తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మెన్ మాట్లాడుతూ.. ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంప్రోక్షణలో దాదాపు 30 వేల మంది భక్తులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
టీటీడీ: తొమ్మిది రోజుల పాటు వెంకన్న దర్శనం రద్దు
Jul 14 2018 12:45 PM | Updated on Mar 20 2024 3:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement