ఆంధ్రప్రదేశ్‌తో గతంలో చాలా వివాదాలు ఉండేవని.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సమస్యల పరిష్కారం దిశగా చర్చలు జరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21 ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంగళవారం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు.