తరుముకొస్తున్న హిమపాతం నుంచి పర్యాటకులు తప్పించుకున్న ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కిన్నౌర్ జిల్లాలోని టింకు నల్లా ప్రాంతంలో మంచు కొండలను చూడటానికి పర్యాటకులు వెళ్లారు. ఆ సమయంలో హిమపాతం కదులుతూ వీరు వెళుతున్న రోడ్డుపై ప్రవేశించింది. అయితే కొంతమంది పర్యాటకులు దీన్ని లెక్క చేయకుండా ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అయితే హిమపాతం వారిని వెంటాడుతున్నట్టుగా రోడ్డుపై మరింత ముందుకు వస్తూనే ఉంది. దీంతో ఓ పర్యాటకుడు దాన్ని వెనక్కి వెళ్లిపో అంటూ అరిచాడు. అనంతరం కొంతమంది భయంతో వెనక్కి వెళ్లి తమ కార్లలో ఎక్కి కూర్చున్నారు.
తరుముకొస్తున్న యముడిలా హిమపాతం!
Jan 14 2020 4:11 PM | Updated on Jan 14 2020 4:20 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement