2018–19 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అత్యంత కీలకంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావటంతో ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల ఏడాదికి ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికిది నాలుగో బడ్జెట్.