‘ఫెడరల్ ఫ్రంట్ గురించే మాత్రమే చర్చ’
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో కేవలం ఫెడరల్ ఫ్రంట్ గురించే మాత్రమే చర్చించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ నేతలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుది నీచమైన మనస్తత్వమని ఆరోపించారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం దేశవ్యాప్తంగా అందరి నేతలతోనూ చర్చల్లో భాగంగానే వైఎస్ జగన్‌తో టీఆర్‌ఎస్ నేతలు కలిశారని స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని అంబటి ధ్వజమెత్తారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి