులతో కలిసి సరిహద్దు వద్ద కాపలా కాస్తున్నాడు. అంతలో అక్కడ ల్యాండ్‌మైన్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే తోటి జవాన్లను దూరంగా పంపించేసి తాను పొరపాటున దాని ఉచ్చులో చిక్కుకున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. అధికార లాంఛనాలు ముగించుకుని మృతదేహాన్ని బెంగళూరు వరకు విమానంలో.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తరలించనున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి వెంకట సుబ్బయ్య కొన్నేళ్ల కిందట చనిపోగా, తల్లి గాలెమ్మ గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న ఆ తల్లి కుమారుడి ఫొటో పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తోంది. మృతుడి భార్య లీల స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం నార్పాల. ఇద్దరు పిల్లలతో ఆమె అక్కడే ఉంటోంది. మృతదేహాన్ని నార్పాల గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో బంధువులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జవాన్ భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. -
లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి
అల్లిపురం (విశాఖ): లోన్ యాప్ వేధింపులకు విశాఖ నగరంలో ఓ యువకుడు బలైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మహారాణిపేట సీఐ బి.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర తన భార్య అఖిలాదేవి, తల్లి, తండ్రితో కలసి జీవిస్తున్నాడు. ఇతనికి వివాహమై సుమారు 50 రోజులైంది. సముద్రంలో వేటకు వెళ్లి వస్తుంటాడు. భార్య అఖిల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఇంటి అవసరాల నిమిత్తం నరేంద్ర ఆన్లైన్ యాప్‌లో రూ.2 వేలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించేశాడు. కానీ.. రుణం తిరిగి చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు అఖిల సెల్‌ఫోన్‌కు నరేంద్ర, అఖిల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పంపించారు. లోన్ తక్షణమే తీర్చకపోతే వాటిని ఇతరులకు సైతం పంపిస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన తరువాత నరేంద్రను అఖిల ఈ విషయం అడగ్గా.. ఇంటి అవసరాల నిమిత్తం తీసుకున్నట్టు చెప్పాడు. తర్వాత అఖిల ఆస్పత్రిలో డ్యూటీకి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో అఖిల అత్త ఫోన్‌చేసి నరేంద్ర తలుపులు తీయటం లేదని చెప్పటంతో ఇంటికి చేరుకుంది. తలుపులు కొట్టినా ఎంతకీ తీయక పోవటంతో పక్కనే ఉన్న కిటికీలోంచి చూడగా.. నరేంద్ర గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు విరగ్గొట్టి నరేంద్రను కిందికి దించి కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందంయువకుడి మరణానికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, మహిళలను అవమానించడం, నేరపూరిత బెదిరింపు, మరొకరి గుర్తింపును మోసపూరితంగా ఉపయోగించడం, ఎలక్ట్రానిక్ రూపంలో లైంగిక, అసభ్యకరమైన విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడం తదితర నేరాలపై బీఎన్ఎస్ 108, 79, 351(2), ఐటీ యాక్ట్ సెక్షన్ 66 (సి), 67(ఎ) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుని మొబైల్ ఫోన్‌ను పరిశీలించి నేరస్తులను గుర్తించేందుకు సైబర్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట!
తిరుపతి క్రైం/తిరుపతి కల్చరల్: మానవత్వం మరిచి పెంపుడు కుక్కను రాక్షసంగా వేట కొడవళ్లతో నరికి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ తిరుపతి పోలీసులు వెటకారంగా మాట్లాడారని తిరుపతికి చెందిన లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం తమ పెంపుడు కుక్క(టావీు)ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. తమతో వెటకారంగా మాట్లాడుతూ చులకనగా వ్యవహరించారని లావణ్య వాపోయారు. కుక్కను చంపిన వారికి వత్తాసు పలుకుతూ.. రూ.2 లక్షలు ఇస్తారు సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారని చెప్పారు. తానే రూ.2 లక్షలు ఇస్తానని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారా అని పోలీసులను లావణ్య ప్రశ్నించారు. ఈ సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్స్ చైర్మన్ దివ్యారెడ్డి పాల్గొన్నారు.ఇద్దరు నిందితుల అరెస్టు..టామీ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. శంకర్ కాలనీకి చెందిన లావణ్య ఈనెల 6న బయటకు వెళ్తూ తన కుమార్తె గ్రీష్మతో పాటు టామీని స్కావెంజర్స్ కాలనీలోని తన మామయ్య ఆనందయ్య ఇంట్లో వదిలి వెళ్లారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కుమార్తె గ్రీష్మ.. లావణ్యకు ఫోన్ చేసి తాతయ్య ఎదురింట్లో ఉన్న శివకుమార్, సాయికుమార్ టామీని చంపేశారని తెలిపింది. శివకుమార్ ఇంటి వైపు టామీ చూసి అరుస్తుండడంతో.. సాయికుమార్ రాయితో కొట్టాడని.. ఆ వెంటనే శివకుమార్ కత్తితో టామీని నరికి చంపేశాడు. లావణ్య ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. -
బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు
నెల్లూరు (లీగల్): బాలికతో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు పోతురాజు మీరయ్యకు జీవిత ఖైదు, రూ.20 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు మనుబోలు మండలం పిడూరుమిట్ట గ్రామానికి చెందిన పోతురాజు మీరయ్య చిల్లర అంగడి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అదే గ్రామానికి చెందిన బాలిక అంగడికి వెళ్తున్నప్పుడు మాయమాటలు చెప్పి లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. బాధిత బాలిక 2022 జనవరి పన్నెండో తేదీన మనుబోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పోతురాజు మీరయ్యను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీïÙటు దాఖలు చేశారు. విచారణలో మీరయ్య నేరం రుజువు కావడంతో పై మేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
వ్యవసాయ పనులు చేసుకుంటూ.. ఊరికి దూరంగా నిర్మించుకున్న చిన్న ఇంట్లో నివాసముంటున్న ఆ కుటుంబంలో విద్యుత్ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. తల్లీ,అభం,శుభం తెలియని ఇద్దరు బిడ్డలను కరెంట్ కాటేసింది. విద్యుత్ తీగలే యమపాశాలై వారి ప్రాణాలను హరించివేశాయి. కళ్లముందే తన పెద్ద బిడ్డ విద్యుత్ షాక్‌కు గురై గిలగిలాకొట్టుకుంటూ ఉండగా తల్లడిల్లిన ఆ తల్లి కూడా కాపాడే ప్రయత్నంలో మరణించింది. ఏమైందో తెలియక వారిని వద్దకు చేరిన మరో ఆడబిడ్డ వారితో పాటు పరలోకానికి పయనమైంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడడంతో గడుగుపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.సాక్షి,పాడేరు/పెదబయలు: పెదబయలు మండలం మారుమూల కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గ్రామంలో ఊరికి దూరంగా మట్టిగోడలతో చిన్న ఇల్లు నిర్మించుకుని కొర్రా మోహనరావు అనే ఆదివాసీ గిరిజనుడు భార్య,నలుగురు బిడ్డలు, తన తల్లితో నివాసముంటున్నాడు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయం నిత్యావసర సామగ్రి కోసం పెదబయలు సంతకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి వద్ద అతని భార్య లక్ష్మి (35),పెద్ద కుమారుడు సంతో‹Ùకుమార్(13),పెద్ద కుమార్తె అంజలి(10) ఉండగా, ఇంటికి సమీపంలో మరో ఇద్దరు బిడ్డలు కోమలి,నగేష్, మోహన్‌రావు తల్లి కొర్ర సన్నయ్ ఉన్నారు. లక్ష్మి దుస్తులు ఉతికి ఆరబెడుతున్న సమయంలో ఇంటి వరండాలో ఉన్న విద్యుత్ వైర్లను పెద్దకుమారుడు సంతోష్‌కుమార్ తాకడంతో షాక్‌కు గురయ్యాడు. గమనించిన లక్ష్మి, కుమారుడిని కాపాడే ప్రయత్నంలో విద్యుత్ఘాతానికి గురైంది. వీరిద్దరికీ ఏమైందో తెలియక వారి చెంతకు వెళ్లి అంజలి కూడా షాక్‌కు గురైంది. దీంతో ముగ్గురూ మరణించారు. ఇంటి వరండాలో విద్యుత్ వైర్లు సక్రమంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. ఊరికి దూరంగా వీరి నివాసం ఉండడంతో ప్రమాదాన్ని సకాలంలో గ్రామస్తులు గుర్తించ లేకపోయారు.పశువుల కాపరి కోటేశ్వరరావు దూరం నుంచి ఈ ముగ్గురిని గమనించి, గ్రామస్తులకు తెలియజేయడంతో పాటు మోహన రావు తల్లి,మరో ఇద్దరు బిడ్డలు కోమలి,నగేష్ లను కాపాడాడు. భార్య,ఇద్దరు పిల్లల మృతి చెందడంతో మోహనరావు గుండెలవిసేలా రోదించాడు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే తహసీల్దార్ రంగారావు,ఎస్ఐ రమణ,సర్పంచ్ శోభరాణి,వీఆర్వో సంధ్య అక్కడకు చేరుకున్నారు.తల్లీబిడ్డల మృతదేహాలను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి, శవ పరీక్షల గదిలో భద్రపరిచారు. ఆస్పత్రికి విద్యుత్‌శాఖ అధికారులు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.విచారం వ్యక్తం చేసిన అరకు ఎంపీ,ఎమ్మెల్యేలు విద్యుత్ ప్రమాదంలో తల్లి, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంపై అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి,అరకు,పాడేరు ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం,మత్స్యరాస విశ్వేశ్వరరాజు,ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు,ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రలు విచారం వ్యక్తం చేశారు.బాధిత ఆదివాసీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్‌ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు. -
యువతిపై హత్యాయత్నం కేసులో ప్రేమోన్మాది అరెస్ట్
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా వేముల పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై హత్యా యత్యానికి పాల్పడిన పేమోన్మాదిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం కడపలో మీడియాకు వివరాలు వెల్లడించారు. వేముల మండలానికి చెందిన కుళ్లాయప్ప కొంతకాలంగా యువతి వెంట పడుతున్నాడు.ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి ప్రవేశించి కత్తితో యువతిపై విచక్షణ రహితంగా దాడి చేసి పారిపాయాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వేముల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే గ్రామస్తులు తనను కొట్టి చంపుతారేమోనని భయపడిన నిందితుడు గ్రామ సమీపాన గల కొండల్లో ఉండి చనిపోవాలనుకుని కత్తితో చేయి కోసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడి తప్పించుకోవడానికి హైదరాబాద్ వెళుతుండగా పోలీసుల చేతికి చిక్కాడు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్టు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు వివరించారు. -
మడకశిరలో బాలిక కిడ్నాప్
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మడకశిర పట్టణ సమీపంలోని బేగార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక మడకశిర పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల ఐదో తేదీ ఉదయాన్నే కళాశాలకని ఇంటి నుంచి బయల్దేరింది. రాత్రి వరకు ఎదురుచూసినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికారు. బంధువుల ఇళ్లకేమైనా వెళ్లిందేమోనని ఆరా తీశారు. అయినా ఆచూకీ దొరకలేదు.మరుసటిరోజు శుక్రవారం మడకశిర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి మూడ్రోజులు గడిచినా పోలీసులు బాలిక ఆచూకీని గుర్తించలేదు. దీంతో బాలిక తల్లి శైలజ తీవ్ర మనోవేదనకు గురై సోమవారం ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను మడకశిర ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలిక తండ్రి జయరామప్ప కూడా పోలీస్‌స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. బంధువులు, కుటుంబసభ్యులు ఆయన్ను వారించడంతో ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న సీఐ రాజ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులతో చర్చించారు. ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడంలేదని సీఐతో వారు వాగ్వాదానికి దిగారు. త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకుని బాలికను క్షేమంగా అప్పగిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
Andhra Pradesh: ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని దారుణ హత్య
నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది బాలికపై సోమవారం తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించగా.. ఇదే ఘటనలో ప్రేమోన్మాదికి కూడా 40 శాతం గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలిక సామూహిత హత్యాచారం ఘటన మరకముందే నందికొట్కూరు పట్టణంలోని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యచేసిన సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.ఏం జరిగిందంటే..కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామానికి చెందిన రామకృష్ణ, లక్ష్మి దంపతుల కుమార్తె లహరి (17). చిన్నతనంలో లహరి తండ్రి చనిపోవడంతో బాలిక అవ్వాతాతలు ఆమెను తమవద్దే ఉంచుకుని ఉన్నత చదువులు చదివిస్తామని నందికొట్కూరుకు తీసుకొచ్చి నంది జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి లహరి అవ్వాతాత ఓ గదిలో పడుకోగా, చదువుకుంటానంటూ లహరి మరో గదిలో నిద్రించింది. ఏమైందో ఏమో ఆదివారం తెల్లవారుజామున లహరి ఉన్న గదిలోంచి ఒక్కసారిగా పొగలు, మంటలు వచ్చాయి. దీంతో లహరి అవ్వాతాత వెంటనే గట్టిగా కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి చూసేసరికి లహరి పూర్తిగా కాలిపోయి అక్కడే మృతిచెందింది. అదే గదిలో వెల్దుర్తి మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన బోయ ఆకుల సుబ్బారాయుడు, గిరిజా దంపతుల కుమారుడు రాఘవేంద్ర 40 శాతం కాలిన గాయాలతో కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 108 వాహనంలో రాఘవేంద్రకు ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం అందించేందుకు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే మృతిచెందిన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.టెన్త్ వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు..ఇక లహరి, రాఘవేంద్ర ఇద్దరూ 10వ తరగతి వరకు రామళ్లకోటలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్ర బాలికను ప్రేమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన లహరి తల్లి తన కుమార్తెను తన తల్లిదండ్రుల వద్దకు పంపినట్లు సమాచారం. మరోవైపు.. పదో తరగతితో చదువు ఆపేసిన రాఘవేంద్ర ప్రస్తుతం పెళ్లిళ్లకు డెకరేషన్ పనులు పనిచేస్తున్నాడు. తరచూ నందికొట్కూరులోని బాలిక వద్దకు రాత్రి వేళ్లల్లో వచ్చిపోయేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండు మూడ్రోజుల క్రితం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం అర్థరాత్రి కూడా బాలిక వద్దకు వచ్చిన రాఘవేంద్ర తెల్లవారుజామున ఆమెపై పెట్రోల్ పోసి చంపేశాడని బంధువుల చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రామాంజునాయక్, సీఐలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, ఓబులేసు పరిశీలించారు. అలాగే, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా కూడా నందికొట్కూరులో లహరి ఉంటున్న ఇంటిని సందర్శించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు.వాడిని చంపేయండి..నా మనరాలిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసిన వాడిని పోలీసులే చంపేయాలి. మీతో కాకపోతే వాడిని మాకు అప్పగించండి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాల్సిన నా మనవరాలిని అన్యాయంగా చంపేశాడు. అమ్మాయిలపై దాడులు చేసేవారిని పోలీసులు వదలకుండా కాల్చియాలి. వాడి మరణం చూసి ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రాకూడదు. – పార్వతమ్మ, లహరి అవ్వ -
స్నేహం ముసుగులో కీచకుడు
తాడేపల్లి రూరల్ : మద్యం మత్తులో స్నేహితుడు తల్లిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రాంతంలో బాధితురాలు (50) ఉంటోంది. అక్కడే నివాసముండే తెంపర్ల రామారావు పలుమార్లు స్నేహితుడు ఇంటికి వెళ్లి బాధితురాలు అయిన అతడి తల్లితో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమె చేసిన వంటలు తిని బాగున్నాయి అమ్మా ! అంటూ పొగిడేవాడు. ఈ చనువుతో రామారావు మనసులో దురుద్దేశం పెట్టుకుని సోమవారం తెల్లవారుజామున స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. తలుపు తీయమని అడగడంతో తెలిసిన వ్యక్తి కదా బాధితురాలు తలుపు తీసింది. ఒక్కసారిగా రామారావు ఆమెను మంచంపై పడవేసి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో అరవొద్దు అంటూ నోరు మూసి, దుస్తులను చించేందుకు ప్రయత్నించాడు. ఆ పెనుగులాటలో బాధితురాలికి పలుచోట్ల గాయాలయ్యాయి. చివరకు ఆమె అతడి నుంచి తప్పించుకుని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పరిగెత్తింది. ఆమె కేకలకు స్థానికులు రోడ్డుమీదకు రావడంతో రామారావు పరారయ్యాడు. బాధితురాలి బంధువులు రామారావు ఇంటికి వెళ్లి నిలదీయగా తమకు ఏమి తెలియదని సమాధానం చెప్పారు. దీంతో జరిగిన సంఘటనపై బాధితురాలు బంధువులతో కలసి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రామారావును ఎట్టకేలకు గుర్తించారు. అతడు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు, స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులతో సెటిల్మెంట్లు చేయించుకున్నట్లు సమాచారం. రామారావు తాడేపల్లిలో ఉన్న పలువురు జేబుదొంగల వెంట తిరిగి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాడని పలువురు తెలియజేశారు. రామారావు లాంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ బంధువులు కోరుతున్నారు. -
ఏపీలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు.. యువతి మృతి, మరొకరికి గాయాలు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రేమ పేరుతో కొందరు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమను ప్రేమించలేదనే కారణంగా యువతులపై దాడులకు తెగబడుతున్నారు. ఏపీలో ఒకేరోజు రెండు చోట్ల దాడి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గుర్రాల రాజు(23) అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురిచేశారు. కొద్దిరోజులుగా ఆమె వెంట పడుతూ తనను ప్రేమించాలని వేధించాడు. ఈ క్రమంలో బాధితురాలు పట్టించుకోకపోవడంతో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమెపై దాడి చేసేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. యువతిపై దాడి చేసే సమయంలో ఆమె తల్లి అడ్డురావడంతో కోపంతో.. ఆమెపై దాడి చేశాడు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కాగా, దాడి చేసిన తర్వాత రాజు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అలాగే, నిందితుడు రాజు కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.ఇక, నంద్యాల జిల్లాలో కూడా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
AP: ప్రేమోన్మాది ఘాతుకం.. దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి
సాక్షి, నంద్యాల: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు మృతిచెందింది. అనంతరం తాను నిప్పంటించుకొని అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లహరి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
AP: ప్రేమోన్మాది దాడి.. యువతి పరిస్థితి విషమం
సాక్షి, తిరుపతి: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతిపై దాదాపు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.వివరాల ప్రకారం..‘వేముల మండలం కొత్తపల్లికి చెందిన షర్మిలపై శనివారం సాయంత్రం ప్రేమోన్మాది కులాయప్ప దాడికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదని షర్మిలపై 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో, బాధితురాలు.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను శనివారం రాత్రి పులివెందుల నుంచి కడప రిమ్స్‌కు తరలించారు.అయితే, షర్మిల.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడప నుండి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి విషమంగానే ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో దాడికి పాల్పడిన కులాయప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి తర్వాత కులాయప్ప పరారీలో ఉన్నాడు. -
AP: చెట్టును ఢీకొన్న కారు.. అక్కడికక్కడే నలుగురు మృతి
సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలోని గీతిక స్కూల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో, వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే, వీరంతా హైదరాబాద్ నుంచి కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
వైఎస్సార్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇంట్లో వారు రావడంతో ఆ యువకుడు పరారయ్యారు.పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
థాయ్ యువతుల స్పెషల్! మసాజ్ ముసుగులో..
లక్ష్మీపురం: గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లక్ష్మీపురంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ సుప్రజ, అరండల్ పేట సీఐ వీరాస్వామి ప్రత్యేక బృందాలుగా శుక్రవారం దాడులు నిర్వహించారు. నలుగురు థాయిలాండ్‌కు చెందిన వారితోపాటు ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కేపీహెచ్‌బీ మెట్రో: పది మంది మహిళల అరెస్ట్ -
వధువు బంగారు నగలు మాయం.. బ్యూటీషియన్‌పై కేసు
పామిడి: ఫంక్షన్ హాలులో వధువు బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. ప్రత్యామ్నాయ నగలు అలంకరించి పెళ్లి కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేశారు. మూడు గంటల వ్యవధిలోనే బంగారును రికవరీ చేశారు. వధువును అలంకరించేందుకు వచ్చిన బ్యూటీషియనే దొంగ అని గుర్తించారు. వివరాల్లోకెళితే.... రామరాజుపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి కుమార్తె పెళ్లి పామిడిలోని కోగటం ఫంక్షన్‌హాలులో జరిగింది. గురువారం రాత్రి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం తలంబ్రాలు. వధువుకు సంబంధించిన 28 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. నగల మాయంపై పెళ్లికి వచ్చిన బంధుమిత్రులను ఆరా తీస్తే బాధపడతారేమోనని వధువు కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ నగలతో అలంకరించి పెళ్లి ఘట్టం ముగించారు. తర్వాత స్తబ్దుగా ఉండిపోయిన వధువు తండ్రిని గమనించిన స్నేహితులు రెక్కల చిన్న నాగిరెడ్డి ఆధ్వర్యంలో రామరాజుపల్లికి చెందిన రామశేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి పోలీసులకు సమాచారమందించారు. స్పందించిన సీఐ యుగంధర్ తన సిబ్బందితో ఫంక్షన్ హాలుకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆధారాలు లభించలేదు. దీంతో పెళ్లి కుమార్తె గదిని పరిశీలించారు. అక్కడ పైకప్పు పీఓపీ కొంత గ్యాప్ కనిపించింది. అక్కడేముందని చూడగా రెండు ఖాళీ నగల బాక్సులు కిందపడ్డాయి. ఇక్కడే ఏదో జరిగిందని అర్థమైంది. గదిలో ఎవరెవరు ఉన్నారు. ఎవరెవరు వచ్చి వెళ్లారు అని సీఐ ఆరా తీశారు. మేకప్ చేయడం కోసం బెంగళూరు నుంచి వచ్చిన బ్యూటీషియన్ తీరుపై అనుమానం కలగడంతో.. ఆమెను తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకొచ్చింది. తానే నగలు తస్కరించానని, వాటిని వాష్‌రూమ్‌లో ఫ్లష్‌ట్యాంకులో దాచి పెట్టిన నగలను చూపించింది. అనంతరం బ్యూటీషియన్‌పై సీఐ కేసు నమోదు చేశారు. మూడు గంటల వ్యవధిలోనే బంగారు నగలను రికవరీ చేసిన సీఐకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
వైఎస్సార్సీపీ దళిత నేతపై టీడీపీ గూండాల దాడి
పాకాల : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు అడ్డులేకుండా పోతోంది. టీడీపీ నాయకులు ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారోనని దళితులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. తాజాగా.. గురువారం రాత్రి పాకాల మండల కేంద్రంలోని రామకృష్ణ డీలక్స్ సినిమా థియేటర్లో వైఎస్సార్సీపీ దళిత నాయకుడు సెంథిల్‌కుమార్‌పై టీడీపీ గూండాలు కర్రలతో, పిడిగుద్దులతో దాడికి తెగబడ్డారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పుష్పా–2 సినిమాకు తన భార్య అరీషా, కుమార్తెలు శ్రీజ, మనుశ్రీలను సెంథిల్‌కుమార్ పంపించారు. విశ్రాంతి సమయంలో తన పిల్లలకు స్నాక్స్ ఇచ్చి తిరిగి బయటకొస్తున్న సెంథిల్‌కుమార్‌ను టీడీపీ గూండాలు గమనించి దాడికి తెగబడ్డారు. ముందుగా ఆయన్ను వెనుక నుంచి తన్నడంతో కింద పడిపోయారు. వెంటనే తమ వెంట తెచ్చుకున్న కర్రలతో పచ్చమూకలు భారతంమిట్టకు చెందిన బొల్లినేని సురేష్, కమతంపల్లికి చెందిన మోహన్‌నాయుడు, బావిరాగన్న చెరువు గ్రామానికి చెందిన గోవర్థన్ (గోకుల్), గెడ్లచేనుకు చెందిన చరణ్ తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న అరీషా సినిమా థియేటర్ నుంచి బయటికొచ్చి తన భర్తను కొట్టకండని ప్రాథేయపడ్డారు. అయినాసరే భార్య, కన్నబిడ్డల ముందే సెంథిల్‌కుమార్‌ని చితకబాదారు. చిన్న పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా సెంథిల్‌కుమార్‌ని చంపడానికి యత్నించారు. సినిమా చూడ్డానికి వచ్చిన కొందరు అడ్డుకున్నప్పటికీ వారిపై కూడా దాడికి తెగబడ్డారు. అలాగే, ఈ దాడిని చిత్రీకరిస్తున్న వారి సెల్ఫోన్లను లాక్కొని పగలగొట్టారు. ఈ ఘటనలో సెంథిల్‌కుమార్‌కి మెడపైన, ఎడమ కన్నుపై, పక్కటెముకలకు తీవ్రగాయాలవడంతో ఆయన్ని చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం పి.కొత్తకోటలోని సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చాక సెంథిల్‌కుమార్, అతని భార్య అరీషా శుక్రవారం దాడిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. టీడీపీ గూండాలు కులం పేరుతో దూషిస్తూ, మా ప్రభుత్వంలో మా ముందుకొచ్చి కూర్చునే అంత దమ్ముందా అంటూ తనపై దాడిచేశారని సెంథిల్‌కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు విన్నవించారు. -
రామ్మోహన్ నాయుడు అనుచరుడి దందా.. శిక్షణ పేరుతో యువతులపై వేధింపులు!
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలైంది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర లక్షల్లో వసూలు వేసి వారిని వేధింపులకు గురిచేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ షేర్ చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేస్తూ..‘శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణ. శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్.. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నాడు.బసవ రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి.. చిత్రహంసలకు గురిచేస్తున్నాడు. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి.. బసవ రమణ దందాలు. షాపింగ్ మాల్స్, బార్స్‌కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. రమణ ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా.. పట్టించుకోని కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్‌కి కూడా రమణ సన్నిహితుడు. పాలన చేతగాకపోతే.. ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు అంటూ విమర్శించింది. 💣 Truth Bomb 💣శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణశిక్షణ పేరుతో సెంటర్… pic.twitter.com/CdcgSdJUJE— YSR Congress Party (@YSRCParty) December 6, 2024 -
సత్యసాయిజిల్లా: బాలికపై టీడీపీ నేత దాష్టీకం
సాక్షి,సత్యసాయి జిల్లా:పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో టీడీపీ నేత సూర్యనారాయణ దాష్టీకం వెలుగు చూసింది. బహిర్భూమికి వెళ్లిన బాలికపై సూర్యనారాయణ అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది.అత్యాచారం విషయం బయటకు పొక్కితే చంపుతామని బాలికను టీడీపీ నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. అయినా బాలిక తల్లిదండ్రులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యనారాయణపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. -
మెడిసిన్ సీటు దక్కలేదని...
రాయదుర్గం టౌన్: రాయదుర్గం టౌన్: వైద్య కళాశాలలో సీటు దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువతి వేగంగా వెళుతున్న రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా) జిల్లా సేడం పట్టణానికి చెందిన కిషోర్‌కుమార్ కుమార్తె తనూజ (20) మంగళవారం ఉదయం చిత్రదుర్గం చేరుకుని అక్కడి వైద్య కళాశాలలో సీటు కోసం ప్రయత్నించింది. అయితే ఆమెకు సీటు దక్కకపోవడంతో అదే రోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి రాయదుర్గం మీదుగా హోస్పేట్‌కు వెళ్లే రైలులో తిరుగు ప్రయాణమైంది. ప్రయాణిస్తూనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు మెడికల్ సీటు దక్కలేదని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపింది. అప్పటికే మధ్యాహ్నం 1 గంట. రాయదుర్గం శివారులోని పైతోట సమీపంలో వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే కుమార్తె ఫోన్ కాల్‌తో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పలుమార్లు కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో విషయాన్ని వెంటనే కర్ణాటక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తనూజ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా ఆమె ఆచూకీ కోసం కర్ణాటక పోలీసులు గాలింపు చేపట్టారు.ఈ క్రమంలో బుధవారం ఉదయం పైతోట వద్ద గ్యాంగ్‌మెన్ నగేష్... పట్టాలు పక్కనే పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో గుంతకల్లు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి వద్ద లభించిన ఆధారాలను పరిశీలించి తనూజగా నిర్ధారించారు. అక్కడే పడి ఉన్న ఫోన్లోని నంబర్‌కు కాల్ చేసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు రాయదుర్గానికి ప్రయాణమైనట్లు సమాచారం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.