అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో సన్న బియ్యం అన్న మాటే లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మరోవైపు జీఎస్టీ కింద రాష్ట్రానికి రావలసిన 1,605 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సనాతన పాపుల పార్టీ అని.. మైనార్టీలు అంటే కేవలం ముస్లింలే కాదని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. వీటితోపాటూ మహిళలపై నేరాలు పెచ్చుమీరుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుకు భారత లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Dec 10 2019 7:53 PM | Updated on Mar 21 2024 11:38 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement