Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India will now use the water for is own interests PM Modi1
మా దేశం నీళ్లు ఇక మావే: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: ఇక నుంచి భారత్‌కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారత నీళ్లు ఇప్పటివరకూ బయటకు వెళ్లాయని, ఇక నుంచి అది ఉండదన్నారు. మన నీళ్లు- మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్సష్టం చేశారు. పాకిస్తాన్‌ కు సింధ/ జలాల నిలిపివేత అంశంపై స్పందించిన మోదీ.. మన నీళ్లు ఇక నుంచి మన అవసరాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు.చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ప్రాజెక్ట్ నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.కాగా, ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్‌ చానెళ్ల నిలిపివేత, భారత్‌ జలాల్లోకి పాక్‌ ఓడలు రాకుండా నిషేధం, పాక్‌ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మూడు రోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.

Uday Kotak Buys Rs 400 Crore Mumbai Sea Facing Property2
చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!

కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్‌లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.కోటక్ ఫ్యామిలీ ఇప్పటికే ఈ భవనంలోని 24 ఫ్లాట్లలో 13 ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ఫ్లాట్లను రూ. 131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ. 12 కోట్ల నుంచి రూ. 27.59 కోట్లు. మిగిలిన 3 ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా, మొత్తం భవనం విలువ రూ. 400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ. 4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చ.అ ఫ్లాట్ ధర రూ. 38.24 కోట్లు. ఇది ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం.. ముంబై తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది.కోటక్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాట్లను ఒకటిగా చేసి మళ్ళీ రీడెవల్పెమెంట్ ఏమైనా చేస్తుందా?, లేక ఉన్నది ఉన్నట్లుగానే ఉంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన విషయాలను కోటక్ కుటుంబం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్

IPL 2025, MI VS GT: Suryakumar Yadav Now Has Most time 500 Plus Runs In An IPL Season For Mumbai Indians3
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్‌

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక సీజన్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కలుపుకుని సూర్య ఇప్పటివరకు మూడు సార్లు (2025 (510*), 2023 (605), 2018 (512)) ఓ సీజన్‌లో 500 ప్లస్‌ పరుగులు చేశాడు. సూర్య తర్వాత ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక సీజన్లు 500 ప్లస్‌ పరుగులు చేసిన ఘనత సచిన్‌ టెండూల్కర్‌ (2010, 2011), క్వింటన్‌ డికాక్‌కు (2019, 2020) దక్కుతుంది. వీరిద్దరు తలో రెండు సార్లు ఈ ఘనత సాధించారు.ఇవాళ (మే 6) గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్య ఈ సీజన్‌లో 500 పరుగుల మార్కును తాకాడు. ఈ మ్యాచ్‌లో సూర్య సీజన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గానూ అవతరించాడు. ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేసిన సూర్య సాయి కిషోర్‌ బౌలింగ్‌లో షారుక్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సీజన్‌లో సూర్య 12 మ్యాచ్‌ల్లో 510 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆరెంజ్‌ క్యాప్‌ సాధించే క్రమంలో సూర్య విరాట్‌ను (505) అధిగమించాడు.ఈ సీజన్‌లో సూర్య చేసిన స్కోర్లు..29(26), 48(28), 27*(9), 67(43), 28(26), 40(28), 26(15), 68*(30), 40*(19), 54(28), 48*(23) & 35(24)ఈ సీజన్‌లో టాప్‌-6 లీడింగ్‌ రన్‌ స్కోరర్లు..సూర్యకుమార్‌ యాదవ్‌-510విరాట్‌ కోహ్లి- 505సాయి సుదర్శన్‌- 504యశస్వి జైస్వాల్‌- 473జోస్‌ బట్లర్‌- 470శుభ్‌మన్‌ గిల్‌- 465మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. రెండో బంతికే ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ రికెల్టన్‌ (2) ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో రోహిత్‌ శర్మ (7) పెవిలియన్‌కు చేరాడు. అనంతరం విల్‌ జాక్స్‌ (53), సూర్యకుమార్‌ యాదవ్‌ (35) కాసేపు నిలకడగా ఆడినా.. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. ఆతర్వాత వచ్చిన తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్యా (1), నమన్‌ ధిర్‌ (7) ఇలా వచ్చి అలా వెళ్లారు. 16.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 123/7గా ఉంది. కార్బిన్‌ బాష్‌ (4), దీపక్‌ చాహర్‌ క్రీజ్‌లో ఉన్నారు. పవర్‌ ప్లేలో గుజరాత్‌ ఆటగాళ్లు మూడు సునాయాసమైన క్యాచ్‌లు వదిలి పెట్టినా ముంబై ఇండియన్స్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. గుజరాత్‌ బౌలర్లలో సాయికిషోర్‌ 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, రషీద్‌ ఖాన్‌, గెరాల్డ్‌ కొయెట్జీ తలో వికెట్‌ పడగొట్టారు. శుభ్‌మన్‌ గిల్‌ మూడు క్యాచ్‌లు పట్టాడు.

MLA Sabitha On Obulapuram Mining Case4
‘12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడాను’

హైదరాబాద్‌: 12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడానన్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఓబులాపురం మైనింగ్‌ కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్‌ కృపానందంలకు కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అనంతరం ఆమె మాల్లాడుతూ.. ‘న్యాయస్థానం నన్ను నిర్దోషి గా ప్రకటించింది, న్యాయస్థానంకి ధన్యవాదాలు. ఏ తప్పు చేయకపోయిన కోర్ట్ మెట్లు ఎక్కాను. పన్నెడున్నర సంవత్సరాలు నన్ను రాజకీయంగా అవమానించారు. ఈ కేసులను ముందు పెట్టి నన్ను రాజకీయంగా అణిచివేయాలనుకున్నారు న్యాయస్థానం మీద నమ్మకం ఉంచాను కాబట్టి ఇవ్వాళ నాకు న్యాయం జరిగింది. నాపై ఎన్ని ఆరోపణలు చేసినా నా నియోజకవర్గ ప్రజలు నా వెంట నిలబడ్డారు’ అని అన్నారు. కేసు నమోదు అయిన తరువాత ఇదే సీబీఐ కోర్ట్ కి నేను కనీళ్లతో కోర్ట్ మెట్లు ఎక్కాను. నాపై రాజకీయంగా ఎన్నో ఆరోపణలు చేశారు. నేను అవినీతి చేశానని, జైలుకు పోతానని హేళన చేశారు. ఇన్నాళ్లకు నాకు న్యాయం జరిగింది’ అని అన్నారు సబితా ఇంద్రారెడ్డి.ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు

Chandrababu Naidu Government Records In Debt5
అప్పుల్లో చంద్రబాబు సర్కార్‌ రికార్డు

అమరావతి: అప్పుల్లో చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. మరో రూ.7 వేల కోట్లు ప్రభుత్వం అప్పు చేసింది. ఒకే రోజు రూ.7 వేల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రిజర్వ్‌ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. గత నెలలో రూ.5,750 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం.. ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది.మళ్లీ రూ.7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌.. ఇప్పటివరకు లక్షా 59 వేల కోట్లు అప్పు చేసింది. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం.. హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు.ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు ‘సంపద సృష్టి’ భలేగా ఉంది అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్‌ తేల్చేసింది. ఒకవైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టంచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్‌ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Pahalgam Incident: BJP Responds M Kharges Big Charge6
పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’

రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్‌ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్‌ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్‌ పార్టీ సంవిధాన్‌ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్‌ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్‌ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు.

Met Gala 2025: Isha Ambani couture Blending Indian craft and global glamour7
Met Gala 2025: స్టైలిష్‌ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..

ప్రతిష్టాత్మకమైన మెట్‌గాలా 2025 ఈవెంట్‌లో బాలీవుడ్‌ తారలంతా తమదైన ఫ్యాషన్‌ శైలిలో మెరిశారు. వారందరిలో ఈ ఇద్దరే ఈవెంట్‌ అటెన్షన్‌ మొత్తం తమవైపుకు తిప్పుకున్నారు. ఈ మెట్‌గాలా ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి వాళ్లు ధరించిన డిజైనర్‌ వేర్‌లు. ఒకరు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రపంచ వేదికపై చూపించగా.. మరొకరు భారతీయ హస్తకళకు ఆధునికతను జోడించి హైరేంజ్‌ ఫ్యాషన్‌తో అలరించారు. ఆ ప్రమఖులు ఎవరు..? ఆ ఈవెంట్‌ ప్రత్యేకతే ఏంటి తదితరాల గురించి చూద్దామా..!.మెట్‌ గాలా ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్రముఖులు ఇషా అంబానీ(Isha Ambani), గాయని దిల్జిత్ దోసాంజ్‌(Diljit Dosanjh)లు. ఇద్దరూ ఈవెంట్‌లో భారతీయ ఫ్యాషన్‌ కళ తమ భారతీయ సంప్రదాయ వారసత్వం, చేతికళలు గొప్పదనం తదితరాలే అర్థం పట్టేలా అట్రాక్టివ్‌ దుస్తుల్లో మెరిశారు. మొత్తం ఈవెంట్‌ వారి చుట్టూనే తిరుగుతుందేమో అనేంతగా ఉంది ఆ ఇరువురి లుక్‌. స్టైలిష్‌ డ్రెస్‌లో ఇషా..భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్‌ డిజైనర్‌ అనామిక ఖన్నా ఇషా డిజైనర్‌ వేర్‌ని రూపొందించారు. టాప్‌ గోల్డ్‌ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్‌ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్‌ కలర్‌ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్‌ తెల్లటి క్యాప్‌ లుక్‌లో అత్యంత స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది ఇషా. అయితే డిజైనర్‌ అనామిక ఈ డ్రెస్‌కి అందమైన లుక్‌ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట. ఒక పక్క చేతితో చేసిన బెనరస్‌ ఫ్యాబ్రిక్‌పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్‌లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్‌ వేర్‌లా డిజైన్‌ చేశారామె. ప్రతి చిన్న కుట్టు మన సంప్రదాయ కళను సాంస్కృతికి అర్థం పట్టేలా శ్రద్ధ తీసుకుని మరీ డిజైన్‌ చేశారు. చూడటానికి బ్లాక్ డాండీ ఫ్యాషన్ లుక్‌లా అదిరిపోయింది. ఆ ఫ్యాషన్‌ వేర్‌కి తగ్గట్లు వింటేజ్ కార్టియర్ నెక్లెస్ ధరించారామె. నవానగర్ మహారాజుకు చెందిన ఈ నెక్లెస్‌ మొత్తం 480 క్యారెట్ల డైమెండ్ల తోపాటు షో-స్టాపింగ్ 80.73-క్యారెట్ కుషన్-కట్ డైమండ్ కూడా ఉంది. అలాగే చేతికి పక్షి ఉంగరాలు, నడుముకి వజ్రాలతో కూడిన ఆభరణం తదితరాలు ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) రాయల్‌ లుక్‌లో దిల్జిత్ దోసాంజ్గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలా 2025 నీలిరంగు కార్పెట్‌పై రాయల్ పంజాబీ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన వేదికపై సాంప్రదాయ సిక్కు వారసత్వాన్ని తెలియజేసేలా తలపాగా ధరించి వచ్చారు. సిక్కు రాయల్టీకి తగ్గ రాజదర్పంతో ఠీవీగా కనిపించారు దిల్జిత్ దోసాంజ్‌. భారతీయ రాజ వంశాలు ధరించే రత్నాలు, ముత్యాలు, పచ్చలు కూడిన ఆభరణాలు ధరించారు. సిక్కు శౌర్యం, గౌరవానికి ప్రతీక అయిన కత్తిని కూడా పట్టుకుని వచ్చారు. మెట్‌గాలాకి సంబంధించిన ఫ్యాషన్‌ వేర్‌ కాకపోయినా..గర్వంగా మా సంస్కృతే మా ఫ్యాషన్‌ అని చాటిచెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఇతర బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు కూడా తమదైన స్టైలిష్‌వేర్‌లో మెరిశారు. కాగా, ఈ ఏడాది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ ఛారిటీ ఈవెంట్‌ థీమ్ "సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్". అయితే ఈ 20 ఏళ్లలో పురుషుల దుస్తుల లుక్స్‌ పైకూడా దృష్టిసారించడం ఇదే మొదటిసారి. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్‌ కేన్సర్‌ సర్జరీ..! జస్ట్‌ 15 రోజుల్లేనే మిస్‌ వరల్డ్‌ వేదికకు..)

RTC JAC Of Telangana Talks With Govt Successfully Done8
TG: ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపు(మే7వ తేదీ, బుధవారం) ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈ మేరకు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ.. తమ సమ్మెను వాయిదా వేసుకుంది. సమ్మెను వాయిదా మాత్రమే వేస్తున్నాం -సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌ లో సమ్మె చేయక తప్పదని హెచ్చరించింది. సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులంతా సమన్వయంగా ఉండాలని, మరోసారి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలనిర్టీసీ జేఏసీ చైర్మన్‌ వెంకన్న తెలిపారు.‘రవాణా శాఖ మంత్రి తో చర్చలు జరిపాం..Rtc యూనియన్ ల పై ఆంక్షలను ఎట్టివేస్తామని హామీ ఇచ్చారు. Rtc లోఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం అన్నారు. ఉద్యోగం భద్రతపై సర్కులర్ విడుదల చేస్తామన్నారు. విద్యుత్ బస్సులు కేంద్రం నుంచి రాయితీ లో కొని rtc కీ ఇప్పిస్తామన్నారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాటిపథకన చేస్తామన్నారు.. Rtc ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం,మంత్రిమీద నమ్మకం తో సమ్మెని తాత్కాలిక వాయిదా వేసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించకపొతే మళ్ళీ సమ్మెలోకి వెళ్తాం’ అని అన్నారు.తమ హామీలపై స్పష్టత రాకపోతే తాము మే 6వ తేదీ అర్థరాత్రి నుంచే సమ్మెకు దిగుతామని గత నెల ఆరంభంలోనే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు, అటు లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఈరోజు(మే 6వ తేదీ, మంగళవారం) వారిని చర్చలకు పిలిచింది.ఉద్యో‍గుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటుఒకవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సందర్బంలోనే తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ఓ కమిటీని సర్కార్ చేసింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ లు ఉన్నారు. ఉద్యోగులతో వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఈ అధికారుల కమిటీ విధి.

Obulapuram Mining Case Latest Update9
ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు

సాక్షి,హైదరాబాద్‌: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్‌ కృపానందంలకు కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చిన ఓబుళాపురం మైనింగ్‌ కేసులో మంగళవారం సీబీఐ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఏ1 బీవీ శ్రీనివాస రెడ్డి, ఏ2: గాలి జనార్ధన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీ ఖాన్‌కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతోపాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇక ఈ కేసులో విచారణ సాగుతున్న సమయంలోనే A5రావు లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేసింది. కేసులో గాలి సోదరుడు, బీవీ శ్రీనివాస్ రెడ్డికి ఏడేళ్లు శిక్ష విధించింది.

Varun Tej And Lavanya Tripathi Expecting Their First Child, News Announced10
శుభవార్త చెప్పిన 'వరుణ్ తేజ్, లావణ్య'.. కంగ్రాట్స్‌ అంటూ అల్లు స్నేహ

మెగా కుటుంబం నుంచి శుభవార్త వచ్చేసింది. వరుణ్ తేజ్(Varun Tej)-లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానుల కోసం సోషల్‌మీడియాలో ఈ వార్తను ప్రకటించారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో అత్యంత సంతోషకరమైన బాధ్యతను తీసుకోబోతున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లతో పాటు మెగా అభిమానులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించనున్నారు. శుభవార్త చెప్పిన వరుణ్‌ దంపతులకు అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ శుభాకాంక్షలు చెప్పారు. ఆపై సమంత, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రీతూ వర్మ, డింపుల్ హయాతి, సుశాంత్‌ వంటి సినీ స్టార్స్‌ కంగ్రాట్స్‌ అంటూ కామెంట్‌ బాక్స్‌లో మెసేజ్‌లు చేశారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక వెబ్‌ సిరీస్‌ను ఆమె విడుదల చేశారు. ఆపై సతీ లీలావతితో పాటు కోలీవుడ్‌ మూవీ థనల్‌ను ఆమె పూర్తి చేశారు. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్లీ కాస్త బ్రేక్‌ ఇచ్చారు. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్‌ కావడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. 2017లో వరుణ్‌, లావణ్యల మధ్య ఏర్పడిన స్నేహం ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు కలిసి ‘మిస్టర్‌’ అనే సినిమాలో తొలిసారి నటించారు. ఆ సమయంలోనే వరుణ్‌, లావణ్య త్రిపాఠి క్లోజ్‌ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్‌ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేశారు. సరిగ్గా పెళ్లికి కొద్దిరోజులు ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు. అలా వరుణ్‌, లావణ్యల పెళ్లి ఇట‌లీలో జరగగా.. హైదరాబాద్‌లో రిసెప్ష‌న్ ఘనంగా జరిగింది. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement