సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ | Vallabhaneni Vamsi meets Sujana Chowdary in Guntur | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ

Published Fri, Oct 25 2019 12:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా వంశీ పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో సుజనాని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే గతంలో కూడా ఎమ్మెల్యే వంశీ టీడీపీ వీడతారనే ప్రచారం జరిగింది. తాజాగా వీరిద్ధరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరోవైపు ఎమ్మెల్యే వంశీ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.  అంతేకాకుండా ఇటీవల ఏపీలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డిని కూడా వంశీ కలిశారు. దీంతో అప్పటి నుంచే ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో  సుజనా చౌదరి కూడా బీజేపీలో చేరాలంటూ వంశీని ఆహ్వానించినట్లు మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement