సాధారణంగా సినిమాల్లో మాత్రమే ఇలాంటి సీన్ సాధ్యం అవుతుంది. అది కూడా ఎన్నో టేక్‌లు తీసుకుంటేనో అది కుదురుతుంది. ఇంతకు ఏమిటా సీన్ అనుకుంటున్నారా..! అదో దొంగతనం సీన్. అయితే సినిమా షూటింగ్ ద్వారా తీసింది కాదు.. వాస్తవంగా జరిగిన సీన్.. చక్కగా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అదొక సూపర్ మార్కెట్.. దానికి అద్దాలతో ఏర్పాటుచేసిన ప్రవేశం ఉంది. ప్రత్యేకంగా గోడలంటూ ఏమీ లేవు. అందులోనే ఓ ఏటీఎం మెషిన్ కూడా ఉంది. దానిపై దొంగల కన్నుపడింది. ఎలాగైనా దానిని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.