అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఇతరత్రా అంశాలపై కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసింది. సిట్టింగ్ నేతలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికలపై ఆందోళన అక్కర్లేదని, అసెంబ్లీ ఎన్నికలు జరిగినా 106 సీట్లలో తమదే విజయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ, మండలి సమావేశాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించారు. దేశ వ్యాప్తంగా మార్పు కోసమే థర్డ్ ఫ్రంట్ ఆలోచన చేశానన్న కేసీఆర్.. అసెంబ్లీలో అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ నేతలకు సూచించారు