శబరిమలలో బుధవారం మకరజ్యోతి దర్శమిచ్చింది. జ్యోతిని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి ఎంతో మంచి పథకమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశంసించారు. ఇదిలా ఉండగా, తమిళనాడులోని అవనియపురంలో సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైన కొద్ది గంటలకే 32 మందికి గాయాలయ్యాయి. ఇక, ఐసీసీ అవార్డుల్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టీమిండియా వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ అవార్డుల్లో దుమ్ము దులిపారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Jan 15 2020 8:29 PM | Updated on Jan 15 2020 8:33 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement