మాయమాటలతో బీసీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు జయహో బీసీ అనే అధికారం లేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోస పోవడడానికి బీసీలు సిద్ధంగా లేరన్నారు. ఐదేళ్ల కాలంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఉపయోగపడే ఒక్క సంక్షేమ పథకమైనా పెట్టారా అని ప్రశ్నించారు. బీసీలు ప్రశ్నిస్తారనే భయంతో చంద్రబాబు జయహో బీసీ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. బీసీలకు మేలు చేస్తే ఇలాంటి సభలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.