ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం పులివెందుల్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దివంగత నేతలు వైఎస్ రాజారెడ్డి, వైఎస్‌రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.