క్లీన్‌బౌల్డ్ అయిన తర్వాత సిక్సర్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును బంతి వికెట్లను తాకి మరి నేరుగా బౌండరీలైన్ బయట పడింది. బహుషా క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి సిక్సర్ చూసి ఉండరు. వికెట్ అయిన తర్వాత సిక్సర్ ఎలా అవుతుందంటారా? అవును అది సిక్సర్ కాదు వికెటే! కానీ కళ్లను మైమరిపించే ఈ అబ్బురం తాజా ప్రపంచకప్‌లోనే చోటుచేసుకుంది.