వైఎస్‌ఆర్‌సీపీ నేత మేరుగ నాగార్జున హౌస్ అరెస్ట్ | YSRCP Leader Merugu Nagarjuna House Arrest-Guntur | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ నేత మేరుగ నాగార్జున హౌస్ అరెస్ట్

Jul 16 2018 9:43 AM | Updated on Mar 20 2024 3:12 PM

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జునను సోమవారం ఉదయం పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పోతర్లంక ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అయితే, మేరుగ నాగార్జున ఆదివారం పోతర్లంక ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించి.. అందులోని అవకతవకలు, ప్రాజెక్టు నుంచి నీళ్లు లీక్‌ కావడాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు పర్యటన ముగిసే వరకు మేరుగ నాగార్జునను గృహనిర్బంధంలో ఉంచనున్నట్టు సమాచారం. పోతర్లంక ఎత్తిపోతల పథకంలోని అవకతవకలు బయటపెట్టినందుకే.. పోలీసులు అక్రమంగా మేరుగను హౌస్‌ అరెస్టు చేశారని వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement