బంగ్లాదేశ్‌తో జరిగిన గత టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. ఇక్కడ జరుగుతున్న పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త జోష్‌లో కనిపించిన మయాంక్ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. మూడు ఫోర్లతో మంచి టచ్‌లోకి కనిపించినప‍్పటికీ అల్ అమిన్ వేసిన బంతికి గల్లీలో క్యాచ్‌లో ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్‌పై పడ్డ బంతిని ఆడబోయిన మయాంక్... మెహిదీ హసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో 26 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
Nov 22 2019 6:03 PM | Updated on Nov 22 2019 6:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement