Top Stories
ప్రధాన వార్తలు

ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో 12 మంది ఉగ్రవాదులు మ్రతి చెందగా మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు.

మా దేశం నీళ్లు ఇక మావే: ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ఇక నుంచి భారత్‌కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారత నీళ్లు ఇప్పటివరకూ బయటకు వెళ్లాయని, ఇక నుంచి అది ఉండదన్నారు. మన నీళ్లు- మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్సష్టం చేశారు. పాకిస్తాన్ కు సింధు జలాల నిలిపివేత అంశంపై స్పందించిన మోదీ.. మన నీళ్లు ఇక నుంచి మన అవసరాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు.చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ప్రాజెక్ట్ నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.కాగా, ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మూడు రోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

ఓబుళాపురం మైనింగ్ కేసు.. సబిత నిర్దోషి
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గనుల శాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మంగళవారం మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితులైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి జనార్దనరెడ్డి పీఏ మెహఫూజ్ అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ.. ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున,ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. రాజగోపాల్‌కు అవినీతి నిరోధక చట్టం కింద అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి ఐఏఎస్ అధికారి యర్రా శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు 2022లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2009లో కేసు నమోదు ఏపీ–కర్ణాటక సరిహద్దు అనంతపురం, బళ్లారి రిజర్వు ఫారెస్టులో ఓబుళాపురం గ్రామ పరిధిలోని ఇనుప గనుల తవ్వకాలను ఓఎంసీ నిర్వహించేంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు అందింది. అనుమతి పొందిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి ఇనుప ఖనిజాన్ని తవి్వందని అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, కృపానందం, సబితాఇంద్రారెడ్డి, గనుల శాఖ నాటి ఏడీ లింగారెడ్డి, శ్రీలక్ష్మిలపై అభియోగాలు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లతో పాటు కొందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పెట్టింది. రూ.884.13 కోట్ల మేర అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని 2011లో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. 2014 వరకు ఇలా నాలుగు చార్జిషీట్లు వేసింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, బినామీ లావాదేవీలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాగా, కేసు విచారణ ఏళ్లకు ఏళ్లు పడుతుండడంతో సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షిస్తూ.. మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఇక 219 మంది సాక్షులను విచారించి, 3,330 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ న్యాయస్థానం గత నెలలో తీర్పు రిజర్వు చేసింది. కాగా, లింగారెడ్డి విచారణ దశలోనే మృతి చెందారు. కోర్టుకు హాజరైన నిందితులు తీర్పు వెల్లడి సందర్భంగా కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 18న తన కుమారుడి పెళ్లి ఉందని అప్పటివరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తాను ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేశానని, పేద కుటుంబం నుంచి వచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించానని గాలి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తనను బళ్లారిలో అడుగుపెట్టొద్దని ఆదేశించినా, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఉపశమనం కల్పిస్తే ఆధ్యాత్మిక పథంలో వెళ్తానని విన్నవించారు. ప్రభుత్య ఉద్యోగులందరినీ వదిలేసి తనను శిక్షించడం అన్యాయమని రాజగోపాల్ నివేదించారు. తనపై ఆధారపడి తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు ఉన్నారని అలీ విజ్ఞప్తి చేశారు. సబితాఇంద్రారెడ్డి, కృపానందం కూడా కోర్టుకు హాజరయ్యారు.

ముంబై జోరుకు బ్రేక్
ముంబై: ఐపీఎల్–2025లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు కాస్త విరామం... వరుసగా ఆరు విజయాలతో కొనసాగించిన జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. మంగళవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో గుజరాత్ 3 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) ముంబైపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 43 బంతుల్లో 71 పరుగులు జోడించారు. చక్కటి బౌలింగ్‌తో ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టైటాన్స్ సఫలమైంది. అనంతరం గుజరాత్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫర్డ్ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో 14 ఓవర్ల తర్వాత 107/2తో గుజరాత్ మెరుగైన స్థితిలో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న జట్టు మరో 36 బంతుల్లో 49 పరుగులే చేయాలి. గుజరాత్ విజయం లాంఛనమే అనిపించింది. ఈ దశలో వానతో చాలా సేపు ఆట ఆగిపోయింది. అంతా చక్కబడి మ్యాచ్ మొదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బుమ్రా, బౌల్ట్ చెలరేగిపోవడంతో గుజరాత్ బ్యాటింగ్ తడబాటుకు లోనైంది. తర్వాతి 4 ఓవర్లలో 25 పరుగులు చేసిన జట్టు 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన ఉన్న సమయంలో మళ్లీ భారీ వర్షంతో ఆట ఆగిపోయింది. దాంతో ఆటను ఒక ఓవర్ కుదించి డక్‌వర్త్–లూయిస్ ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్దేశించారు. దాంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. చహర్ వేసిన ఈ ఓవర్లో టైటాన్స్ 15 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సుదర్శన్ (బి) సిరాజ్ 2; రోహిత్ (సి) ప్రసిధ్ (బి) అర్షద్ 7; జాక్స్ (సి) సుదర్శన్ (బి) రషీద్ 53; సూర్యకుమార్ (సి) షారుఖ్ (బి) సాయికిషోర్ 35; తిలక్ (సి) గిల్ (బి) కొయెట్జీ 7; పాండ్యా (సి) గిల్ (బి) సాయికిషోర్ 1; నమన్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 7; బాష్ (రనౌట్) 27; చహర్ (నాటౌట్) 8; కరణ్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–2, 2–26, 3–97, 4–103, 5–106, 6–113, 7–123, 8–150. బౌలింగ్: సిరాజ్ 3–0–29–1, అర్షద్ 3–0–18–1, ప్రసిధ్ 4–0–37–1, సాయికిషోర్ 4–0–34–2, రషీద్ ఖాన్ 4–0–21–1, కొయెట్జీ 2–0–10–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 5; గిల్ (బి) బుమ్రా 43; బట్లర్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; రూథర్‌ఫర్డ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 28; షారుఖ్ (బి) బుమ్రా 6; తెవాటియా (నాటౌట్) 11; రషీద్ ఖాన్ (ఎల్బీ) (బి) అశ్వని 2; కొయెట్జీ (సి) నమన్ (బి) చహర్ 12; అర్షద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–6, 2–78, 3–113, 4–115, 5–123, 6–126, 7–146. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–32–1, బౌల్ట్ 4–0–22–2, బుమ్రా 4–0–19–2, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కరణ్ శర్మ 2–0–13–0, అశ్వని కుమార్ 4–0–28–2, జాక్స్ 1–0–15–0.

ఇది ఐక్యతా సమయం
గత వారం ఓ రోజు ఉదయం 6 గంటల తర్వాత నా మొబైల్లో నోటిఫికేషన్ పింగ్ అయింది. నా స్నేహితుడి కొడుకు నుండి ఒక సందేశం వస్తున్నట్లు నేను చూశాను. పహల్గామ్లో జరిగిన సంఘటనల గురించి అతను కలత చెందాడు. సంఘటన తర్వాత వెంటనే ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోనందుకు మన ప్రభుత్వంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడానికి తీవ్రస్థాయిలో మీడియా ప్రచారాన్ని నడపటం ద్వారా నా వంతు కృషి నేను చేస్తానని అతను ఆశించాడు. నేను షాక్ అయ్యాను. చిన్నప్పటి నుండి అతడు నాకు తెలుసు. దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో అతను చదువుకున్నాడు. ఇంజనీరింగ్ డిగ్రీని సాధించాడు. ఇన్ స్టిట్యూట్ నుండి పట్టభద్రుడయ్యే ముందు, అతనికి ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగం ఆఫర్ కూడా ఉండేది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు కార్పొరేట్ వర్గాల ఆకర్షణీయమైన సర్కిల్లో ఉంటున్నాడు. తన తెలివితేటలు, జ్ఞానం వల్ల మంచి గుర్తింపు, గౌరవం పొందాడు. అందుకే తాను ప్రకటించిన విద్వేష భావానికి నేను పెద్దగా కలత చెందలేదు. తనను ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాను. ప్రభుత్వాన్ని విశ్వసించమని నచ్చ చెప్పాను. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రపంచం భారత్ నుండి పూర్తి స్థాయి చర్యను వీక్షిస్తుందని చెప్పాను. 1971లోనూ భారతదేశంలో ఇలాంటి యుద్ధ సన్నద్ధతే పెరుగుతూ వచ్చిందని అతనికి గుర్తు చేశాను. తిరుగులేని వ్యూహకర్త మానెక్ షా!అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానెక్ షాను పిలిపించారు. ‘‘తూర్పు పాకిస్తాన్ పై భారత సైన్యం వెంటనే దాడి చేసి, దాన్ని స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా మార్చడానికి సహాయం చేయగలదా?’’ అని ఆమె అడిగారు. అద్భు తమైన వ్యూహకర్త మానెక్ షా. కొన్ని నెలల్లో రుతుపవనాలు రాను న్నాయని ప్రధానితో చెప్పారు. వర్షాకాలంలో, బంగ్లాదేశ్‌లోని పొలాలు చిత్తడి నేలలుగా మారతాయి. అందువల్ల అలాంటి సమయంలో దాడి చేయడం అంటే అది పెద్ద ఎత్తున సైనికుల మరణానికి దారితీస్తుందని వివరించారు. దాంతో మానెక్ షా తొందరపాటు ఆదేశాలు జారీ చేయబోవడం లేదని నిర్ధారణ అయింది. అనంతరం, తొమ్మిది నెలలపాటు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళిక, సమన్వయం, కచ్చితమైన వ్యూహం తర్వాత, భారత దళాలు తూర్పు పాకిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, శత్రువు ఓడిపోవడమే కాకుండా, 90,000 మందికి పైగా పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. మానవాళి చరిత్రలో, ఇంత పెద్ద సైనిక దళం ఎప్పుడూ ప్రత్యర్థికి లొంగి పోలేదు. 1971 డిసెంబర్ 16న, భారత సైన్యం తన అత్యుత్తమ ఘడియను ఆస్వాదిస్తూ, మన సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యాన్ని లిఖిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.1971ని తలపిస్తున్న మంతనాలుప్రస్తుత ప్రధాని కూడా భారత సాయుధ దళాలకు పాక్‌పై తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. నెంబర్ 7 – లోక్ కల్యాణ్ మార్గ్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో వ్యూహాత్మక సమావేశాలు జరిగాయి. సైనిక చర్యలు ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటాయి. కనీస ప్రాణనష్టంతో త్వరిత విజయాన్ని సాధించడానికి, శక్తిమంతమైన మిత్రులు మద్దతు ఇవ్వడానికి లేదా నిర్ణాయక సమయంలో కనీసం తటస్థంగా ఉండటానికి కొన్ని నిబద్ధతలు అవసరం. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధంలో సంకీర్ణ సైన్యానికి నాయకత్వం వహించిన యు.ఎస్. జనరల్ నార్మన్ స్క్వార్జ్కోఫ్, ‘‘మీరు శాంతిలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం అవుతుంది...’’ అని అన్నారు.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా సహా వివిధ దేశాలలో తమ సమ ఉజ్జీలతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు 1971ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మానెక్ షా, నావికాదళ, వైమానిక దళ అధిపతులు యుద్ధా నికి సిద్ధమవుతుండగా, ఇందిరా గాంధీ కూడా నమ్మకమైన దౌత్య భాగస్వాముల కోసం వెతికే పనిలో పడ్డారు. భారతదేశం అప్పటికి కొంతకాలం క్రితం పాశ్చాత్య జోక్యానికి వ్యతిరేకంగా హామీ కోసం నాటి సోవియట్ యూనియన్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తరువాత, యుద్ధ సమయంలో బంగాళాఖాతంలో అమెరికన్ సిక్స్త్ ఫ్లీట్ కనిపించడం, దాన్ని ఎదుర్కోవడానికి సోవి యట్ జలాంతర్గాములు రావడం వంటి సంఘటనలు భారతదేశపు దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ (పైఎత్తు)ను ధ్రువీకరించాయి. నేడు రెండూ అణ్వాయుధ శక్తులే!నేటి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరమైనది. ట్రంప్ 2.0 యుగంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎటువంటి భావజాలం లేకుండా, సోషల్ మీడియా నిరంతర చూపు కింద నడిచే భౌగోళిక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 1971లో మాది రిగా కాకుండా భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఇప్పుడు అణ్వాయుధ శక్తులు. మనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు. ఏదైనా సహాయం అందించే పరిమిత సామర్థ్యంతోనే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ తో పోరాడుతోంది, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వ్యాఖ్యలు బీజింగ్ జాగరూకతా వైఖరిని వెల్లడిస్తున్నాయి: ‘‘సంఘర్షణ అనేది భారత్ లేదా పాకిస్థాన్ ప్రాథమిక ప్రయోజనాలకు నష్టం చేస్తుంది..’’ అని వాంగ్ వ్యాఖ్యానించారు. అయితే చైనా సానుభూతి పాక్ వైపు ఉంది. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా, మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటనను పరిగణించండి: ‘‘పహల్గామ్ దాడి పట్ల భారత్ విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా ప్రతిస్పంది స్తుందని మేము ఆశిస్తున్నాము’’ అన్నారాయన. ప్రమాదకరంగా సోషల్ మీడియా!ప్రభుత్వం చేతులు కట్టివేయడం, దాని ఎంపికలను పరిమితం చేయడం వంటి సంక్లిష్టతలను గ్రహించకుండా, లెక్కలేనన్ని స్వరాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఉగ్రదాడి పట్ల, పాక్ పైన నిరంతరం మండిపడుతున్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్ అయినా, లేదా బాలాకోట్ వైమానిక దాడి అయినా సరే, తన మాటను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న విశ్వసనీయతను వారు విస్మరిస్తున్నారు.దాంతో మన సోషల్ మీడియా కార్యకలాపాలు శత్రువులకు ఫిరంగి మేతగా మారాయి. ఎవరైనా సరే, ప్రభుత్వ పక్షాన నిశ్శబ్దంగా నిలబ డాల్సిన సమయం ఇది. అనవసరమైన వాగ్వాదాలకు పాల్పడకుండా ఉండాల్సిన సమయం ఇది. మతతత్వపు విష బీజాలు నాటడానికి కొందరు ఈ పరిస్థితిని మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం బృందావన్‌లో ఆలయ సేవలో పాల్గొన్న ముస్లింలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాంకే బిహారీ ఆలయం ముందు ఒక మూక నిరసన తెలిపింది. అయితే ఆలయ ట్రస్ట్... స్పష్టంగా ప్రతిస్పందించింది. ఆ ముస్లింలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని దుస్తులను తయారు చేస్తున్నారని ట్రస్ట్ నిర్వాహకులు నొక్కి చెప్పారు.ఐక్యంగా ముందుకు సాగాలిఉగ్రవాద దాడిని జమ్మూ – కశ్మీర్ అసెంబ్లీ ఏప్రిల్ 29న ఏకగ్రీవంగా ఖండించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సంఘీభావం తెలిపింది. లోయలో ఉగ్రవాదం అంతం ప్రారంభమైందని శాసన సభ్యులు భావిస్తున్నారు. ద్వేషపూరిత వ్యక్తులు అలాంటి సంఘీభావ ప్రదర్శనను విస్మరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక మసీదులు మొన్నటి ఉగ్రవాద దాడిని ఖండించడాన్ని సులువుగా మరచి పోతారు. ఇప్పుడు పాకిస్థాన్‌ను బహిరంగంగా ఖండించని ముస్లిం నాయకుడు లేడు. ద్వేషం, విభజన రాజకీయాలతో రెచ్చగొట్టడం కాకుండా, అందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి సామాజిక ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం ఇది!శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు

ప్రాణంపోసే నిర్ణయం
అనునిత్యం నెత్తుటి చరిత్ర రచిస్తున్న రహదారులపై దుర్మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేసింది. సోమవారం విడుదలైన ఒక నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకున్నవారికి ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్స వెనువెంటనే అందుతుంది. ప్రమాద బాధితులకు లక్షన్నర రూపాయల వరకూ చికిత్స సదుపాయం లభించటంతోపాటు వారం రోజుల వరకూ వైద్య సేవలు పొందే వెసులుబాటునిచ్చారు. దేశంలో ఏ రోడ్డుపై ప్రమాదం జరిగినా ఈ పథకం వర్తిస్తుందని నోటిఫికేషన్ చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాక 2015 జూలైలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాలను ప్రస్తావించారు. బాధితులకు చికిత్స చేయటంలో ఆస్పత్రులు వెనుకంజ వేయకుండా నగదురహిత వైద్యానికి వీలుకల్పిస్తామని ఆ సందర్భంలోనే చెప్పారు. అది ఇన్నాళ్లకు సాకారమైంది. ప్రమాదాల నియంత్రణకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటూనేవుంది. కానీ పెద్దగా ఫలితాన్నిస్తున్న జాడ కనబడదు. ఏటా వెల్లడయ్యే గణాంకాలే ఇందుకు సాక్ష్యం. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మొన్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మాట్లాడుతూ ఏటా మన రహ దారులపై దాదాపు 4,80,000 ప్రమాదాలు సంభవిస్తున్నాయని, 1,78,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పినప్పుడు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాద మృతుల్లో 60 శాతం మంది 18–34 యేళ్ల మధ్య వయస్కులేనని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తన మంత్రిత్వశాఖ నిస్సహాయతను కూడా వివరించారు. 2024 ఆఖరుకల్లా రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య 50 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించుకున్నా ఏమాత్రం సాధ్యపడలేదని, పైపెచ్చు అవి మరింత పెరిగాయని ఆయన ఒప్పుకున్నారు. ప్రమాదాల నివారణ మాట అటుంచి బాధితులకు సకాలంలో వైద్యసాయం అందితే చాలామందిని మృత్యుముఖం నుంచి బయటకు తీసుకురావొచ్చని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవిస్తే చికిత్స ఆలస్యం కావటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ డబ్బు విదిలిస్తే తప్ప చికిత్సకు ముందుకురాని ఆస్ప త్రుల కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది గమనించే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందే వెసులుబాటు కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అదికాస్తా అటకెక్కింది. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల బెడదపై నాలుగేళ్లక్రితం ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. 2021–30 మధ్య ఈ ఉదంతాల్లో మరణాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని లక్ష్యనిర్దేశం చేసింది. ఆ మాటెలా వున్నా కేవలం పెను వేగంతో వెళ్లే వాహనాల వల్లనే ప్రమాదాలు చోటుచేసుకుంటా యన్నది నిజం కాదు. మొన్న మార్చిలో జరిగిన సదస్సులో కేంద్రమంత్రి గడ్కరీయే ఈ విషయాన్ని అంగీకరించారు. ఇరుకురోడ్డని, మలుపు వున్నదని, వేగం తగ్గించాలని సూచించే బోర్డులూ, మార్కింగ్‌లూ అవసరమైనచోట్ల లేకపోవటం దగ్గర్నుంచి నిర్మాణపరంగా వుండే లోపాల వరకూ అనేకానేక మైనవి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. సివిల్ ఇంజనీర్లు మొదలుకొని కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ల వరకూ ఎవరికీ దీనిపై జవాబుదారీతనం లేదు. సవివర ప్రణాళికా నివేదిక (డీపీఆర్)లు నాసిరకంగా వున్నా అడిగేవారు లేరు. ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి రావటం వల్ల లోపాలను ముందు గానే సులభంగా పసిగట్టడం సాధ్యమవుతోంది. వాటిని అనుసరిద్దామన్న ఆలోచన కూడా రాదు. అతి తక్కువ ప్రమాదాలు జరుగుతున్న ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, స్పెయిన్ దేశాల్లో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో గమనించి, వాటిని అమల్లోకి తెచ్చినా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అసలు మన రోడ్ల నాణ్యతకూ, అమ్మే వాహనాలకూ సంబంధమే లేకుండా పోయింది. అమ్మ కాలు పెంచుకోవటం కోసం అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి, బ్యాంకు లోన్ల సదుపాయం కల్పించి జనంలో వ్యామోహాన్ని పెంచటం రివాజైంది. ద్విచక్ర వాహనాలు సైతం వాయు వేగంతో పోయేలా డిజైన్ చేస్తుంటే...అవి నిండా ఇరవయ్యేళ్లు లేనివారి చేతికొస్తుంటే ప్రమాదాలు జరగటంలో వింతేముంది? రోడ్డు ప్రమాదాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం చొరవ తీసుకుని అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కేరళ, యూపీ, నాగాలాండ్ మినహా మరే రాష్ట్రమూ రహదారి భద్రతకు సంబంధించిన విధానమే రూపొందించుకోలేదని ఆ కమిటీ నివేదిక ఎత్తిచూపింది. డ్రైవింగ్ లైసె న్సుల జారీలో, భద్రతా నిబంధనల అమలులో ప్రభుత్వాలు అలసత్వాన్ని చూపుతున్నాయని చెప్పింది. ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలూ ఈ లోపాలన్నిటినీ సరిదిద్దుకున్నాయో లేదో సందేహమే! తొలి గంటలో చికిత్స ప్రారంభిస్తే గాయపడినవారిలో కనీసం 50 శాతంమందికి ప్రాణాపాయం తప్పుతుందని వైద్య నిపుణులంటున్న మాట. గతంలో అయితే అసలు ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆస్పత్రికి తరలించటానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. పోలీసులు తమనే అనుమాని తులుగా చూస్తారని, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందని చాలామంది భయపడేవారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు మార్చాక ఈ విషయంలో చాలా మార్పువచ్చింది. నగదు రహిత చికిత్స అందించటానికి వీలుకల్పించే చర్య ప్రశంసనీయమైనది. కానీ అంతకన్నా ముందు ప్రమాదా లకు దారితీస్తున్న పరిస్థితుల్ని చక్కదిద్దటానికి ప్రయత్నించాలి. అన్ని స్థాయుల్లో జవాబుదారీతనం నిర్ణయించాలి. అప్పుడుగానీ ప్రమాదాల నియంత్రణ సాధ్యంకాదు.

చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్‌లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.కోటక్ ఫ్యామిలీ ఇప్పటికే ఈ భవనంలోని 24 ఫ్లాట్లలో 13 ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ఫ్లాట్లను రూ. 131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ. 12 కోట్ల నుంచి రూ. 27.59 కోట్లు. మిగిలిన 3 ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా, మొత్తం భవనం విలువ రూ. 400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ. 4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చ.అ ఫ్లాట్ ధర రూ. 38.24 కోట్లు. ఇది ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం.. ముంబై తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది.కోటక్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాట్లను ఒకటిగా చేసి మళ్ళీ రీడెవల్పెమెంట్ ఏమైనా చేస్తుందా?, లేక ఉన్నది ఉన్నట్లుగానే ఉంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన విషయాలను కోటక్ కుటుంబం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్

అప్పుల్లో చంద్రబాబు సర్కార్ రికార్డు
అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు.

IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సీజన్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో కలుపుకుని సూర్య ఇప్పటివరకు మూడు సార్లు (2025 (510*), 2023 (605), 2018 (512)) ఓ సీజన్లో 500 ప్లస్ పరుగులు చేశాడు. సూర్య తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సీజన్లు 500 ప్లస్ పరుగులు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్ (2010, 2011), క్వింటన్ డికాక్‌కు (2019, 2020) దక్కుతుంది. వీరిద్దరు తలో రెండు సార్లు ఈ ఘనత సాధించారు.ఇవాళ (మే 6) గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య ఈ సీజన్లో 500 పరుగుల మార్కును తాకాడు. ఈ మ్యాచ్‌లో సూర్య సీజన్ లీడింగ్ రన్ స్కోరర్‌గానూ అవతరించాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసిన సూర్య సాయి కిషోర్ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సీజన్లో సూర్య 12 మ్యాచ్‌ల్లో 510 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ సాధించే క్రమంలో సూర్య విరాట్‌ను (505) అధిగమించాడు.ఈ సీజన్లో సూర్య చేసిన స్కోర్లు..29(26), 48(28), 27*(9), 67(43), 28(26), 40(28), 26(15), 68*(30), 40*(19), 54(28), 48*(23) & 35(24)ఈ సీజన్లో టాప్-6 లీడింగ్ రన్ స్కోరర్లు..సూర్యకుమార్ యాదవ్-510విరాట్ కోహ్లి- 505సాయి సుదర్శన్- 504యశస్వి జైస్వాల్- 473జోస్ బట్లర్- 470శుభ్‌మన్ గిల్- 465మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. రెండో బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రికెల్టన్ (2) ఔటయ్యాడు. నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ (7) పెవిలియన్‌కు చేరాడు. అనంతరం విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35) కాసేపు నిలకడగా ఆడినా.. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (1), నమన్ ధిర్ (7) ఇలా వచ్చి అలా వెళ్లారు. 16.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 123/7గా ఉంది. కార్బిన్ బాష్ (4), దీపక్ చాహర్ క్రీజ్‌లో ఉన్నారు. పవర్ ప్లేలో గుజరాత్ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలి పెట్టినా ముంబై ఇండియన్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. శుభ్‌మన్ గిల్ మూడు క్యాచ్‌లు పట్టాడు.
20న సుప్రీం బార్ ఎన్నికలు
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
నిలవాలంటే గెలవాలి
ముంబై జోరుకు బ్రేక్
ఓబుళాపురం మైనింగ్ కేసు.. సబిత నిర్దోషి
పసిడి.. మళ్లీ లక్షకు చేరువలో
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
ప్రాణంపోసే నిర్ణయం
ఏ మాయ చేసావె రోజులు గుర్తొచ్చాయి!: సమంత
20న సుప్రీం బార్ ఎన్నికలు
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి
నిలవాలంటే గెలవాలి
ముంబై జోరుకు బ్రేక్
ఓబుళాపురం మైనింగ్ కేసు.. సబిత నిర్దోషి
పసిడి.. మళ్లీ లక్షకు చేరువలో
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
ప్రాణంపోసే నిర్ణయం
ఏ మాయ చేసావె రోజులు గుర్తొచ్చాయి!: సమంత
సినిమా

డ్రగ్స్ కేసు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరెస్ట్
డ్రగ్స్ కేసుల వల్ల మలయాళ చిత్రసీమ హాట్ టాపిక్ అవుతోంది. కొన్నిరోజుల క్రితం ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో.. డ్రగ్స్ వాడుతున్నాడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై కాసేపటికే బెయిల్ పై రిలీజయ్యాడు. వారం క్రితం ఇద్దరు మలయాళ దర్శకుల్ని ఇదే తరహా కేసులో అరెస్ట్ చేశారు. (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)ఇప్పుడు ఈ కేసులో మరో అప్డేట్. అరెస్ట్ అయిన సదరు దర్శకులు ఖలీద్ రెహ్మాన్, అష్రఫ్ హమ్జాతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ సమీర్ తాహిర్ ని కూడా సోమవారం నాడు ఇదే డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లతో ఇతడికి సంబంధం ఉందనే ఆరోపణలతోపాటు ఇతడు అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో వీళ్లు ఉండటం దీనికి కారణం.అయితే తాను అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే విషయం తనకు తెలియదని సమీర్ తాహిర్.. పోలీసులతో చెప్పుకొచ్చాడు. అయినా సరే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం ఇతడిపై కేసు నమోదు చేశారు. కానీ కాసేపటికే ఇతడు కూడా బెయిల్ పై బయటకొచ్చాడు.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)

గుడి కట్టిన అభిమాని.. సమంత ఏమన్నారంటే..
స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో 2023లో ఓ చిన్నపాటి విగ్రహంతో ఈ గుడిని నిర్మించారు. ఇటీవల ఆ గుడిలో గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టి.. సమంత బర్త్‌డే(ఏప్రిల్ 28) నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా గుడి విషయంపై సమంత స్పందించారు. గుడి కట్టిన విషయం తెలియగానే హ్యాపీగా ఫీలయ్యా కానీ..ఇలాంటి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. అభిమాని గుడి కట్టిన విషయంపై స్పందించారు. అభిమాని నా పట్ల ఇంత ప్రేమ చూపించడం తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అయితే, నేను ఇలాంటి చర్యలను ప్రోత్సహించను. అభిమానులు తమ ప్రేమను సానుకూల మార్గాల్లో, సమాజానికి మేలు చేసే విధంగా చూపించాలని కోరుకుంటాను," అని అన్నారు. సమంత ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇక శుభం విషయానికొస్తే.. సమంత నిర్మించిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ సినిమా
పుష్ప సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైన నటుడు ఫహాద్ ఫాజిల్.. ఆయన విలన్‌గా నటించిన 'ఇరుల్' మలయాళ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. అపరాధి టైటిల్‌తో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుంది. 2021లో విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించారు. ఫహద్ ఫాసిల్‌తో పాటు సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ వంటి వారు ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, ప్లాన్ జె స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే మలయాళ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.అపరాధి పేరుతో డైరెక్ట్‌గా ఆహా తెలుగు ఓటీటీలో ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అపరాధి సినిమా మొత్తం ఒకే ఇంట్లో కేవలం మూడు పాత్రలతోనే చాలా సస్పెన్స్‌గా జరుగుతుంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్లో కనిపించాడు. 2021లో కొవిడ్ కారణంగా ఈ చిత్రం డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ వర్షన్ విడుదలైంది. అప్పట్లో చాలామంది సబ్‌టైటిల్స్‌తో ఈ మూవీని చూశారు. ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 91 నిమిషాలే కావడం విశేషం.ఒక ప్రేమజంట జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో ఈ చిత్రం చెబుతుంది. కేవలం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేసి ఓటీటీలో విడుదల చేశారు. ప్రేక్షకులను ప్రతి క్షణం సస్పెన్స్‌కు గురిచేసే ఈ చిత్రం సుమారు నాలుగేళ్ల తర్వాత తెలుగులో విడుదల కానుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin)

మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!
మహేశ్ బాబు తన ఇంట్లో నుంచి కొత్త హీరోని లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యాడట. ఏంటి మహేశ్ కొడుకు గౌతమ్ ని అప్పుడే హీరోగా పరిచయం చేస్తున్నారా? ఇదంతా ఎప్పుడు జరిగింది? అని అనుకుంటున్నారా? ఇంతకీ సంగతి ఏంటంటే?సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు హీరో అయ్యాడు. ఒక్కో సినిమా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకు ముందు కృష్ణ పెద్ద కొడుకు, మహేశ్ కి అన్నయ్య అయిన రమేశ్ బాబు కూడా హీరోగా పలు చిత్రాలు చేశారు గానీ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. తర్వాత వ్యాపారాలు చూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) రమేశ్ బాబుకి జయకృష్ణ అని ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయినే హీరోగా లాంచ్ చేసే ప్లాన్ లో మహేశ్ ఉన్నాడని తెలుస్తోంది. ఇందుకోసం 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాల ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతిని తీసుకున్నారని సమాచారం.మహేశ్ బాబుని లాంచ్ చేసిన నిర్మాత అశ్వనీదత్.. జయకృష్ణని కూడా హీరోగా పరిచయం చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం అంతా ఫిక్స్ అయినప్పటికీ, త్వరలో ఈ విషయమై క్లారిటీ ఇస్తారు. ఇకపోతే మహేశ్.. రాజమౌళి సినిమా బిజీలో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ కి విరామం ప్రకటించడంతో జయకృష్ణ లాంచింగ్ పనులు చూస్తున్నారట.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)
న్యూస్ పాడ్‌కాస్ట్

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.
క్రీడలు

టోర్నీ మధ్యలో వైదొలిగిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్‌లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక కూడా మూడింట రెండు విజయాలు సాధించి, రన్‌రేట్ విషయంలో భారత్ కంటే వెనుకపడి ఉండటంతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. శ్రీలంక మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ మే 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఆతర్వాత మే 9న శ్రీలంక, సౌతాఫ్రికా తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్‌కు ఎదురుదెబ్బసౌతాఫ్రికాతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీలోనే అరంగేట్రం చేసిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కశ్వీ గౌతమ్ గాయం బారిన పడింది. ఈ కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ సందర్భంగా కశ్వీ కాలికి గాయమైంది. కశ్వీ స్థానాన్ని అన్ క్యాప్డ్ పేసర్ క్రాంతి గౌడ్‌తో రీప్లేస్ చేశారు భారత సెలెక్టర్లు. కశ్వీ గత డబ్ల్యూపీఎల్ సీజన్లో విశేషంగా రాణించి టీమిండియాలో స్థానం సంపాదించింది. కశ్వీ డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినథ్యం వహిస్తుంది.

MI VS GT Live Updates: .. ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ విజయం
ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ విజయం సాధించింది. వర్షం అంతరాయం వల్ల 19 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. చివరి ఓవర్లో లక్ష్యం 15 పరుగులు కాగా వర్షం కారణంగా DLS పద్ధతిలో 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే వర్షం పడటంతో మరోసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. తిరిగి మొదలైన మ్యాచ్.. లక్ష్యానికి చేరువగా గుజరాత్14 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. తిరిగి అర్ద గంట తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది.గుజరాత్ లక్ష్యానికి చేరువగా ఉంది. 14 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయంవర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలుపు దిశగా సాగుతుంది. గుజరాత్ గెలవాలంటే 36 బంతుల్లో 48 పరుగులు చేయాలి. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/214 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్11.3వ ఓవర్- 78 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (30) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/110 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/1గా ఉంది. గిల్ 28, బట్లర్ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 156.. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 29/1156 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. ఆదిలోనే వికెట్ కోల్పోవడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/1గా ఉంది. గిల్ (12) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బట్లర్ 10 పరుగులతో అతనికి జతగా ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్1.2వ ఓవర్- 156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికల్టెన్కు క్యాచ్ ఇచ్చి ఇన్ఫామ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (5) ఔటయ్యాడు. సత్తా చాటిన గుజరాత్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబైటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్ ముంబైని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. గుజరాత్ బౌలర్లందరూ సత్తా చాటడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35), కార్బిన్ బాష్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో బాష్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా సాధించలేకపోయేది. ఏడో వికెట్ కోల్పోయిన ముంబై16.2వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి నమన్ ధిర్ (7) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన ముంబై13.5వ ఓవర్- 113 పరుగుల వద్ద ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (7) ఔటయ్యాడు. కష్టాల్లో ముంబై ఇండియన్స్12.3వ ఓవర్- 106 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (1) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై11.4వ ఓవర్- 103 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి విల్ జాక్స్ (53) ఔటయ్యాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో సాయి సుదర్శన్ క్యాచ్ పట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై10.4వ ఓవర్- 97 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (35) ఔటయ్యాడు.10 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/210 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (34), విల్ జాక్స్ (45) క్రీజ్‌లో ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/2గా ఉంది. విల్ జాక్స్ 30, సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జాక్స్‌కు 0, 29 పరుగుల వద్ద రెండు లైఫ్స్ లభించాయి. సాయి సుదర్శన్, సిరాజ్ చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు వదిలేశారు. రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్3.3వ ఓవర్- ముంబై ఇండియన్స్ 26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (7) ఔటయ్యాడు. రెండో బంతికే వికెట్ తీసిన సిరాజ్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ రెండో బంతికే ముంబైని దెబ్బకొట్టింది. సిరాజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ఇన్ ఫామ్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ (2) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 6) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఓ మార్పు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతుంది. గుజరాత్ తరఫున వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణఇంపాక్ట్ సబ్‌లు: వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దాసున్ షనక, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, రాజ్ బావా, రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, అశ్వనీ కుమార్

ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు.. రోహిత్ శర్మకు నో ప్లేస్
ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ దిగ్గజాలు ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ తమ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో వారు ఏడుగురు భారత ప్లేయర్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటిచ్చారు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.🚨 G.O.A.T #IPL XI alert 🚨@gilly381 & @7polly7 build their best #IPL XI, right here#IPL2025 #ViratKohli #MSDhoni @myvoltas pic.twitter.com/NolGsfGAZ8— Cricbuzz (@cricbuzz) May 6, 2025ఈ జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లిని ఎంపిక చేశారు. విదేశీ ప్లేయర్ల ఎంపికలో గిల్‌క్రిస్ట్ క్రిస్ గేల్ పేరు ప్రతిపాదించగా.. పొలాక్ ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. ఏబీడి ఆధునిక టీ20 బ్యాటింగ్‌కు ఆధ్యుడని పొలాక్ ప్రశంసించాడు. మిగిలిన రెండు విదేశీ ఆటగాళ్ల బెర్త్‌ల కోసం గిల్‌క్రిస్ట్, పొలాక్ కలిసి లసిత్ మలింగ, సునీల్ నరైన్ పేర్లను ప్రతిపాదించారు. బౌలింగ్ ఎరీనాలో మలింగ 'గోట్' అని పొలాక్ కీర్తించాడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ కంటే సునీల్ నరైనే మోస్ట్ వ్యాల్యుయబుల్ ప్లేయర్ అని పొలాక్ అభిప్రాయపడ్డాడు.వన్‌డౌన్‌లో బ్యాటింగ్ కోసం గిల్‌క్రిస్ట్, పొలాక్ కలిసి సురేశ్ రైనాను ఎంపిక చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఏబీడిని ఎంచుకున్నారు. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఆరో స్థానంలో ఎంఎస్ ధోని, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, సునీల్ నరైన్‌ను ఎంపిక చేశారు. పేస్ బౌలర్లుగా మలింగ, బుమ్రా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చహల్‌ను ఎంపిక చేశారు.ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ కలిసి ఎంపిక చేసిన ఐపీఎల్ ఆల్ టైమ్ XI: క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోని (కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.

IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఘెరంగా విఫలమవుతున్న ఆటగాళ్లతో ఓ జట్టును రూపొందించింది ఐస్‌ల్యాండ్ క్రికెట్. ఈ జట్టుకు సారధిగా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఐపీఎల్ 2025 మోసగాళ్లు, స్కామర్ల జట్టని నామకరణం చేసింది. ఈ జట్టులో రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, లియామ్ లివింగ్‌స్టోన్, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, మతీష పతిరణ, మహ్మద్ షమీకి చోటు కల్పించింది. పంత్‌ను కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది. ఈ జట్టును నిన్న తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.On a rain day in Reyjavík, we give you our IPL 2025 frauds and scammers team:R TripathiR RavindraI KishanR Pant (c & wk)V IyerG MaxwellL LivingstoneD HoodaR AshwinM PathiranaM ShamiNo impact player: M Kumar— Iceland Cricket (@icelandcricket) May 5, 2025ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎంపిక చేసిన ఈ టీమ్‌పై సోషల్‌మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. నిజంగానే వీరు స్కామర్లు, మోసగాళ్లు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కోట్లలో డబ్బు తీసుకుని కనీస వందల విలువ చేసే ప్రదర్శన కూడా చేయలేకపోతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొందరేమే ఆటగాళ్లు ఎలా ఆడినా ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఇలాంటి విమర్శలు చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. కాగా, ఐస్‌ల్యాండ్ క్రికెట్‌కు ఇలాంటి వివాదాస్పద పోస్ట్‌లు చేయడం కొత్తేమీ కాదు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై గతంలో చాలా సందర్భాల్లో వ్యంగ్యంగా స్పందించింది.ఇదిలా ఉంటే, మోసగాళ్లు.. స్కామర్లు అంటూ ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఐపీఎల్ ఆటగాళ్లను విమర్శించడం సరి కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయాన్ని పక్కన పెడితే, ఐస్‌ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన జట్టులోని ఆటగాళ్లుందరూ తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారన్నది కాదనలేని సత్యం. రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు 20 కోట్లకు పైగా మొత్తాన్ని తీసుకున్నా కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. మిగతా ఆటగాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్ లాంటి విదేశీ ఆటగాళ్లయితే ఏదో హాలిడేకి వచ్చామన్నట్లు ఐపీఎల్‌ను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇషాన్ కిషన్, షమీపై వారి ఫ్రాంచైజీ ఎంతో నమ్మకముంచితే వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. అశ్విన్ అయితే తనకున్న ఘన చరిత్రను చెత్త ప్రదర్శనలతో దిగజార్చుకున్నాడు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా లాంటి వారు కోట్లు మింగి గల్లీ క్రికెటర్ల కంటే హీనమైన క్రికెట్‌ను ఆడుతున్నారు.రాహుల్ త్రిపాఠి- 3.4 కోట్లురచిన్ రవీంద్ర- 4 కోట్లుఇషాన్ కిషన్- 11.25దీపక్ హుడా- 1.7 కోట్లురిషబ్ పంత్- 27 కోట్లువెంకటేశ్ అయ్యర్- 23.75గ్లెన్ మ్యాక్స్‌వెల్- 4.2 కోట్లులియామ్ లివింగ్‌స్టోన్- 8.75 కోట్లురవిచంద్రన్ అశ్విన్- 9.75 కోట్లుమతీష పతిరణ- 13 కోట్లుమహ్మద్ షమీ- 10 కోట్లు
బిజినెస్

టీ రూ.10.. సమోసా, కాఫీ రూ.20: ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ ధరల్లో..
టీ రూ.10, కాఫీ రూ.20 అనే ధరలు వింటుంటే ఆ ఏముంది? రోడ్డు పక్కన టీ బండిలో రేట్లు అవే కదా అందులో వింతేముంది?.. అనిపించవచ్చు కానీ... ఆ రేట్లు ఎయిర్‌పోర్ట్‌లోని కేఫ్‌లో అంటే..మాత్రం విస్తుపోవాల్సిందే. అవును మరి.. రాబోయే కొన్నేళ్లలో విమానాలు ఎక్కని వారు అంటూ ఉండరేమో కానీ.. విమానాశ్రయాల్లో టీ కూడా తాగని వారు మాత్రం బోలెడంత మంది ఉంటారేమో అనే అంచనాలు ఉండేవి. ఎందుకంటే..రాను రాను విమానయానం అందుబాటులోకి వస్తోంది. కానీ ఎయిర్‌పోర్ట్స్‌లో కనీసం టీ కూడా అందుబాటు ధరలో ఉండడం లేదు కాబట్టి.అడపాదడపా ఎయిర్‌లైన్స్ వాళ్లు అందించే ఆఫర్లు ఒక్కోసారి రైలు ఛార్జీల కన్నా కూడా తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల సామాన్యులకు కూడా విమాన ప్రయాణం సాధ్యమవుతోంది. కానీ విమానాశ్రయాల్లో కాసింత సేద తీరాలని టీ, కాఫీ లాంటివి తాగాలనుకున్నా, సమోసా, బిస్కెట్స్ వంటి చిరు తిండి తినాలన్నా అదేదో పెద్ద కలలాగా మారింది. ఎందుకంటే ఆ ధరల పట్టీ ఇంకా సామాన్యులకు అందనంత దూరంలోనే ఉంది. మన శంషాబాద్ విమానాశ్రయాల వంటి చోట అయితే కేఫ్స్‌లో ధరలు చూస్తే విమానం ఎక్కకుండానే కళ్లు తిరుగుతాయ్.రకరకాల అవకాశాలవల్ల.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనో విమాన ప్రయాణం చేయాల్సిన అవసరం ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా తప్పడం లేదు. అయినప్పటికీ విమాన ప్రయాణీకులు అంటేనే సంపన్నులు అనే రీతిలో ఈ ధరలు ఉండడం సామాన్యులకు మింగుడు పడని పరిస్థితి.ఈ నేపథ్యంలో పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం సరికొత్తగా ‘ఉడాన్ యాత్రి కేఫే’ అనే సేవను ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఇప్పటికి ఎదురు చూసిన రోజులు ముగిశాయి టీ రూ.10, కాఫీ రూ.20 కి పూణే విమానాశ్రయంలో అందుబాటులోకి రాబోతున్నాయి,‘ అని ఆయన ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు ఐదేళ్లు జైలు శిక్షప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ కేఫేని ఏర్పాటు చేశారు.. ఈ కేఫే లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే పూణే విమానాశ్రయంలో, ఈ విధంగా తక్కువ ధరలకు అధిక నాణ్యత గల ఆహార పదార్థాలు అందుబాటులోకి రావడం ఒక సమయోచిత మార్పుగా భావిస్తున్నారు ప్రయాణికులు. సమోసా తదితర తినుబండారాలు సైతం రూ.20 ధరల్లో అందిస్తున్న ఈ కేఫ్స్ కోల్‌కతా, చెన్నై, ముంబయిలలో కూడా సేవలు అందిస్తున్నాయి. విమానాశ్రయాలు సంపన్నులుకు తప్ప సామన్యులకు కావనే అభిప్రాయాలను మార్చేలా, అత్యధిక జనాభాకు ఉపయోగపడేలా ఇలాంటి మార్పులు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో రావాలని సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్నారు.

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 155.77 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 80,641.07 వద్ద, నిఫ్టీ 81.55 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 24,379.60 వద్ద నిలిచాయి.సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా, ఓరియంట్ బెల్, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, పాలీ మెడిక్యూర్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సెంచరీ ఎంకా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కేసాల్వ్స్ ఇండియా, ప్రైమ్ ఫోకస్, ఓరియంటల్ హోటల్స్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

అమ్మకాల్లో దేశీయ దిగ్గజాల హవా!.. ఏప్రిల్‌లో కార్ సేల్స్ ఇలా..
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో కార్ల తయారీ దిగ్గజం 'మారుతి సుజుకి ఇండియా వాటా ఏప్రిల్‌లో 40 శాతం లోపునకు పడిపోయింది. 1,38,021 వాహన విక్రయాలతో 39.44 శాతానికి పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో 1,39,173 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 40.39 శాతం మార్కెట్ వాటా నమోదు చేసింది.ఆటోమోటివ్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం భారీ స్థాయిలో ఎస్యూవీ విక్రయాలతో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఏప్రిల్‌లో అత్యధికంగా లబ్ధి పొందింది. నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.కంపెనీ అమ్మకాలు 38,696 యూనిట్ల నుంచి 48,405 యూనిట్లకు పెరగడంతో.. మార్కెట్ వాటా 11.23 శాతం నుంచి 13.83 శాతానికి పెరిగింది. ఇక సుదీర్ఘకాలంగా రెండో స్థానంలో కొనసాగుతూ వస్తున్న హ్యుందాయ్ మోటార్స్ (హెచ్ఎంఐఎల్) 43,642 యూనిట్ల అమ్మకాలు, 12.47 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానానికి పడిపోయింది. టాటా మోటార్స్ 44,065 వాహన విక్రయాలతో మూడో స్థానంలో కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయంగా మొత్తం వాహన విక్రయాలు 3,44,594 యూనిట్ల నుంచి 1.55 శాతం వృద్ధితో 3,49,939 యూనిట్లకు చేరాయి.2024–25 పూర్తి సంవత్సర వివరాలు..➤గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 16,71,559 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ 40.25 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. 2023–24లో 16,08,041 వాహనాలు విక్రయించగా, మార్కెట్ షేర్ 40.6 శాతంగా నమోదైంది.➤హెచ్ఎంఐఎల్ 5,59,149 యూనిట్లు, 13.46 శాతం మార్కెట్ వాటాతో 2024–25లో మారుతీ తర్వాత రెండో స్థానంలో ఉంది. 2023–24లో 5,62,865 వాహన విక్రయాలు, 14.21 శాతం వాటాను సాధించింది.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!➤టాటా మోటార్స్ 5,35,960 యూనిట్లు విక్రయాలు, 12.9 శాతం వాటాతో మూడో స్థానంలో కొనసాగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 5,39,567 యూనిట్లు కాగా, మార్కెట్ వాటా 13.62 శాతం. ➤5,12,626 యూనిట్ల అమ్మకాలు, 12.34 శాతం మార్కెట్ వాటాతో ఎంఅండ్ఎం నాలుగో స్థానంలో నిలి్చంది. 2023–24లో కంపెనీ రిటైల్ అమ్మకాలు 4,27,390 యూనిట్లు కాగా, మార్కెట్ వాటా 10.79 శాతంగా ఉంది.

దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలు
భారత్‌లో ఉద్యోగుల ప్రాధాన్యాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఓఎన్ 2025 ఎంప్లాయ్ సెంటిమెంట్ స్టడీ ప్రకారం ఈ ఏడాది దేశంలో 82 శాతం మంది తాము చేస్తున్న సంస్థలు మారాలని భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 60 శాతంగా ఉంది. మెరుగైన పనిప్రాంత ప్రయోజనాలు, కెరీర్ అవకాశాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ధోరణి నొక్కి చెబుతుంది.ప్రయోజనాలకే ప్రాధాన్యతఏఓన్ రిపోర్ట్‌లోని అంశాల ప్రకారం.. భారతీయ ఉద్యోగులు 76 శాతం మంది తమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న వెసులుబాట్లను విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగులకు కోరుకునే ఐదు అత్యంత విలువైన ప్రయోజనాలను విశ్లేషించింది.వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్‌లు: ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్లు, రిమోట్ వర్క్ ఆప్షన్ల కోసం ఉద్యోగులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.మెడికల్ కవరేజ్: ఆసుపత్రిలో చేరడం, అవుట్ పేషెంట్ సేవలు వంటి ఆరోగ్య సంరక్షణ చర్యలు మెరుగ్గా ఉన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు: ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతోపాటు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మెంటార్షిప్, లీడర్ షిప్ ట్రైనింగ్ వంటి సదుపాయాలు కోరుకుంటున్నారు.వేతనంతో కూడిన సెలవులు: పెయిడ్ సెలవులు, పేరెంటల్ లీవ్, వెకేషన్ల కోసం సెలవులు ఇచ్చే కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు.రిటైర్మెంట్ పొదుపు పథకాలు: పెన్షన్ పథకాలు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి పెట్టుబడి అవకాశాలకు పెద్దపీట వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మంది ఉద్యోగులతో పోలిస్తే భారత్‌లో కేవలం 7 శాతం మంది మాత్రమే తక్కువ సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే భావనతో ఉంటున్నారు.వైద్య కవరేజ్ తరతరాలుగా అత్యధిక విలువ కలిగిన ప్రయోజనాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. జెన్ ఎక్స్(1965-80 మధ్య జన్మించినవారు), జెన్ వై(1980-1995 మధ్య జన్మించినవారు) జెన్ జెడ్(1995-2005 మధ్య జన్మించినవారు) కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జెన్ జెడ్ ఉద్యోగులు వర్క్-లైఫ్ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.వెల్నెస్ ప్రోగ్రామ్‌లకు ప్రాముఖ్యతకొవిడ్ తర్వాత కంపెనీలు తమ బ్రాండ్‌ను రూపొందించడంలో వెల్నెస్ ప్రోగ్రామ్‌ల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయని ఏఓఎన్లోని టాలెంట్ సొల్యూషన్స్ ఫర్ ఇండియా హెడ్ నితిన్ సేథీ పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్యం, వెల్నెస్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సొల్యూషన్స్‌ను తమ పాలసీల్లో పొందుపరిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగులను నిలుపుకోవడానికి, టాప్ టాలెంట్‌ను ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుందని చెప్పారు.యువ నిపుణుల్లో పదవీ విరమణ, ఆర్థిక ప్రణాళిక అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని ఏఓఎన్ హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిసిల్వా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్న వేతనాల ఆందోళనలే ఈ మార్పుకు కారణమని చెప్పారు. ఇది ఉద్యోగులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టడానికి దారితీస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేతఅభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి 43% మంది భారతీయ ఉద్యోగులు తమ ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఏఓఎన్ అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి 35 శాతంగా ఉంది. 10 శాతం మంది ఉద్యోగులు తమ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం వారి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు.
ఫ్యామిలీ

తొలి ‘జన్యుసవరణ’ వరి!
వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకుంటూ 30% అధిక దిగుబడిని ఇవ్వగలిగిన రెండు సరికొత్త జన్యుసవరణ వరి రకాలను ప్రపంచంలోనే తొట్టతొలిగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) శాస్త్రవేత్తలు రూపొందించారు. క్రిస్పర్– కాస్9 అనే సరికొత్త జీనోమ్–ఎడిటింగ్(జిఇ) టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన రెండు వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కి చెందిన పూసాలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) పూసా రైస్ డిఎస్టి1 అనే రకం కరువును, చౌడును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) పరిశోధకులు అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100 (కమల) అనే వరి అధిక దిగుబడినిస్తుంది. మన దేశంలో ఇప్పటి వరకు అధికారికంగా సాగులో ఉన్న జన్యుమార్పిడి పంట పత్తి ఒక్కటి మాత్రమే. జన్యుసవరణకు ఇదే ్ప్రారంభం. గతంలో సంక్లిష్టమైన ‘జన్యుమార్పిడి’లో భాగంగానే ‘జన్యుసవరణ’ను కూడా చూసేవారు. అయితే, 2022లో జన్యుసవరణను కఠినమైన నియంత్రణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత జన్యు సవరణ పరిశోధనలకు రూ. 500 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే జన్యుసవరణ తొలి వరి రకాలను ఇప్పుడు ఆవిష్కరించారు. ఈ రెండు వంగడాల పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సత్కరించారు. పూసా డిఎస్టి రైస్ 1 పై కృషి చేసిన డాక్టర్ విశ్వనాథన్ సి, డాక్టర్ గోపాల్ కృష్ణన్ ఎస్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ శివానీ నగర్, డాక్టర్ అర్చన వాట్స్, డాక్టర్ సోహం రే, డాక్టర్ అశోక్ కుమార్ సింగ్, డాక్టర్ ్ప్రాంజల్ యాదవ్‌లను సత్కరించారు. డిఆర్ఆర్ రైస్ 100 (కమల) అభివృద్ధికి కృషి చేసిన ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సత్యేంద్ర కుమార్ మంగథియా, డాక్టర్ ఆర్.ఎం. సుందరం, డా. అబ్దుల్ ఫియాజ్, డా. సి.ఎన్. నీరజ, డా. ఎస్వీ సాయి ప్రసాద్‌లను సత్కరించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది మాట్లాడుతూ, ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినది కావటం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రయత్నాల ద్వారా రైతులకు త్వరగా అందించవచ్చని అన్నారు.10కి పైగా పంటలకు జన్యు సవరణఐసిఎఆర్ డైరెక్టర్ డాక్టర్ జనరల్ మంగి లాల్ జాట్ ప్రసంగిస్తూ ఈ రెండు వంగడాల ఆవిష్కరణ భారత వ్యవసాయంలో ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. రాబోయే సంవత్సరాల్లో అనేక ఇతర పంటలకు సంబంధించి జన్యు సవరణ పంట రకాలను విడుదల చేస్తామని అన్నారు. ‘కొత్త వ్యవసాయ విధానాలు కొత్త పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. మారిన వాతావరణ పరిస్థితుల్లో పాత పద్ధతులు పనిచేయవు’ అని ఆయన అన్నారు. దేశంలోని బహుళ జాతి సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పప్పుధాన్యాలు, ఆవాలు, గోధుమ, ΄÷గాకు, పత్తి, అరటి, టమోటా, నూనెగింజలు వంటి 10కి పైగా పంటలకు సంబంధించి జన్యు–సవరణపై పరిశోధనలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ చైర్ ఆఫ్ అగ్రికల్చర్ – ఫుడ్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ క్రాప్ అండ్ ఫుడ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ రాజీవ్ వర్షిణి మాట్లాడుతూ, ఈ ఆవిష్కరణలు వ్యవసాయ జీవసాంకేతికతలో ఒక మైలురాయన్నారు. ప్రత్యేకంగా చిన్న–సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని, ప్రపంచ పురోగతికి ప్రేరణనిస్తాయని అన్నారు. ఈ రెండు జన్యు సవరణ వంగడాలను వాణిజ్య స్థాయిలో విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించడానికి మరో నాలుగైదు సంవత్సరాలు పట్టొచ్చు. కరువు, చౌడును అధిగమించి..ఎంటియు1010 వరి వంగడానికి జన్యు సవరణ చేసి ‘పూసా రైస్ డిఎస్టి 1’ వంగడాన్ని పూసాలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) అభివృద్ధి చేసింది. ఒత్తిడి నిరోధకతను అణిచివేసే జన్యువును తొలగించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. పత్ర రంధ్రాల సాంద్రతను తగ్గించటం ద్వారా తక్కువ నీటితో పంట పండేలా మార్పు చేశారు. చౌడును తట్టుకొని ఎక్కువ పిలకలు వచ్చేలా చేయటం ద్వారా అధికంగా ధాన్యం దిగుబడి వచ్చేలా చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల్లో ఎంటియు 1010 రకంతో ΄ోలిస్తే కరువు, చౌడు వత్తిళ్లను తట్టుకొని గణనీయంగా అధిక దిగుబడిని చూపించాయని ఐఎఆర్ఐ తెలిపింది.సాంబ మసూరికి కొత్త రూపుదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది, విస్తారంగా సాగవుతున్న సాంబ మసూరి (బిపిటి–5204) వంగడానికి జన్యుసవరణ చేసి ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకాన్ని అభివృద్ధి చేశారు. రాజేంద్రనగర్‌లోని 30% అధిక దిగుబడిని ఇస్తుంది. 20 రోజులు ముందే కోతకు వస్తుంది. ‘క్రిస్పర్’ను ఉపయోగించి సాంబ మసూరిలోని సైటోకినిన్ ఆక్సిడేస్ జన్యువుకు తగిన విధంగా సవరణ చేశారు. ఫలితంగా ధాన్యం దిగుబడిలో 19% పెరుగుదల, 20 రోజుల వరకు ముందస్తు పరిపక్వతతో పాటు తక్కువ ఎరువుల వినియోగం, కరువు పరిస్థితులలో మెరుగైన పనితీరు వంటి గుణాలతో ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకం రూపుదాల్చింది.ఐసిఎఆర్ శాస్త్రవేత్తల అసాధారణ విజయాలువ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి ఆధునిక పద్ధతులను అవలంభించాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఆయన మాటల నుంచి ప్రేరణ పొందిన ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు ఈ కొత్త రకాలను సృష్టించడం ద్వారా వ్యవసాయ రంగంలో అసాధారణ విజయాలు సాధించారు. వరిలో ఈ కొత్త పంటలు ధాన్యం ఉత్పత్తిని పెంచడమే కాకుండా పర్యావరణ పరంగా సానుకూల ఫలితాలను ఇస్తాయి. సాగు నీరు ఆదా అవుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. తద్వారా పర్యావరణంపై ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా వరి సాగు విస్తీర్ణాన్ని 50 లక్షల హెక్టార్లు తగ్గించాలి. ధాన్యం ఉత్పత్తిని కోటి టన్నులు పెంచాలి. ఈ 50 లక్షల హెక్టార్ల భూముల్లో అదనంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చెయ్యాలి.– శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిజన్యుభద్రతా పరీక్షల గణాంకాలను కూడా ప్రకటించాలిఐసిఎఆర్ మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను విడుదల చేసింది. అధిక దిగుబడినిస్తూ, కరువును తట్టుకోవటం కోసం సరికొత్త క్రిస్పర్–కాస్9 టెక్నాలజీని వినియోగించి ఈ రకాలను అభివృద్ధి చేశారు. వీటికి సంబంధించిన జన్యుభద్రతా పరీక్షల గణాంకాలను సైతం బహిరంగంగా ప్రకటిస్తే ఈ సరికొత్త వరి బియ్యం తినటంలో భద్రత గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారు. – డాక్టర్ సుమన్ సహాయ్, స్వతంత్ర శాస్త్రవేత్త, జీన్క్యాంపెయిన్ వ్యవస్థాపకులు

పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా !
పేరెంట్‌హుడ్‌ని ఆస్వాదించని వారెవరు? అమ్మా.. నాన్నా.. అని పిలిపించుకోవాలని ఉవ్విళ్లూరని వాళ్లెవరు? కానీ మన దేశంలోని సరోగసీ యాక్ట్ –2021 అందరికీ ఆ ఆవకాశాన్నివ్వట్లేదు. విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్పీపుల్కి సరోగసీ ద్వారా పేరెంట్ అయ్యే చాన్స్‌కి నో అంటోంది! దీన్నే సవాలు చేస్తూ కర్ణాటకకు చెందిన 45 ఏళ్ల డెంటల్ సర్జన్.. సరోగసీ ద్వారా ఒంటరి పురుషులకూ తండ్రి అయ్యే భాగ్యం కల్పించమంటూ సుప్రీంకోర్ట్‌లో దావా వేశాడు. ఇప్పుడది చర్చగా మారింది.. అడ్వకేట్లు, జెండర్ రైట్స్ కోసం పనిచేస్తున్న యాక్టివిస్ట్లూ దీనిమీద తమ అభిప్రాయాలను చెబుతున్నారు.సరోగసీ.. గర్భంలో బిడ్డను మోసే ఆరోగ్యపరిస్థితులు లేని వాళ్లకు ఆధునిక వైద్యశాస్త్రం అందించిన వరం! ఇది ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్‌కీ పేరెంట్ అయ్యే అదృష్టాన్ని కలిగిస్తోంది. అలా బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. అలాగే నటుడు తుషార్ కపూర్ కూడా ఓ బిడ్డను కన్నాడు. అయితే అది 2021కి ముందు. ఈ చట్టం వచ్చాక పురుషులకు ఆ వెసులుబాటును తీసేసింది. ఒంటరి మహిళలు (విడాకులు పొందిన వారు, అలాగే వితంతువులు), స్త్రీ పురుషులు మాత్రమే పెళ్లి చేసుకున్న జంటలకూ మాత్రమే ఈ చట్టం పేరెంట్స్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిమీద సమాజంలోని పురుషులు సహా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలోనూ అసంతృప్తి ఉంది. విడాకులు పొందిన స్త్రీకి సరోగసీ ద్వారా తల్లి అయ్యే హక్కు ఉన్నప్పుడు, విడాకులు పొందిన పురుషుడికి ఎందుకు ఉండకూడదు? ఇది చట్టం చూపిస్తున్న వివక్ష తప్ప ఇంకోటి కాదని కర్ణాటక డెంటల్ సర్జన్ వాదన. పిల్లల్ని కనాలా వద్దా అనే చాయిస్ స్త్రీకెప్పుడూ ఇవ్వని ఈ సమాజంలో.. ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్ని అనుమతించడం లేదు సరికదా... పురుషుడు సంపాదించాలి, స్త్రీ ఇంటిని చూసుకోవాలనే లింగవివక్షను ప్రేరేపించే మూస ధోరణిని ప్రోత్సహిస్తోందని జెండర్ యాక్టివిస్ట్‌ల అభి్ప్రాయం. కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) నివేదికలను బట్టి ఒంటరి పురుషులకు దత్తత తీసుకునేందుకు అనుమతించినవీ, అలాగే.. మగవాళ్లు కూడా పిల్లల్ని పెంచగలరని నిరూపించిన ఉదాహరణలున్నాయి. కాబట్టి డెంటల్ సర్జన్ పిటిషన్లో న్యాయం ఉందని అంటున్నారు యాక్టివిస్ట్‌లు. అంతేకాదు అతని ఈ ΄ోరాటం ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి ఒక ఊతమవుతుందని.. లింగ అసమానతలను రూపుమాపే ప్రయత్నానికీ ఒక అడుగు పడుతుందనే ఆశనూ వ్యక్తం చేస్తున్నారు. – సరస్వతి రమవివక్ష చూపిస్తోందిడైవర్స్ తీసుకున్న మగవారికి, ఒంటరి పురుషులకు, స్వలింగ సంపర్కులకు, ట్రాన్స్ జెండర్స్‌కి సరోగసి పద్ధతిలో పిల్లలని కనడాన్ని సరోగసీ చట్టం నిషేధించింది. ఈ చట్టంలోని సెక్షన్ ంలు ఈ నిబంధన విధించాయి. ఈ చట్టం ప్రకారం కేవలం విడాకులు పొందిన లేదా వితంతువులకు, హెటిరో సెక్సువల్ దంపతులకు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలని కనే హక్కు ఉంది. ఒంటరి పురుషుడికి ఆడపిల్లను దత్తత తీసుకునే వీలు లేనప్పటికీ, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 57, హిందూ అడాప్షన్ – మెయింటెనెన్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఒంటరి/విడాకులు తీసుకున్న పురుషుడికి కూడా పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉన్నది. సరోగసీ చట్టం ఇందుకు భిన్నంగా ఉండటం రాజ్యాంగం కల్పించిన సమానత్వం, జీవించే స్వేచ్ఛ హక్కుల స్ఫూర్తికి వ్యతిరేకమే! ఇతర దేశాలు చాలామటుకు స్త్రీ పురుషుల మధ్య సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనటం పై సమాన హక్కులే కల్పించాయి. –శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిఆ అవకాశం, వాతావరణం ఉన్నాయా? ప్రతి ఒక్కరికీ పేరెంట్‌హుడ్‌ను ఆస్వాదించే హక్కు ఉంది. ఆ హక్కు కోసం కర్ణాటక డెంటల్ సర్జన్ న్యాయ ΄ోరాటంలో తప్పులేదు. స΄ోర్ట్ కూడా చేస్తాను. అయితే వ్యక్తిగతంగా మాత్రం అందులో నాకు భిన్నమైన అభి్ప్రాయం ఉంది. అడుగడుగునా అసమానతలు, వివక్ష, అభద్రతలున్న ఈ సమాజంలో పుట్టబోయే పిల్లలను భద్రంగా కాపాడుకోగలమా? మనముందున్న సెక్సువల్ ఐడెంటిటీలనే గుర్తించి, గౌరవించడానికి సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో పుట్టబోయే పిల్లల భవిష్యత్ ఏంటీ? వాళ్లు చక్కగా పెరిగే అవకాశం, వాతావరణం ఉన్నాయా అనే విషయంలోనే నా భయం, ఆందోళన అంతా! – బోయపాటి విష్ణు తేజ, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్టీరియోటైప్స్ని బలపరుస్తోంది.. పేరెంట్‌హుడ్ అనేది ఒక జెండర్‌కి మాత్రమే పరిమితమైనది కాదు. పేరెంట్ అవ్వాలని ఆశపడేవాళ్లందరూ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలి. కొంతమంది మగవాళ్లు పేరెంట్ కావాలనుకున్నా ఇలాంటి చట్టాల వల్ల పేరెంట్‌హుడ్ చాయిస్‌ని కోల్పోతున్నారు. స్టీరియోటైప్స్ కొన్నిటిని ఈ చట్టం బలపరుస్తోంది. సింగిల్‌గా ఉన్న ఆడవాళ్లకు, హెటరో సెక్సువల్ ఫ్యామిలీస్‌కి మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ! సింగిల్ ఉమెన్‌కి ఎందుకిచ్చిందంటే కేర్ గివింగ్ అనే లక్షణం సహజంగానే వాళ్లకుంటుంది కాబట్టి అనే. అంటే ఈ రెండు స్టీరియోటైప్స్‌ని ఆ చట్టం బలపరుస్తున్నట్టే కదా! వివక్షే కాకుండా స్టీరియోటైప్స్నీ బలపరుస్తున్నట్టున్న ఈ చట్టాన్ని చాలెంజ్ చేయడం మంచిదే! పురుషుడు సంపాదిస్తాడు, స్త్రీ ఇల్లు చూసుకుంటుంది లాంటి జెండర్ రోల్స్‌ను ఈ చట్టం బలపరుస్తోంది. ఈ చట్టం వల్ల ఎల్‌జిబీటీక్యూ కమ్యూనిటీస్కీ నష్టమే! ఏమైనా ఈ చట్టంలో మార్పులు రావాలి. ఎక్స్΄్లాయిటేషన్ను ఆపేలా చట్టాలుండాలి కానీ.. పేరెంట్‌హుడ్ కావాలనుకునే వారిని నిరుత్సాహపరచేలా కాదు.– దీప్తి సిర్ల, దళిత్ అండ్ జెండర్ యాక్టివిస్ట్

అరటి పండుతో అదిరేటి రుచులు
వేసవి సెలవులొచ్చేశాయి. ఇక ఇంట్లో పిల్లల సందడి మొదలవుతుంది. ఎండల్లో బాగా ఆడుకుంటారు. అందుకే పిల్లలకి పోషకమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడం చాలా అవసరం. అలాగేఈ సమయంలో పిల్లలకి అన్ని పనులనూ మెల్లిగా అలవాటు చేయాలి కూడా. మరి పిల్లలు సైతం సిద్ధం చేసుకోగలిగే ఈజీ రెసిపీల గురించి తెలుసుకుందాం. వీటిల్లో బనానా రెసిపీలు మొదటి వరసలో ఉంటాయి. పైగా అవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇప్పుడు కొన్ని వెరైటీలు చూద్దాం..బనానా శాండ్విచ్కావాల్సినవి: రెండు లేదా మూడు అరటిపళ్లు, పీనట్ బటర్-పావు కప్పు; కొన్ని బ్రెడ్ స్లైసెస్. తయారీ: ముందుగా బ్రెడ్ స్లైసెస్ను ఓవెన్లో దోరగా వేయించుకోవాలి. ఈలోపు అరటి పండ్లను గుండ్రంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పీనట్ బటర్‌ను బ్రెడ్ ముక్కలకు ఒకవైపు అప్లై చేసుకుని, రెండేసి బ్రెడ్ముక్కల్లో కొన్ని అరటిపండు ముక్కలను పెట్టుకుని, పైన పంచదార పొడితో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.బనానా ఓట్ మీల్ బాల్స్ కావాల్సినవి: అరటిపండు-1 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి); రోల్డ్ ఓట్స్ - అర కప్పు; పీనట్ బటర్-ఒక టేబుల్ స్పూన్; బెల్లం తురుము-కొద్దిగా; దాల్చినచెక్క పొడి -కొద్దిగా.తయారీ: ముందుగా ఒక పాత్రలో రోల్డ్ ఓట్స్, అరటిపండు గుజ్జు, పీనట్ బటర్, దాల్చిన చెక్క పొడి, బెల్లం తురుము ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి బ్రెడ్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని, కొద్దిగా కొబ్బరి కోరులో దొర్లించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుబనానా హనీ బైట్స్కావాల్సినవి: అరటిపండ్లు – 2; తేనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు; దాల్చినచెక్క పొడి – టీ స్పూన్‌తయారీ: ముందుగా అరటిపండ్లను గుండ్రంగా కట్ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అభిరుచిని బట్టి నెయ్యి లేదా బటర్లో దోరగా వేయించుకోవచ్చు. వేయించుకున్నా వేయించుకోకపోయినా వాటిపై తేనె, దాల్చినచెక్క పొడి వేసుకుని, కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బైట్స్.చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుబనానా చాక్లెట్ పాప్స్కావాల్సినవి: అరటిపండ్లు -4; ఐస్ క్రీమ్ పుల్లలు -6 పైనే; చాక్లెట్ చిప్స్- అర కప్పు (మెల్ట్ చేసుకోవాలి); డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొన్ని (నచ్చినవి)చదవండి: Shooting Spot భువనగిరి.. సినిమాలకు సిరితయారీ: ముందుగా అరటిపండు తొక్క తీసి.. నచ్చిన విధంగా కట్ చేసుకుని.. ఒక్కో ముక్కకు ఒక్కో ఐస్ క్రీమ్ పుల్ల గుచ్చాలి. ఒక ప్లేట్లో పార్చ్మెంట్ పేపర్ వేసి అరటిపండు ముక్కలను దానిపై పేర్చి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అరటిపండు ముక్కలు గట్టిపడిన తర్వాత కరిగిన చాక్లెట్లో ముంచి, వెంటనే తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కలను పైన జల్లి సర్వ్ చేసుకోవచ్చు.చదవండి : 60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్

300 ఏళ్ల నాటి ఆలయం..అక్కడ ప్రసాదం పిల్లులకు నివేదించాకే..
కొన్ని ఆలయాల చరిత్ర అత్యంత వింతగా ఉంటాయి. సాధారణంగా అందరూ దేవుడి ప్రసాదాన్ని అత్యంత పరమపవిత్రంగా భావిస్తారు. కానీ ఈ ఆలయంలో ప్రసాదం మాత్రం పిల్లులు స్వీకరించాక భక్తులకు పంచుతారుట. ఇదేంటీ అని ఆశ్చర్యపోకండి. ఇది నమ్మశక్యంగానీ నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది..? దాని కథాకమామీషు ఏంటో చూద్దామా..!.ఒడిశాలో దాదాపు 300 ఏళ్ల నాటి ఆలయం ఉంది. ఆ ఆలయంలో విష్ణుమూర్తి అవతారమైన మదన్ మోహన స్వామి పూజలందుకుంటున్నారు. ఆ స్వామి విగ్రహం తోపాటు పది ఇతర విగ్రహాలు కూడా ఉంటాయి. ఆ గుడి కేంద్రపారా జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని ఒడిస్సాలో బిలేఖియా మఠం అని పిలుస్తారు. ఒడియా భాషలో పిల్లి 'బెలీ అంటారు. ఆ పేరు మీదుగానే ఈ ఆలయం బిలేఖియాగా స్థిరపడింది. ఇక్కడ స్వామి మదన మోహన్‌కి నైవేద్యం సమర్పించిన వెంటనే ఆ ప్రసాదాన్ని మొదటగా అక్కడే నివాసం ఉండే పది పిల్లులకు సమర్పించాక గానీ భక్తలకు వితరణ చేయరు. దాదాపు మూడు శతాబ్దాల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారట ఆలయ పూజర్లు.ఇలా ఎందుకంటే..స్థానిక పురాణం ప్రకారం, ఆయుల్ రాజ్యానికి చెందిన రాజు బ్రజ సుందర్ దేబ్ ఈ మఠాన్ని సందర్శించాడు. ఆలయ పూజారి వందలాది పిల్లులను సంరక్షించడం చూశాడు. వెంటనే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కొన్ని ఎకరాల భూమిని ఆ ఆలయానికి కానుకగా ఇచ్చేశాడు. అలా ఆ ఆలయంలో ఆ పిల్లలకు ఆహారం పెట్టడం అనేది ఆచారంగా సాగుతోందట. అంతేకాదండోయ్ చాలావరకు ఆ పిల్లులన్ని ఆ ఆలయంలోనే పుట్టాయట. వాటికి రోజూ బిస్కెట్లు, పాలు, అన్నం తదితరాలు పెడతారట. ప్రస్తుతం ఆ పిల్లుల్లో చాలామటుకు ఇతరులకు పెంచుకోవడానికి ఇచ్చేసినట్లు తెలిపారు ఆలయ నిర్వాహకులు. అవన్నీ ఆలయ ప్రాంగణంలోనే తచ్చాడుతూ ఉంటాయి. అంతేగాదు ఆ పిల్లులు కూడా సరిగ్గా ప్రసాదం నివేదించే సమయాని కల్లా..పూజారి పెట్టే ప్లేటు వద్దకు వచ్చి నిరీక్షిస్తూ ఉండటం విశేషం. నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ ఈ ఆలయం స్టోరీ. పిల్లుల పోషణార్థం రాజు ఎకరాలకొద్దీ భూమిని రాసివ్వడం కూడా అత్యంత వింతగా అనిపిస్తోంది కదూ..!.(చదవండి: మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్లో ఆ ఆహారాలకు చోటు లేదు! రీజన్ ఇదే..)
ఫొటోలు


మెట్‌గాలా 2025 ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)


'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)


భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?


గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)


#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)


కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)


SRH vs DC Photos : ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అభిమానులతో సందడిగా ఉప్పల్ స్టేడియం.. తారల సందడి (ఫొటోలు)


రోజురోజుకీ తమన్నా అందం రెట్టింపు.. చూస్తుంటేనే! (ఫొటోలు)


'#సింగిల్'తో అదృష్టం పరీక్షించుకోనున్న ఇవానా (ఫొటోలు)


హిమాచల్ ప్రదేశ్ లో చిల్ అవుతున్న అరియానా (ఫొటోలు)
అంతర్జాతీయం

నిప్పు చల్లగా.. మంచు మంటగా!
మెల్బోర్న్(ఆస్ట్రేలియా): మంటను ముట్టుకుంటే కాలిపోతుంది. మంచును టచ్ చేస్తే చల్లగా ఉంటుంది. కానీ ఈ ఆ్రస్టేలియా వ్యక్తికి మాత్రం నిప్పు చల్లగా ఉంటుంది. చల్లని పదార్థం చురుక్కుమటుంది. అదెలా సాధ్యమంటే, అదో వింత వ్యాధి. అతని కాళ్లు, చేతులు గ్రహణ శక్తి కోల్పోయాయి. ఈ వ్యాధితో అతను ఐదేళ్లుగా బాధపడుతున్నాడు. ఎన్నో పరీక్షలు చేసినా వ్యాధేమిటో తెలిసింది కానీ చికిత్స ఏమిటో తెలియడం లేదు. ఆ్రస్టేలియాకు చెందిన 22 ఏళ్ల ఎయిడెన్ మెక్మానస్ 17వ ఏట హైస్కూల్ చివరి ఏడాదిలో ఉండగా ఈ సమస్య మొదలైంది. పాదాల్లో కొద్దికొద్దిగా అనుభూతిని కోల్పోవడం మొదలైంది. పాదాలు చక్కిలిగింతలు పెట్టినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా అనిపించడం మొదలైంది. పాదాల్లోకి రక్తం, ఇతర ద్రవాల సరఫరా లేదంటూ డాక్టర్ మందులిచ్చాడు. అవేవీ పని చేయలేదు. నడవడమే కష్టంగా మారడంతో న్యూరాలజిస్టులు 20కి పైగా రక్త పరీక్షలు చేశారు. బయాప్సీ కూడా చేసినా వ్యాధీ నిర్ధారణ కాలేదు. చివరకు అతను ఆక్సోనల్ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడుతున్నాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇది శరీరానికి సంకేతాలను ప్రసారం చేయకుండా నాడీ కణాలను అడ్డుకుంటుంది. దాంతో తన కుమారుడు వేడిగా ఏదైనా తీసుకున్నప్పుడు, చల్లగా అనిపిస్తుందని, చల్లగా ఉన్నప్పుడు మండుతున్న అనుభూతిని పొందుతాడని తల్లి ఏంజిలా మెక్మానస్ వాపోయారు. అతని రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోంది. నడక సామర్థ్యం, కాళ్లు, చేతుల్లో సమతుల్యత, సమన్వయం తగ్గుతున్నాయి. నయం చేయలేని ఈ వ్యాధికి చికిత్సను భరించలేమని నేషనల్ డిజేబులిటీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ (ఎన్డీఐఏ) సైతం చేతులెత్తేసింది. చికిత్సేమిటో తెలియకుండా నిధులివ్వలేమని తేల్చేసింది. కానీ నొప్పి నివారణ మందులు తప్ప ప్రస్తుతానికి అతనికి చికిత్స అందుబాటులో లేదని న్యూరాలజిస్ట్ చెప్పుకొచ్చారు. పరిస్థితి నానాటికి దిగజారిపోయే పరిస్థితి ఉంది గనుక ఎన్డీఐఏలో చేర్చాలంటూ ఏజెన్సీకి లేఖ రాశారు.

ప్రెస్మీట్లో పాక్ జర్నలిస్టుల బూతులు.. వీడియో వైరల్
లండన్: పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులు దారుణంగా ప్రవర్తించారు. విదేశాల్లో మీడియా సమావేశానికి హాజరైన ఇద్దరు పాక్ జర్నలిస్టులు మాత్రం.. పరస్పరం తిట్టుకుంటూ ఏకంగా బూతుపురాణం అందుకున్నారు. పాక్ నేత ప్రెస్‌మీట్ సందర్భంగా జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ సెక్రెటరీ జనరల్ ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన సల్మాన్ అక్రమ్ రాజా లండన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సఫీనా ఖాన్, అసద్ మాలిక్‌తోపాటు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. సఫీనా ఖాన్ పాకిస్థాన్‌కు చెందిన నియో న్యూస్ ఛానెల్లో పని చేస్తుండగా.. అసద్ మాలిక్, కొందరు ఇతర జర్నలిస్టులు వేర్వేరు చానళ్లలో పని చేస్తున్నారు. వీరంతా ఒక చోట చేరిన సమయంలో సఫీనా, అసద్ మాలిక్ మధ్య వివాదం చోటు చేసుకుంది.ఇద్దరు గొడవకు దిగారు. బూతులు తిట్టుకున్నారు. కుటుంబాలను సైతం దూషించుకున్నారు. అక్కడున్న మిగతా జర్నలిస్టులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం మాలిక్, ఇతర పాక్ జర్నలిస్టులు తనను చంపేస్తామని బెదిరించారని సఫీనా ఖాన్ ట్వీట్ చేశారు. తనకు ఏదైనా జరిగితే ఈ ముగ్గురు రిపోర్టర్లే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ఆరోపణలను అసద్‌ఖాన్ తోసిపుచ్చారు. ఇద్దరు జర్నలిస్టుల మధ్య వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Pakistani Journalism at its peak with journalists Safina Khan and Asad Malik fight it out at a London eatery. (Warning: Very Abusive Content)Delhi boys, take a bow, this language exceeds everything. pic.twitter.com/ZSdMOIpNyj— Ꮙarun (@Ambarseriya) May 4, 2025

ఐరాసలో నేడు పాక్-భారత్ పంచాయితీ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలి(UN Security Council)లో భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు. తద్వారా.. అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్‌పనేనని నిర్ధారించుకున్న భారత్.. అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో.. పాక్ కూడా కౌంటర్ ఆంక్షలు విధిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ సింధు జలాలను నిలిపివేయడాన్ని ‘‘యుద్ధం’’గానే పాక్ భావిస్తోంది.ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ తమను(పాక్)ను ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాలన్ని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని అన్నారాయన.మరోవైపు.. భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని.. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నామని అన్నారు.

అంతుచిక్కని బంగారం రహస్యం.. పుత్తడి పుట్టిందెక్కడ?
బంగారం. ఈ పేరు వింటేనే భారతీయులు మైమరిచిపోతారు. మనోళ్ల బంగారం మోజు దెబ్బకు పదిగ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.లక్ష మార్కు దాటేయడం తెల్సిందే. పసిడి అంటే సామాన్యులతో పాటు శాస్త్రవేత్తలకు సైతం ప్రత్యేక ఆసక్తి. పుత్తడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు వాళ్లు తెగ ఆసక్తి చూపిస్తారు. ‘‘స్వర్ణం మూలాలెక్కడున్నాయి? బంగారు లోహం భూమ్మీదకు ఎలా వచ్చింది?’’ అన్న ప్రశ్నలు శాస్త్రజు్ఞలను ఎప్పటినుంచో తొలుస్తున్నాయి. పేలిపోయిన నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవించిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూట్రాన్ నక్షత్రాలే పుత్తడికి పుట్టిల్లు అని సరికొత్త అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా ‘ది ఆస్ట్రో ఫిజిక్స్ జర్నల్ లెటర్స్’లో ప్రచురితమైంది. దాదాపు 1,380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్‌బ్యాంగ్ వల్ల విశ్వం ఆవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అత్యంత తేలికైన హైడ్రోజన్, హీలియం, అంతకంటే తక్కువ పరిమాణంలో లిథియం వంటి మూలకాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ సమయంలో పేలిన నక్షత్రాలు ఇనుము వంటి కాస్త బరువైన మూలకాలను విశ్వమంతటా వెదజల్లాయి. ఇనుము కంటే సాంద్రత ఎక్కువ ఉండే బంగారం ఎప్పుడు, ఎలా ఉద్భవించిందనే ప్రశ్నకు ‘మ్యాగ్నెటార్’ సరైన సమాధానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏమిటీ మ్యాగ్నెటార్లు? మనకు అతి సమీపంలోని నక్షత్రమైన సూర్యుడు అపారమైన శక్తిని వెలుతురు, ఉష్ణశక్తి రూపంలో నిరంతరం విశ్వంలోకి వెదజల్లుతూనే ఉంటాడు. ఇలా నక్షత్రం తనలోని అపారమైన శక్తినంతా వెదజల్లాక గురుత్వాకర్షణ బలాలను కోల్పోతుంది. దీంతో ఎర్రరంగుకు మారి తుదకు పేలిపోతుంది. దాన్ని సూపర్నోవా అంటారు. పేలిన నక్షత్రం న్యూట్రాన్ నక్షత్రంగా, లేదంటే బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా రూపాంతరం చెందుతుంది. ఈ న్యూట్రాన్ నక్షత్ర ద్రవ్యరాశి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో అది గురుత్వాకర్షణ శక్తిని తరంగాల రూపంలో విశ్వంలోకి వెదజల్లుతుంది. వాటితోపాటు ‘గామా’ కిరణాలను, అణు కేంద్రకాలను కూడా అతివేగంగా వెదజల్లుతుంది. దీన్ని ఆర్–ప్రాసెస్ అంటారు. బరువైన మూలకమైన బంగారం ఈ క్రమంలోనే జనించిందని అధ్యయనం విశ్లేషించింది. ‘‘విశ్వంలోని ప్రాథమిక అంశాల పుట్టుక నిజంగా నవ్వు తెప్పించే క్లిష్టతరమైన పజిల్ వంటిది. వాటి పుట్టుపూర్వోత్తరాలను మనం పూర్తిగా కనుక్కోలేం. రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొంటే బంగారం పుట్టిందని గతంలో భావించేవారు. కానీ అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటార్ (న్యూట్రాన్ నక్షత్రం) నుంచి కూడా బంగారం పుడుతోందని అధ్యయనంలో తేలింది’’ అని కొలంబియా వర్సిటీ ఫిజిక్స్ డాక్టోరల్ విద్యారి్థ, పరిశోధన ముఖ్య రచయిత అనిరుధ్ పటేల్ చెప్పారు. 20 ఏళ్ల సమాచారం... ‘‘2017లో రెండు నక్షత్రాలు ఢీకొనడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దాంతో అంతరిక్షంలో అలల్లా గురుత్వాకర్షణ తరంగాలు విస్తరించాయి. వీటితోపాటే గామా కిరణాలు పెద్దమొత్తంలో వెలువడ్డాయి. ఇలా ఢీకొనడాన్ని కిలోనోవాగా పేర్కొన్నారు. దాని ఫలితంగా బరువైన బంగారం, ప్లాటినం, లెడ్ ఏర్పడ్డాయి. అందుకే కిలోనోవాలను బంగారం కర్మాగారాలుగా చెబుతారు. మ్యాగ్నెటార్లు గామా కిరణాలను వెదజల్లినప్పుడే బంగారం పుట్టింది’’ అని లూసియానా స్టేట్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరిక్ బర్న్స్ చెప్పారు.నక్షత్రకంపం! న్యూట్రాన్ నక్షత్రాల్లో అత్యంత కాంతిమయ నక్షత్రాలనే మ్యాగ్నెటార్లు అంటారు. కేవలం టీస్పూన్ సైజులో ఉండే మ్యాగ్నెటార్ ద్రవ్యరాశి కూడా ఏకంగా 100 కోట్ల భూగోళాలంత బరువుంటుంది! మ్యాగ్నెటార్ చుట్టూ అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం ఉంటుంది. బిగ్‌బ్యాంగ్ జరిగిన 20 కోట్ల ఏళ్లకే మ్యాగ్నెటార్లు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. భూమి అంతర్గత పొరల్లో సర్దుబాటు వల్ల భూకంపాలు వచి్చనట్టే నక్షత్రంలోనూ నక్షత్రకంపం పుడుతుంది. మాగ్నెటార్ అంతర్భాగంలోని ద్రవరూప పదార్థంలో సర్దుబాటు కారణంగా నక్షత్ర బాహ్యవలయాల్లో ‘స్టార్క్వేక్’లు వస్తాయట.– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

పంజాబ్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
పంజాబ్‌లో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అడవిలో దాచిన గ్రనేడ్లు, బాంబులు, మందు పాతరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. కాగా, స్లీపర్ సెల్స్‌పై నిఘా పెట్టిన భారత ఆర్మీ.. పాకిస్థాన్ భారీ కుట్రను భగ్నం చేసింది. పంజాబ్‌లో ఐఎస్ఐ, ఉగ్రవాదుల కుట్రను ముందుగానే ఆర్మీ, ఇంటలీజెన్స్ పసిగట్టింది. పక్కా సమచారంతో టిబ్బా నంగల్-కులార్ రోడ్, ఎస్బీఎస్ నగర్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రతీకార చర్యలపై ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ తన సైబర్‌మూకలను రంగంలోకి దింపింది. దీంతో భారత రక్షణ రంగానికి సంబంధించిన వెబ్సైట్లపై పాక్ సైబర్ దాడుల ఉధృతి ఎక్కువైంది. అయితే రక్షణరంగంలోని వ్యక్తుల లాగిన్, పాస్వర్డ్ వంటి క్రెడెన్షియల్స్ తస్కరణకు గురయినట్లు భావిస్తున్నట్లు భారత సైన్యం తాజాగా ప్రకటించింది. ఇండియన్ ఆర్మీ సోమవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ‘పాకిస్తాన్ సైబర్ ఫోర్స్’ పేరిట ఈ వివరాలతో ఒక పోస్ట్ పెట్టింది.మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్, ది మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ సంస్థల సిబ్బందికి చెందిన లాగిన్, పాస్‌వర్డ్‌లను పాక్ సైబర్ నేరగాళ్లు తమ వశంచేసుకున్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్‌చేశారు. వెబ్సైట్ హోం పేజీపై పాకిస్తాన్ జెండా, అల్ ఖలీద్ యుద్ధట్యాంక్ ఫొటోలను పెట్టారు.‘‘ఈ వెబ్సైట్ ఇప్పుడు పాకిస్తాన్ వశమైంది. ఇది పాకిస్తాన్ సైబర్‌ఫోర్స్ పని. పహల్గాం కేవలం ఆరంభం మాత్రమే’’ అని సందేశాన్ని హ్యాకర్లు ఆ వెబ్సైట్లో పెట్టారు. దీంతో ముందుజాగ్రత్తగా భారత ఆర్మీ అధికారులు ఈ వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్‌లో పెట్టేశారు. హ్యాకింగ్ కారణంగా వెబ్‌సైట్‌లోని సమాచారం ఏ స్థాయిలో చోరీకి గురైందన్న అంశాలపై విస్తృతస్థాయిలో ఆడిట్ చేశాకే వెబ్‌సైట్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురానున్నారు.

యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
ఢిల్లీ: యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ నేడు కీలక సమీక్ష నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో యుద్ధ సన్నద్ధతపై కీలక సమీక్ష చేపట్టనుంది. రేపు(బుధవారం) అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని సోమవారం కేంద్రం ఆదేశించించిన సంగతి తెలిసిందే. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్‌కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమీక్షించనుంది.కాగా, సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ నిన్న (సోమవారం) కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.కాగా, దేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (సోమవారం) కీలక సమీక్షలు నిర్వహించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతి చర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పహల్గాంకు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతలను మోదీ వారికే అప్పగించారు.

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
కటిహార్: బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రాక్టర్ ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.బాధితులంతా సుపౌల్‌కు చెందినవారని, వివాహ వేడుకకు హాజరై తిరిగి సొంతూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందని కటిహార్ ఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని వెల్లడించారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
ఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు కొనసాగుతున్నాయి. వరుసగా 12వ రోజు కాల్పుల విరమణ ఒప్పందం పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్లో 8 సెక్టార్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు దీటుగా బదులిచ్చినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతి చర్యల్లో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని పక్కన పెడుతూ ఏప్రిల్ 24న కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ వెంటనే నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆగడాలు మొదలయ్యాయి.యుద్ధ సన్నద్ధత కోసం సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడక్ రాష్ట్రాలకు సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం . సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలని అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులు అరెస్ట్బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారి వద్ద నుంచి గ్రనేడ్, ఆయుధాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన భద్రతా బలగాలు.. దర్యాప్తు చేపట్టాయి. కాగా, సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పాకిస్తాన్ జాతీయుడిని అరెస్ట్ చేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అతడి నుంచి పాక్ కరెన్సీని, గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు.గుజ్రన్ వాలాకు చెందిన మహ్మద్ హుస్నైన్‌గా గుర్తించిన అతడు ప్రస్తుతం పంజాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. పహల్గాం ఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చ రిల్లిన వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

క్రెడిట్ కార్డు బిల్లు కట్టమన్నందుకు..
మదనపల్లె(అన్నమయ్య): క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో, బ్యాంక్ సిబ్బంది ఇంటివద్దకు వచ్చి నిలదీయడంతో అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. వేంపల్లె పంచాయతీ జంగావారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, కాంతమ్మ దంపతుల ఏకై క కుమారుడు శ్రీకాంత్(25) పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన అనిల్‌కు తనపేరుపై ఉన్న క్రెడిట్‌కార్డు ద్వారా రూ.3లక్షల రుణం తీసిచ్చాడు. అయితే, అతను సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ సిబ్బంది నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీంతో తాను వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బులతో పాటు కొంతమేర అప్పుచేసి మూడో వంతు రుణం చెల్లించాడు. ఇంకా రూ.40వేలు చెల్లించాల్సి ఉంది. ఈ నగదు చెల్లింపు కోసం శనివారం బ్యాంక్ సిబ్బంది శ్రీకాంత్ ఇంటివద్దకు వెళ్లి వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేసి నిలదీశారు. దీన్ని అవమానంగా భావించి మనస్తాపంతో ఆదివారం ఉదయం ఇంటివద్దే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్‌కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు.

ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్‌లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్‌పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.
వీడియోలు


తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి డోకా లేదు: జగదీష్‌రెడ్డి


పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన వంగా గీతా


Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం


Jammu And Kashmir: పూంచ్ జిల్లాలో లోయలో పడిన బస్సు


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు


Varudu Kalyani: కూటమి సర్కార్ ప్రతి పథకంలో స్కామ్ చేస్తోంది


LB Nagar: సిలిండర్ బ్లాస్ట్ కావడంతో మంటలు


వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య క్లారిటీ..


అప్పుల్లో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు


అనంతపురం ఎస్పీ కార్యాలయం దగ్గర హైడ్రామా