పొలం బాట పట్టిన విద్యార్థినిలు | Tribal Gurukula College Students In Farm Works | Sakshi
Sakshi News home page

పొలం బాట పట్టిన విద్యార్థినిలు

Aug 9 2019 12:32 PM | Updated on Aug 9 2019 12:55 PM

ఈ రోజుల్లోని విద్యార్థులకు పొలం పనులు అంటే ఎమిటో తెలియకుండా పోతుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో.. పొలం పనులపై కొంతమందికి చులకన భావం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యాపేట జిల్లా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ప్రన్సిపల్‌ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. కళాశాలలోని విద్యార్థినులకు పొలం పనులు పరిచయం చేయాలని అనుకున్నారు. వృతి విద్యలో భాగంగా వారిచే కాసేపు పొలం పనులు చేయించారు. మునగాల మండలం ఆకుపాముల వద్ద కళాశాల పక్కన ఉన్న పొలాల్లోకి దిగిన విద్యార్థినిలు ఉత్సహంగా వరి నాట్లు వేశారు.100 మంది విద్యార్థినిలతో పాటు, కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ దృశ్యాలను చూసినవారు విద్యార్థినులపై ప్రశంసలు కురిపించారు. కాగా, ఈ మధ్య కాలంలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా పొలం బాట పడుతున్న సంగతి తెలిసిందే. తమ విధులను కాసేపు పక్కకు పెట్టి పొలం పనులు చేస్తూ సేద తీరుతున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement